News


ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు సెబీ షాక్‌...!

Monday 16th September 2019
Markets_main1568624364.png-28403

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు కొత్తగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయమంటూ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ను సెబీ ఆదేశించడంతో ఈ కంపెనీ షేర్లు సోమవారం 17.50శాతం నష్టపోయాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.109.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు చెందిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు అనుమతించమంటూ కంపెనీ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పించింది. నిబంధనలు విరుద్ధంగా ఉన్న కారణంగా సెబీ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ను ప్రతిపాదనను తిరస్కరించింది. నిబంధనలకు అనుగుణంగా, ప్రామాణిక ప్రమాణాలతో మళ్లీ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా సెబీ సూచించింది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై 17.50శాతం నష్టపోయి రూ.96.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20లకు షేర్లు కిత్రం ముగింపు ధర(రూ.117.05)తో పోలిస్తే 12.50శాతం నష్టపోయి రూ.102.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.77.85, రూ.149.00 గా నమోదయ్యాయి. 



You may be interested

మూడు వారాల్లో రాబడినిచ్చే 12 షేర్లు

Monday 16th September 2019

  చమురు ధరలు భారీగా పెరగడంతో దేశియ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.00 సమయానికి సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేర కోల్పోగా, నిఫ్టీ కీలక స్థాయియైన 11,000 కిందకి పడిపోయింది. ‘చమురు, రూపీ-డాలర్‌లలో ఏర్పడే మార్పులు దేశియ మార్కెట్లను తీవ్రంగా ప్రభావం చూపుతాయి. చమురు, డాలర్‌ మారకంలో రూపీ సెషన్‌ ప్రారంభంలో పెరగడంతో దేశియ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి’ అని రిలయన్స్‌ సెక్యురిటీస్‌ తెలిపింది.

నష్టాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Monday 16th September 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు సోమవారం భారీ పతననాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌  2,487.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ రంగ షేర్ల తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడేలో 1.65శాతం మేర నష్టపోయి 2,470.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.1:20ని.లకు

Most from this category