News


కొత్త ఏడాది కోసం కాంట్రాబెట్స్‌

Monday 23rd December 2019
Markets_main1577088327.png-30381

వచ్చే సంవత్సరంలో మంచి రాబడినిచ్చే అవకాశమున్న కాంట్రా స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. ఐటీసీ: ఈ ఏడాది ఐటీసీ దాదాపు 14 శాతం పతనమైంది. సిగిరెట్లపై అధిక సెస్సు భయాలు షేరును కుంగదీశాయి. అయితే అలాంటి ప్రతిపాదనలేమీ రానందున ఇకపై షేరు పుంజుకుంటుందని మోతీలాల్‌ఓస్వాల్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తున్నాయి. వాల్యూం గ్రోత్‌ క్రమంగా పెరుగుతోందని తెలిపాయి. ప్రస్తుత వాల్యూషన్ల వద్ద చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు వివరించాయి. షేరు భవిష్యత్‌ ఆర్‌ఓఈ, డివిడెండ్‌ ఈల్డ్‌ బలంగా ఉంటాయని తెలిపాయి. ఏడాది కాలానికి రూ. 320 టార్గెట్‌గా కోటక్‌ పేర్కొంది. 
2. లుపిన్‌: జపాన్‌ కార్యకలాపాల విక్రయంతో రూ. 3700 కోట్లు సాధించుకుంది. ఈ మొత్తం కంపెనీ బాలెన్స్‌షీటును బలోపేతం చేస్తుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. దీంతోపాటు ఇకపై ఇండియా, యూఎస్‌ వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలిపింది. యూఎస్‌ మార్కెట్లో పుంజుకోవడం రాబోయే రోజుల్లో లాభాలను, రిటర్న్‌ నిష్పత్తులను పెంచుతుందని అంచనా వేసింది. ప్రస్తుత షేరు వాల్యూషన్లు రిస్కురివార్డు నిష్పత్తి కోణంలో ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలిపింది. 
3. ఎస్కార్ట్స్‌: ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ట్రాక్టర్‌ విభాగం పుంజుకుంటుందని కోటక్‌ అంచనా వేస్తోంది. సాధారణ వర్షపాతం నమోదు కావడం, రబీ పంటలకు ఎంఎస్‌పీ పెరగడంతో ట్రాక్టర్‌ విభాగం కోలుకోవచ్చు. దీంతో కంపెనీ వచ్చే రెండేళ్ల పాటు మంచి వృద్ధి సాధించగలదు. కొత్త ఏడాదికి రూ. 1030 టార్గెట్‌తో కొనొచ్చని కోటక్‌ సిఫార్సు చేస్తోంది.
4. గ్రాఫైట్‌ ఇండియా: నీడిల్‌ కోక్‌ ధర తగ్గడం కంపెనీకి కలిసివచ్చే అంశమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. నీడిల్‌ కోక్‌ కంపెనీకి అవసరమైన కీలక ముడిసరుకు. ఈ ధర తగ్గడం ఎబిటా మార్జిన్లపై పాజిటివ్‌ ప్రభావం చూపవచ్చని అంచనా. 
5. ఇండియన్‌ బ్యాంక్‌: ఎన్‌పీఏ సంక్షోభ సమయంలో కూడా సత్తా చూపుతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇటీవల కాలంలో విలీన వార్తల నేపథ్యంలో షేరు కరెక‌్షన్‌ చూసింది. దీంతో షేరు వాల్యూషన్లు బాగా దిగివచ్చాయి. రాబోయే రోజుల్లో బ్యాంకు బలమైన రిటర్న్‌ ఇవ్వగలదని అంచనా.
6. యస్‌బ్యాంక్‌: ఎడెల్‌వీజ్‌ సిఫార్సు. హైరిస్కు జోన్‌లో ఉన్నా, కాంట్రా కొనుగోలుకు పరిశీలించవచ్చు. ఇన్ని సంక్షోభాల మధ్యకూడా బ్యాంకు మూలధన సమీకరణకు అడ్డంకులు రాకపోవడం పాజిటివ్‌ అంశం. రాబోయే సంవత్సరానికి రూ. 101 టార్గెట్‌తో పరిశీలించవచ్చు.
7. ఎంఅండ్‌ఎం: ద్వితీయార్ధంలో వాహన విక్రయాలు ఊపందుకుంటాయని మోతీలాల్‌ఓస్వాల్‌ అంచనా. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ఆధిపత్యం కొనసాగవచ్చు. ప్రస్తుతం తోటి కంపెనీల కన్నా తక్కువ వాల్యూషన్ల వద్ద ఉంది. అందువల్ల కాంట్రాబెట్‌గా పనిచేస్తుంది.
8. కోల్‌ ఇండియా: రెండుమూడేళ్లుగా తీవ్రమైన డీరేటింగ్‌ చవిచూసింది. ఒకపక్క ఎబిటా బాగున్నా షేరు పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం చాలా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. నగదు ప్రవాహం బలంగా ఉన్నందున డివిడెండ్స్‌ ఆరోగ్యవంతంగా ఉంటాయి. You may be interested

ఎస్‌బీఐ 2 శాతం డౌన్‌: నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకులు

Monday 23rd December 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. సూచీల వరుస 4రోజుల రికార్డు ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గతవారంలో  దీర్ఘకాలిక ఈల్డ్‌ తగ్గింపు లక్ష్యంగా ఆపరేషన్‌ ట్విస్ట్‌ పేరుతో రూ.10వేల కోట్ల విలువైన పదేళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్లను కొంటామని, ఇదే సమయంలో అంతే మొత్తానికి ఏడాది

నష్టాల మార్కెట్లో ఈ రెండు స్టాక్స్‌ జూమ్‌

Monday 23rd December 2019

ఇండియామార్ట్‌- బ్రోకింగ్‌ సంస్థ సిఫారసు ఎఫెక్ట్‌ బీఏఎస్‌ఎఫ్‌- కెమికల్‌ బిజినెస్‌ విక్రయం ఫలితం ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ బ్రోకింగ్‌ సంస్థ జెఫరీస్‌ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించిన వార్తలతో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియామార్ట్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. రూ. 2072 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2097 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 2028 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. బీటూబీ క్లాసిఫైడ్‌

Most from this category