News


సూచీలు పరుగులు తీసినా...అధికశాతం షేర్లు నష్టాల్లోనే!

Tuesday 26th November 2019
Markets_main1574761049.png-29872

బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త రికార్డులను అందుకున్నప్పుడు విస్తృతంగా స్టాకులు పెరగాలి. కానీ ఇండియా ఈక్విటీ మార్కెట్లలో చాలా వరకు షేర్లు పడిపోగా, భారీగా పెరిగిన స్టాకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ​కేవలం కొంత మంది ఇన్వెస్టర్లు మాత్రమే గత కొన్ని నెలలలో టాప్‌ 15-20 స్టాకులలో పెట్టుబడులు పెట్టారు. కాగా దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడంతో విస్తృత మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయి. ఫలితంగా సూచీలు మంచి ప్రదర్శన చేసినప్పటికి, సగటు పోర్టుఫోలియోలోని స్టాకులు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. గతేడాది జనవరి 1 నుంచి, నవంబర్‌ 25 2019 వరకు కాల వ్యవధిలో సెన్సెక్స్‌ 21 శాతం పెరగగా, ఇదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 16 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 30 శాతం పడిపోయాయి. అదేవిధంగా నిఫ్టీ 16 శాతం పెరిగితే, నిఫ్టీ నెక్ట్స్‌ 50 8 శాతం పడిపోయింది. 
   మ్యూచువల్‌ ఫండ్స్‌ను సెబీ పునర్‌ వర్గీకరించడం, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, స్థూల ఆర్థిక డేటా, ట్రేడ్‌వార్‌ ఒత్తిళ్లు వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను గత 23 నెలల నుంచి నడిపిస్తున్నాయి. తాజాగా సెన్సె‍క్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 50 12,132 వద్ద ఆల్‌ టైం గరిష్ఠాలకు చేరకున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నప్పటికి, బీఎస్‌ఈ 500 స్టాకులలో 75 శాతం స్టాకులు 90 శాతానికి పైగా పడిపోయాయి. ‘అంతర్జాతీయ ఆర్థిక ‍వ్యవస్థ తిరిగి పుంజుకుంటే, ఇన్వెస్టర్లు తమ క్యాపిటల్‌ కేటాయింపులను విస్తృత స్టాకులలో తిరిగి పెంచుకుంటారు.అగష్టు నెలతో పోల్చుకుంటే, అక్టోబర్‌, నవంబర్‌ నెలలు బాగున్నాయి. వాస్తవిక రికవరి వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభయ్యే అవకాశం ఉంది’ అని ఎండీ, సీఈఓ, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌, ధిరజ్‌ రెల్లి అన్నారు. ప్రస్తుత మందగమనాన్ని నడిపించే అంశాలు తాత్కాలికమని అభిప్రాయపడ్డారు.  
    గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు గల కాలవ్యవధిలో ప్రోక్టర్‌ అండ్‌ గాంబుల్‌ 221 శాతం పెరిగింది. బీఎస్‌ఈ500 ఇండెక్స్‌లో అధికంగా వృద్ధి చెందిన స్టాక్‌ ఇదే. ఆ తర్వాత బజాజ్‌ ఫైనాన్స్‌(140 శాతం), ఆస్ట్రజెనెకా ఫార్మా(132 శాతం), అబాట్‌ ఇండియా(130 శాతం), నిట్‌ టెక్నాలజీస్‌(130 శాతం), బాటా ఇండియా(118 శాతం) షేర్లు అధికంగా లాభపడిన షేర్లలో ముందున్నాయి. మరోవైపు ఇదే కాలంలో రిలయన్స్‌ కమ్యునికేషన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ పవర్‌, పీసీ జువెలరీ, జై ప్రకాశ్‌ అసోషియేట్స్‌, శ్రేయ్‌ ఇన్ఫ్రా, జైన్‌ ఇరిగేషన్‌ వంటి షేర్లు 90 శాతం పడిపోయాయి. ‘పడిపోయినప్పుడు కొనుగోలు చేయడం’ వ్యూహాన్ని ప్రస్తుత మార్కెట్లో అనుసరించడం మంచిదని యాక్సిస్‌ సెక్యురిటీస్‌ చార్టిస్ట్‌ రాజేష్‌ పల్వియా అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌) పైకి కదులుతోంది. అంతేకాకుండా ఇది రిఫరెన్స్‌ లైన్‌ కంటే పైన ముగిసింది. మార్కెట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఉందనే సంకేతాన్ని ఇది ఇస్తోంది. కానీ మూమెంటం ఆసిలేటర్‌ స్టోచస్టిక్‌ ఇప్పటికి కూడా బేరిష్‌గానే ఉంది. ఇది మార్కెట్‌లో కన్సాలిడేషన్‌ జరిగే అవకాశం ఉందనే సంకేతాన్ని ఇస్తుంది’ అని తెలిపారు. You may be interested

రికార్డుస్థాయిని అందుకున్న నిఫ్టీ షేర్లు రెండే..!

Tuesday 26th November 2019

మార్కెట్‌ మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైం హైని తాకింది. ప్రధాన సూచీలైన సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ముఖ్యంగా సెన్సెక్స్‌ కొద్దిరోజుల క్రితం కొత్త రికార్డును నెలకొల్పినా, ఈ ఫీట్‌ సాధించడంలో వెనుకబడి వున్న నిఫ్టీ ఎట్టకేలకు మంగళవారం కొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ప్రతిసారీ

42 కౌంటర్లలో ఎంఏసీడీ బై సిగ్నల్‌!

Tuesday 26th November 2019

సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, టాటాస్టీల్‌ బీఎస్‌ఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఆదిత్యబిర్లా మనీ, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎరిక్‌ లైఫ్‌సైన్సెస్‌ తదితరాలున్నాయి. ఈ

Most from this category