News


ఈ సూచీలో గోల్డెన్‌ క్రాస్‌.. మన సూచీలకు పాజిటివ్‌!

Friday 13th December 2019
Markets_main1576211454.png-30204

ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ(ఎంఎస్‌సీఐ ఈఎం ఇండెక్స్‌)లో తాజాగా ఏర్పడిన గోల్డెన్‌ క్రాస్‌ దేశీయ ఈక్విటీలు మరింత పాజిటివ్‌గా ఉంటాయనేందుకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండోసారీ ఈఎం ఇండెక్స్‌లో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడింది. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ కిందనుంచి పైకి దీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖను ఖండించడాన్ని గోల్డెన్‌ క్రాస్‌ అంటారు. టెక్నికల్‌గా 50 డీఎంఏ రేఖ దిగువనుంచి ఎగువకు 200 డీఎంఏ రేఖను ఖండిస్తే గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడినట్లు భావిస్తారు. తాజాగా ఎంఎస్‌సీఐ ఈఎం ఇండెక్స్‌లో 50 డీఎంఏ 1038 వద్దకు, 200 డీఎంఏ 1033 వద్దకు చేరాయి. దీంతో గోల్డెన్‌క్రాస్‌ ఫార్మేషన్‌ జరిగినట్లయింది.

ఈ ఏడాది మార్చిలో ఒకసారి ఈఎంఇండెక్స్‌లో ఈ క్రాస్‌ ఏర్పడింది. అనంతరం ఈఎం సూచీ దాదాపు 6 శాతం ర్యాలీ చేసింది. అదే సమయంలో మన సూచీలు కూడా అప్‌మూవ్‌ చూపాయి. తాజాగా మరోమారు ఈ క్రాస్‌ ఏర్పడడంతో ఇండెక్స్‌లపై నిపుణులు పాజిటివ్‌గా మారారు. దేశీయ సూచీల్లో కొద్ది రోజుల క్రితమే ఈ గోల్డెన్‌క్రాస్‌ ఏర్పడింది. సూచీల తదుపరి పరుగులు ప్రస్తుతం అనేక అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ట్రేడ్‌వార్‌, బ్రెగ్జిట్‌, కేంద్రబ్యాంకుల వ్యాఖ్యలు.. ప్రపంచ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయి. 



You may be interested

యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

Friday 13th December 2019

చైనా, అమెరికా మధ్య ఫేజ్‌ 1 ట్రేడ్‌డీల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల 15న చైనాపై విధించాలిన్న కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావు. గురువారం ఈ ట్రేడ్‌ డీల్‌పై ట్రంప్‌ తన న్యాయ సలహాదారులతో చర్చించారు. యూఎస్‌ వ్యవసాయోత్పత్తులను చైనా మరింతగా కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని సదరు వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రతిగా చైనాపై ప్రస్తుతం విధించిన కొన్ని

మెటల్‌ షేర్లకు ట్రేడ్‌ డీల్‌ జోష్‌..!

Friday 13th December 2019

3శాతం ఎగిసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా ఫేజ్ వన్ వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో మార్కెట్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం లాభపడింది.చైనాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు దిగుమతయ్యే 160 బిలియన్ డాలర్ల విలువైన చైనా వినియోగ

Most from this category