News


ఫండ్స్‌, ప్రమోటర్లు కలిసి కొన్న షేర్లివే..!

Friday 24th January 2020
Markets_main1579863142.png-31178

డిసెంబర్‌ క్వార్టర్‌లో  సూచీలు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కోన్నాయి. ఈ క్యూ3 కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎఫ్‌పీఐలు, ప్రమోటర్లు యాదృచ్ఛికంగా 8 స్టాక్‌లను కొనుగోలు చేశారు. ఫలితంగా ఈ 8 షేర్లు కలిగిన ఇన్వెస్టర్లు ఓ మోస్తారు లాభాలను గడించారు. 

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, పైప్‌మేకర్‌ వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ రిటైలర్‌ వైభవ్‌ గ్లోబల్‌, పేపర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌, షిప్‌యార్డ్‌ దిగ్గజం గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ సంస్థ వోల్టాంప్ ట్రాన్స్‌ ఫార్మార్స్‌, పంప్స్‌ ఉత్పత్తి డబ్ల్యూపీఐల్‌, ఫెర్రో మిశ్రమ తయారీ సంస్థ నవ భారత్‌ వెంచర్‌లు వాటిలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఇంకా మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయలేదు. సాదారణంగా ప్రమోటర్లు వాటాను పెంచడం షేరుకు సానుకూలాంశంగా ఉంటుంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు షేరు కొనుగోలుకు మొగ్గుచూపినపుడు, షేరు మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

“సాధారణంగా, పెద్ద సంస్థలు ఓపెన్ మార్కెట్ నుండి అవసరమైన పరిమాణంలో వాటాలను కొనడం కష్టమని బ్లాక్‌ డీల్స్‌ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. కాబట్టి ప్రమోటర్స్‌ అమ్మకపోతే మరి ఎవరు అమ్ముతారు. అలాగే, పరిమాణం ఇక్కడ ముఖ్యమైనది. ఇది నమ్మకం యొక్క స్థాయిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 1 బిలియన్ డాలర్ల ఫండ్ 1 మిలియన్ డాలర్ల విలువైన పొజిషన్‌ తీసుకుంటే అందులో చెప్పుకొవడానికి ఏమీ ఉండదు.’’ అని అభిషేక్ బసుమల్లిక్, ఇంటెల్సెన్స్ క్యాపిటల్‌ చీఫ్ ఈక్విటీ సలహాదారు అభిప్రాయపడ్డారు. 

 ప్రసిద్ధ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లకు ఈ కంపెనీలలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు. విజయ్‌ ఖేడియా, అశిష్‌ ఖచోలియాలు వైభవ్‌ గ్లోబల్‌లో డిసెంబర్‌ 31నాటికి 1శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. 

ఈ స్టాక్‌లు 52-వారాల గరిష్టం నుంచి 32శాతం పతనమైనప్పటికీ.., నాలుగు మాత్రం ఏడాది కాలంలో  128శాతం లాభపడ్డాయి. డిసెంబర్‌ క్వార్టర్లో సెన్సెక్స్‌, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు 4-7శాతం లాభపడ్డాయి. 

సెప్టెంబర్‌ చివరి నాటికి గోద్రేజ్‌ కంపెనీలో ప్రమోటర్ల వాటా 61.38శాతంగా ఉంది. అయితే డిసెంబర్‌ నాటికి  61.39శాతానికి పెంచుకున్నారు. క్యూ3లో  మ్యూచువల్‌ ఫండ్ల వాటా 0.39శాతం పెరిగి మొత్తం 11.99శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల వాటా 0.13శాతం పెరిగి 11.99శాతానికి చేరుకుంది. జనవరి 22 తేదిన రూ.523గా ఉన్న షేరు సరిగ్గా ఏడాది కాలంలో 17శాతం క్షీణించి రూ.435.60 చేరుకుంది. ప్రమోటర్ల వాటా సెప్టెంబర్‌ చివరి నాటికి 57.28శాతంగా ఉండగా, డిసెంబర్‌ చివరి నాటికి 58.23శాతానికి చేరుకుంది. 

విజయ్‌ ఖేడియా, అశిష్‌ ఖచోలియాలు వైభవ్‌ గ్లోబల్‌లో డిసెంబర్‌ 31నాటికి 1శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు.  ప్రమోటర్ల వాటా సెప్టెంబర్‌ చివరి నాటికి 57.28శాతంగా ఉండగా, డిసెంబర్‌ చివరి నాటికి 58.23శాతానికి చేరుకుంది. సమీక్షిస్తున్న కాలంలో మ్యూచువల్‌ ఫండ్ల వాటా 7.03 నుంచి 7.15శాతానికి పెరగ్గా, ఎఫ్‌ఐఐల 12.33శాతం నుంచి 12.38శాతానికి చేరుకుంది. ఏడాది కాలంలో షేరు 30శాతం ర్యాలీ చేసింది. వైభవ్‌ గ్లోబల్‌ మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు చేస్తాయని విజయ్‌ ఖేడియా అభిప్రాయపడ్డారు. 

పైన పేర్కొన్న ఎనిమిది షేర్లలో గార్డెన్‌ రీచ్‌ షిప్‌యార్స్‌ కంపెనీ షేరు 128శాతం ర్యాలీ చేసి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఈ కంపెనీలో డిసెంబర్‌ 31నాటికి ఎల్‌ఐసీ 5శాతం వాటాను కలిగి ఉంది.  ఈ తర్వాతి స్థానంలో వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ 44శాతం, తదుపరి స్థానంలోవోల్టాంప్ ట్రాన్స్‌ ఫార్మార్స్‌ 18శాతం లాభాన్ని గడించాయి. డిసెంబర్‌ 31నాటికి ఎల్‌ఐసీ 5శాతం వాటాను కలిగి ఉంది. 

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, వోల్టాంప్ ట్రాన్స్‌ ఫార్మార్స్‌ షేర్లు ఏడాది గరిష్టస్థాయిల నుంచి వరుసగా 18శాతం, 5.50శాతం నష్టపోయాయి. డబ్ల్యూపీఐఎల్‌, నవభారత్‌ వెంచర్‌, వెస్ట్‌ కోస్ట్‌ మిల్స్‌ కంపెనీలు ఏడాది కాలంలో 14-20శాతం నష్టాలను చవిచూశాయి. డబ్ల్యూపీఐల్‌ కంపెనీ పంపులు, పంపులు, పంపుల విడిభాగాలు, ఉపకరణాలను తయారు చేస్తుంది. You may be interested

బడ్జెట్‌కు సేఫ్‌ బెట్స్‌

Saturday 25th January 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. దీనిపై చాలా వర్గాల్లో ఎన్నో అంచనాలు, ఆకాంక్షలు ఉన్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గిపోయిన సమయంలో వస్తున్నందున ఈ బడ్జెట్‌కు ఎక్కువ ప్రాధాన్యమే ఉంది. ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి బీమా కంపెనీలు సురక్షితమైనవిగా ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. వివిధ రంగాలపై

మెటల్‌ షేర్ల జోరు

Friday 24th January 2020

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మెటల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. దాంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతం పెరిగి 2,796.20 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 5 శాతం పెరిగి 189.00వద్ద, హింద్‌ కాపర్‌ 4.11 శాతం పెరిగి 46.90 వద్ద, కోల్‌ఇండియా 2 శాతం పెరిగి 194.40 వద్ద, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.73 శాతం పెరిగి 271.25 వద్ద, నేషనల్‌ అల్యూమినియం 1.30 శాతం పెరిగి 46.65

Most from this category