News


9 నెలల్లో రుణ రహితంగా ఇమామీ!

Sunday 11th August 2019
Markets_main1565547848.png-27693

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ ఇమామీ వచ్చే 9 నెలల్లో రుణ భారాన్ని పూర్తిగా తొలగించుకోనుంది. ప్రస్తుతానికి కంపెనీ రుణ భారం రూ.2,600 కోట్లుగా ఉంది. గ్రూపు కంపెనీల రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన మార్గాలు ఉన్నాయని ఇమామీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ గోయంకా తెలిపారు. పర్సనల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులు, పేపర్‌, హాస్పిటల్స్‌, వంట నూనెలు, బయో డీజిల్‌, సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ చైన్లు, విద్యుత్‌ తదితర రంగాల్లో ఇమామీ గ్రూపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 

 

ఈ గ్రూపునకు చెందిన ఫార్మసీ చైన్‌ ఇమామీ ఫ్రాంక్‌ రాస్‌ లిమిటెడ్‌ రేటింగ్‌ను ఇటీవలే ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఐఎన్‌డీ బీబీబీప్లస్‌కు తగ్గించింది. ‘‘గ్రూపు కంపెనీల రుణాలన్నింటినీ చెల్లించే స్థితిలో ఉన్నాం. గత నాలుగు నెలల్లో రూ.2,800 కోట్లు చెల్లించాం. గ్రూపు ప్రమోటర్ల రుణ భారం ప్రస్తుతానికి రూ.2,600 కోట్లుగా ఉంది. వచ్చే 9 నెలల్లో గ్రూపు రుణ రహితంగా మారుతుంది. ప్రమోటర్లు ఈ దిశలోనే పనిచేస్తున్నారు’’ అని గోయంకా వెల్లడించారు. ఇమామీ గ్రూపు ప్రమోటర్లు రుణ రహితంగా మారేందుకు ఎన్నో ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇందులో అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో వాటాలను విక్రయించడం ఒకటి. అయితే, వాటాల విక్రయం విషయమై గోయంకా మరిన్ని వివరాలు వెలల్డించలేదు. ప్రధానం కాని వ్యాపారాల్లో వాటాలు విక్రయించడం కూడా తమ ముందున్న ఆప్షన్లలో ఒకటిగా తెలిపారు. 

 

ఇమామీ గ్రూపునకు ఏఎంఆర్‌ఐ హాస్పిటల్స్‌, ఫార్మసీ చైన్‌ ఫ్రాంక్‌ రాస్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. ఇప్పటికే ఇమామీ సిమెంట్‌ ఐపీవో కోసం సెబీ వద్ద దరఖాస్తు కూడా దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. ఇమామీ గ్రూపునకు ఫ్రాంక్‌ రాస్‌లో 74.89 శాతం వాటా, ఏఎంఆర్‌ఐ హాస్పిటల్స్‌లో 98.02 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఇమామీ లిమిటెడ్‌ ఈ గ్రూపు ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ కాగా, ఇందులో ప్రమోటర్లు తమ వాటాల్లోంచి ఇప్పటికే 20 శాతం విక్రయించారు. దీని ద్వారా రూ.2,830 కోట్లు సమకూరాయి. వీటితో రుణ భారాన్ని సగానికి తగ్గించుకున్నారు. దీంతో ఇమామీలో వీరి వాటి 52 శాతానికి తగ్గింది. You may be interested

దీన్ని బోటమ్‌ అని చెప్పడం కష్టం: క్యాపిటల్‌ ఎయిమ్‌

Sunday 11th August 2019

మార్కెట్‌లో ఇది కనిష్టం, ఇది గరిష్టం అని చెప్పడం కష్టమని, ఇన్వెస్టర్లు ఈ దశలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ విభాగంలో పెట్టుబడుల పరంగా దూకుడుగా వ్యవహరించకుండా ఉండాలని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారి సూచించారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను దీర్ఘకాలానికి ఎంచుకోవాలని సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.    ‘‘ఇటీవలి 11,000లోపు కనిష్టాల నుంచి నిఫ్టీ-50 తిరిగి వెనక్కి పుంజుకోవడం

రుణాల చెల్లింపులకై నిధులను కోరిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Sunday 11th August 2019

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫైనాన్స్‌ సంస్థ, దివాన్‌ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) తన రిటైల్ కస్టమర్లకు, ప్రాజెక్ట్ డెవలపర్లకు చెల్లించడానికి వెంటనే బ్యాంకుల నుంచి రూ .15 వేల కోట్లు కోరిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా రిజల్యూషన్‌ను డ్రాఫ్ట్‌ ప్రణాళికను ఈ సంస్థ రుణదాతలకు సమర్పించింది. ‘తీవ్ర నగదు కొరత వలన ఆగిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు’ అని పరిశీలకులు తెలిపారు. కంపెనీ రిజల్యూషన్‌

Most from this category