News


నిఫ్టీ 220, సెన్సెక్స్‌ 630 పాయింట్ల పతనం

Tuesday 1st October 2019
Markets_main1569920974.png-28657

స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో పాటు, సెప్టెంబర్‌ నెలకు సంబంధించి దిగ్గజ ఆటో కంపెనీల వాహన అమ్మకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం 2శాతానికి పైగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తడంతో బెంచ్‌మార్క్‌ సూచీలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం 2.19 సమయానికి నిఫ్టీ 220.80 పాయిట్లు నష్టపోయి 11,253.65 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 639.1 పాయింట్లు నష్టపోయి 38,021.66 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 710.05 పాయింట్లు నష్టపోయి 28,393.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
  నిఫ్టీ 50 లో బీపీసీఎల్‌(భారత పెట్రోలియం) 2.83 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.37 శాతం, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 0.12 శాతం లాభపడి పాజిటివ్‌గా ట్రేడవుతున్న షేర్లలలో ముందున్నాయి. అదేవిధంగా యెస్‌ బ్యాంక్‌ 22.22 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 13.75 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.77 శాతం, ఎస్‌బీఐ 8.47 శాతం, గ్రాసీమ్‌ 5.01 శాతం నష్టపోయి నెగిటివ్‌లో ట్రేడవుతున్న షేర్లలో ముందున్నాయి.   



You may be interested

అక్టోబర్‌1 నుంచి ఈ మార్పులు గుర్తించండి!

Tuesday 1st October 2019

సాధారణ ప్రజల ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేసే ఐదు మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి... 1. రుణాలపై వడ్డీరేట్లలో మార్పులు: ఆర్‌బీఐ ఆదేశించిన ప్రకారం ఒకటి నుంచి అన్ని ఫ్లోటింగ్‌ రేట్‌ సంబంధిత రుణాలపై రేటును బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుసంధానించనున్నారు. దీనివల్ల వ్యక్తిగత, హౌసింగ్‌, ఆటో తదితర రుణాలపై రేట్లు తగ్గవచ్చు. ప్రతిమూడు నెలలకు ఒకసారి బ్యాంకులు ఈ బహిర్గత బెంచ్‌మార్క్‌ రేటుకు అనుగుణంగా తమ

నష్టాల్లో రియల్టీ రంగ షేర్లు

Tuesday 1st October 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా రియల్టీ ఇండెక్స్‌ మంగళవారం 4శాతానికి పైగా నష్టపోయింది. మార్కెట్‌ సెంటిమెంట్, ఆర్ధిక మందగమనం, సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ రద్దుతో పాటు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ కుంభకోణాలతో రియల్టీ రంగ తీవ్ర ఒడిదుడులను ఎదుర్కోంటుంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా గృహాల అమ్మకాలు 18శాతం క్షీణించడం సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఈ నేపథ్యంలో నేడు రియల్టీ షేర్లు తీవ్ర

Most from this category