News


మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి లాభాల్లోకి సూచీల్లోకి..

Monday 26th August 2019
Markets_main1566805847.png-28022

ఆరంభలాభాల్ని నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు సెన్సెక్స్‌ 493 పాయింట్లు లాభంతో 37194.33 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 10969.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల జరుగుతున్న వాణిజ్య యుద్ధ పరిష్కారం దిశగా త్వరలో చర్చలు జరగవచ్చనే అంశంతో తెరపైకి రావడంతో అమెరికా ఫ్యూచర్స్‌ ఒక్కసారిగా లాభాల్లోకి రావడంతో ఆసియా మార్కెట్లపై కొంతవరకు అమ్మకాల ఒత్తిడి తగ్గింది. అలాగే అంతర్జాతీయంగా ముడిచమురు ధరల మూడో దిగిరావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్‌ నేటి ఇంట్రాడే కనిష్ట (36,492.65) స్థాయి నుంచి 768 పాయింట్ల రికవరితో 37,260 వద్ద, నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 10,756.55 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. అయితే అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బలహీన పరిస్థితులు నెలకొనడం, మూడీస్‌ రేటింగ్‌ సం‍స్థ ఈఏడాది దేశీయం జీడీపీ వృద్ది అంచనాను 6.2శాతానికి తగ్గించడం తదితర అంశాలతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠం నుంచి 872 పాయింట్లను కోల్పోయి 36,492 వద్ద, నిఫ్టీ 244 పాయింట్లు నష్టపోయి 10,756.55 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

భారత్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసిన నోమురా

Monday 26th August 2019

సెన్సెక్స్‌ ఏడాది టార్గెట్‌ 40వేలు జపాన్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం నోమురా తాజాగా భారత రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు మార్కెట్లో ఉత్సాహం పెంచుతాయని, అందువల్ల ఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌ 40వేల పాయింట్లని అంచనా వేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ అస్థిరతల వేల స్థానికంగా పాజిటివ్‌ డెవలప్‌మెంట్స్‌పై నిధులను వెచ్చించాల్సిన సమయమిదని సూచించింది. ఎకానమీకి తాజాగా ప్రకటించిన ప్రోత్సాహకాలు, ప్రకటనలు మంచి ఉత్సాహమిస్తాయని అభిప్రాయపడింది. ఆర్థికసంవత్సరం

5 శాతం నష్టపోయిన టాటాస్టీల్‌

Monday 26th August 2019

అంతర్జాతీయ పరిణామాలతో పాటు, గత కొన్ని సెషన్ల నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉన్న టాటా స్టీల్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం మేర పతనమయ్యి రూ. 322.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాగా దేశీయ మార్కెట్‌లు తిరిగి లాభాల్లోకి రావడంతో ఈ షేరు రికవరి అయ్యింది. టాటా స్టీల్‌ మధ్యాహ్నాం 12.53 సమయానికి 2.69 శాతం నష్టపోయి రూ. 335.95 వద్ద ట్రేడవుతోంది. కాగా గత

Most from this category