News


ఎకానమీలో రికవరీతో లాభపడే షేర్లివే!

Wednesday 4th December 2019
Markets_main1575455384.png-30055

ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ మెరుగుపడితే ముందుగా లాభపడే టాప్‌ షేర్లను కోటక్‌ సెక్యూరిటీస్‌, ట్రేడింగ్‌ బెల్స్‌, సిటిగ్రూప్‌ తదితర బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 
1. ఎస్‌బీఐ: బ్యాంకు లోన్‌బుక్‌లో 30 శాతం వాటా రిటైల్‌ విభాగానిదే. హోమ్‌లోన్స్‌తో లోన్‌బుక్‌ మంచి వృద్ధి నమోదు చేస్తోంది. వడ్డీ వ్యయాల తగ్గింపు, లోన్‌ గ్రోత్‌, బలమైన ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ గ్రోత్‌తో రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్‌ రేషియో మరింత మెరుగుపడుతుందని అంచనా. 
2. ఐసీఐసీఐ బ్యాంక్‌: స్లిపేజ్‌ నిష్పత్తి క్రమంగా మెరుగవుతోంది. ఎన్‌పీఎల్స్‌ నుంచి రికవరీ కొనసాగుతోంది. ఆర్‌ఓఈ రికవరీ కూడా కనిపిస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌పై రూలింగ్‌ ఈ బ్యాంకులాంటివాటికి మేలు చేస్తుంది. లోన్‌గ్రోత్‌, వడ్డీఏతర ఆదాయాల్లో 15 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండొచ్చు. ఎర్నింగ్స్‌లో 6-7 రెట్లు పెరుగుదల ఉంటుందని అంచనా. 
3. ఎల్‌టీ: వైవిధ్యభరిత వ్యాపార నమూనాతో ముందుకు సాగుతోంది. కంపెనీ వ్యాపారంలో ఇన్‌ఫ్రా వాటా దాదాపు 71 శాతం. కంపెనీ ఆర్డర్‌ బుక్‌ చాలా బలంగా ఉంది. ఎకానమీలో పునరుజ్జీవంతో కంపెనీ అత్యంత లాభపడుతుంది.
4. ఎంఅండ్‌ఎం: పలు రకాల ఉత్పత్తులను అందిస్తోంది. రూరల్‌ ఎకానమీలో రికవరీ ట్రాక్టర్ల వ్యాపారంలో ఉత్సాహం తెస్తుంది. ఎకానమీలో వినిమయం పెరిగితే కంపెనీ వాణిజ్య, వ్యక్తిగత వాహనాల విక్రయాలు మెరుగవుతాయి. ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో కంపెనీ దూరదృష్టితో వ్యవహరిస్తోంది. 
5. వోల్టాస్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌: పెట్రోకెమికల్‌, ఆయిల్‌రిఫైనింగ్‌, సిమెంట్‌, పేపర్‌, ఫార్మా, ఆటో, పవర్‌, నిర్మాణం, మెట్రోరైల్‌, మైనింగ్‌ తదితర అనేక రంగాల్లో వాడే వివిధ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తోంది. మందగమనం కారణంగా కంపెనీ ఆర్డర్‌బుక్‌ సన్నగిల్లింది. పారిశ్రామిక యాక్టివిటీలో చైతన్యం పెరిగితే కంపెనీకి లాభసాటి ఆర్డర్ల ప్రవాహం పెరుగుతుంది.
6. బంధన్‌ బ్యాంక్‌: వేగంగా ఎదుగుతున్న ప్రైవేట్‌ బ్యాంక్‌; ఆర్‌ఓఈ 19 శాతం తగ్గకుండా మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. అసెట్‌క్వాలిటీలో పెద్ద సమస్యలు లేవు. మైక్రోఫైనాన్స్‌ విభాగంలో మంచి పనితీరు చూపుతోంది. గృహ్‌ ఫైనాన్స్‌తో విలీనానంతరం గృహరుణాల రంగంలో చొచ్చుకుపోయే యత్నాల్లో ఉంది. 
7. ఐసీఐసీఐ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌: బీమారంగంలో ఇప్పటికీ అపార అవకాశాలున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్‌ కంపెనీలన్నింటిలో ఐసీఐసీఐ అగ్రగామిగా ఉంది. ఆటో రంగంలో రికవరీ కంపెనీకి ప్రయోజనకరం కానుంది. 
8. లుపిన్‌: నాలుగేళ్ల డౌన్‌ట్రెండ్‌ అనంతరం ఫార్మా కంపెనీలు చాలావరకు రికవరీ చూపుతున్నాయి. కంపెనీకి సంబంధించిన యూఎస్‌ఎఫ్‌డీఏ తలనొప్పులు తగ్గినందున ఇకపై జోరు చూపుతుందని అంచనా.
9. బజాజ్‌ఆటో: పరిశ్రమ గడ్డు రోజులు ఎదుర్కొనే సమయంలో కూడా మంచి ప్రదర్శన చూపిన షేరిది. అంతర్జాతీయ మందగమన సమయంలో సైతం కంపెనీ ఎగుమతులు బాగున్నాయి. కంపెనీ కొత్త ఉత్పత్తులతో రికవరీ వేళ దూసుకుపోతుందని అంచనా. ఆర్‌ఓఈ 20 శాతం కన్నా ఎక్కువగా మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. రాబోయే త్రైమాసికాల్లో మార్జిన్లలో మరింత పెరుగుదల ఉండొచ్చు.
10. ఏసీసీ: షేరు తన రిప్లేస్‌మెంట్‌ ధరకు సమీపంలో ఉంది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న సిమెంట్‌ ధరలు ఇకపై పెరుగుతాయని బ్రోకరేజ్‌లు భావిస్తున్నాయి. దీంతో కంపెనీ ఎబిటా తదితరాలు మెరుగుపడతాయి. 

పైవన్నీ నిపుణుల అంచనాలు, సూచనలు మాత్రమే! పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి!You may be interested

చివరి గంటలో కొనుగోళ్లు

Wednesday 4th December 2019

 ట్రేడ్‌డీల్‌ కుదరొచ్చన్న వార్తలు 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 12,000 పైన ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ చివరి గంటలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే వార్తలు అనూహ్యంగా తెరపైకి రావడంతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల దన్నుతో సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 40850 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12వేల పైన 12,037.30 వద్ద స్థిరపడింది. , రేపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల

మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 4th December 2019

అనూహ్యంగా అమెరికా చైనాల మధ్య చర్చలు సఫలవంతం కావచ్చనే వార్తలు మార్కెట్‌ చివరి గంటలో తెరపైకి రావడంతో మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల పర్వం నెలకొంది. దీంతో ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్న మెటల్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టం నుంచి 100పాయింట్లు(4శాతం) మేర పెరిగింది. నేడు ఇండెక్స్‌ 2,536.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాల

Most from this category