News


గంటన్నరలో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రూ.2లక్షల కోట్లు

Tuesday 4th February 2020
Markets_main1580800128.png-31498

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా డిమాండ్‌ తగ్గుదల భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 13నెలల కనిష్టానికి పతనం కావడం దేశీయంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ కేవలం 90నిమిషాల్లో రూ.2లక్షల కోట్ల లాభపడింది. మార్కెట్‌ ముగిసే సరికి బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.153.72లక్షల కోట్లుండగా, మిడ్‌ సెషన్‌ కల్లా రూ.155.72లక్షల కోట్లకు ఎగిసింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజున జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌ సందర్భంగా నాడు బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ మొత్తం రూ.3.46 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైన సంగతి తెలిసిందే. మార్కెట్‌ ప్రారంభం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 741 పాయింట్లు పెరిగి 40,613 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు లాభపడి 11,924 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. 



You may be interested

52 వారాల గరిష్టానికి 40 షేర్లు

Tuesday 4th February 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 40 షేర్లు 52 వారాల గరిష్టానికి  చేరాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అల్‌కెమ్‌ ల్యాబొరేటరీస్‌,  ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, బర్గర్‌ పెయింట్స్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌(ఇండియా), కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, డాబర్‌ ఇండియా, దీపక్‌ నైట్రైట్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, జీఎంఎం ఫాడ్‌లర్‌, హిందుజా గ్లోబ్‌ సొల్యూషన్స్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, ఇన్ఫోబీమ్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి.   52 వారాల

వేల్యూ, డివిడెండ్‌ స్టాక్స్‌కే పట్టం?!

Tuesday 4th February 2020

- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ  రుణ వృద్ధి 6-7 శాతం స్థాయిలో నమోదవుతుంటే.. ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవకాశాలు తక్కువేనంటూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐవో ఎస్‌.నరేన్‌ పేర్కొంటున్నారు. బ్యాంకులు భారీ నగదు నిల్వలు కలిగి ఉన్నప్పటికీ రుణాల విడుదలకు ఆసక్తి చూపడంలేదని తెలియజేశారు. రుణ వితరణకు ఎందుకు ముందుకు రావడంలేదన్న అంశంపై బ్యాంకులు వివరణ ఇవ్వవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్లతోపాటు.. డివిడెండ్‌

Most from this category