News


వర్ధమాన మార్కెట్లకు కొత్తేడాది కలిసివస్తుంది!

Wednesday 1st January 2020
Markets_main1577853432.png-30580

నిపుణుల అంచనా
అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లతో పోలిస్తే దశాబ్దకాలంగా వెనకంజ వేస్తూ వస్తున్న వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ట్రెండ్‌ రివర్సల్‌ చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. వర్ధమాన మార్కెట్ల(ఈఎం) వాల్యూషన్లు చౌకగా మారడం, ఈ దేశాల కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌లో వృద్ధిపై పెరిగిన అంచనాలు.. ఈఎంలను కొత్త ఏడాది పుంజుకునేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఈఎంల్లో పెట్టుబడులు పెంచుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ జీడీపీలో వర్ధమాన మార్కెట్ల వాటా దాదాపు సగం ఉంటుంది. గత దశాబ్దంలో ఈఎంలు డాలర్‌ లెక్కల్లో 14 శాతం రాబడినిచ్చాయి, ఇదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లు దాదాపు 101 శాతం రాబడులు అందిచాయి. ‘‘సాధారణంగా ఈఎంల్లో బేర్‌ మార్కెట్‌ దాదాపు 10-16 సంవత్సరాలు సాగుతుంది. ఆపై బుల్‌ హవా ఆరంభమవుతుంది. ఈ లెక్కన చూస్తే ఈఎంలు బుల్‌ దశకు చాలా దగ్గరలో ఉన్నట్లు భావించవచ్చు.’’ అని సీఎల్‌ఎస్‌ఏ నిపుణుడు లారెన్స్‌ బ్లాంకో చెప్పారు. 2020లో ఎంఎస్‌సీఐ ఈఎం సూచీ 14 శాతం రాబడిని ఇవ్వవచ్చని అంచనా వేశారు. 


కారణాలనేకం..
ఈఎంల్లో బుల్‌ట్రెండ్‌ ఆరంభమయ్యేందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పీఎం సూచీ బాటమ్‌అవుట్‌ అవుతున్న సంకేతాలున్నాయి. ఇది రికవరీ బాట పట్టినప్పుడల్లా ఈఎంలు మంచి పనితీరు కనబరచడం గతంలో జరిగింది. దీంతోపాటు ఈఎం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ అంచనాలను నిపుణులు పెంచారు. 2020లో డీఎంల్లో 9 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌, ఈఎంల్లో 14 శాతం ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పదేళ్లుగా డీఎంల ఎర్నింగ్స్‌గ్రోత్‌లో కేవలం సగం మాత్రమే ఈఎంల ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఉండేది. వాల్యూషన్లు కూడా వర్దమాన మార్కెట్లకు అనుకూలంగా ఉన్నాయి. 1997 ఆసియా సంక్షోభ సమయంలో ఉన్న వాల్యూషన్లు ప్రస్తుతం ఈఎంల్లో కనిపిస్తున్నాయి. ఈఎంల పీఈ డీఎంల పీఈ కన్నా 24 శాతం డిస్కౌంట్‌లో ఉంది. డాలర్‌ బలపడడం ఈఎంలపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంటుంది. ఎనిమిదేళ్లుగా డాలర్‌ ప్రతిఏడూ వార్షిక వృద్ధినే నమోదు చేసింది. సాధారణంగా డాలర్‌ బుల్‌ సైకిల్‌ 7-8 ఏళ్లకు ముగుస్తుంది. ఈ లెక్కన డాలర్‌ ఈ ఏడాది దిగివచ్చే ఛాన్సులున్నాయి. ట్రేడ్‌ వార్‌ ముగింపు దిశగా పయనిస్తుండడం, అల్ప వడ్డీరేట్లు, ఈఎంల కరెన్సీలు బలపడడం.. వంటివన్నీ వర్దమాన మార్కెట్లకు కొత్త ఏడాది శుభసూచకాలేనని క్రెడిట్‌ సూసీ తదితర దిగ్గజ సంస్థలు భావిస్తున్నాయి. You may be interested

లాభాల్లో అదానీ గ్రీన్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌

Wednesday 1st January 2020

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది సెలవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ కనిపించడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 107 పాయింట్లు పెరిగి 41,360కు చేరింది. నిఫ్టీ సైతం 31 పాయింట్లు పుంజుకుని 12,200 వద్ద ట్రేడవుతోంది. కాగా.. వార్తల ఆధారంగా ఓవైపు అదానీ గ్రీన్‌ ఎనర్జీ,

కొత్త ఏడాది తొలిరోజున శుభారంభం

Wednesday 1st January 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 12200 పైన ప్రారంభమైన నిఫ్టీ  కొత్త ఏడాది తొలిరోజున భారత మార్కెట్‌ శుభారంభం చేసింది. నూతన సంవత్సరానికి సూచీలు లాభాలతో స్వాగతం పలికాయి. అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 96 పాయింట్లు లాభంతో 41349 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 12200పై 12,202.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు

Most from this category