News


ఆర్థిక రికవరీతో ముందు లాభపడేవి ఇవే..

Wednesday 4th September 2019
Markets_main1567537067.png-28169

మందగమనం ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగించేదే అయినా... ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోకు మంచిదేనంటున్నారు నిపుణులు. తాజా మార్కెట్ల పతనం.. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు సౌకర్యవంతమైన వ్యాల్యూషన్ల వద్ద పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు చక్కని అవకాశంగా సూచిస్తున్నారు. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి పడిపోయింది. అంతర్జాతీయ ఎకానమీ సైతం మాంద్యాన్ని సూచిస్తోంది. అయితే పడిపోతున్న వృద్ధికి ప్రభుత్వం ఇటీవల కొన్ని చర్యలను కూడా ప్రకటించింది. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఆర్థిక రంగంతో ముడిపడిన స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఆటో, బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన స్టాక్స్‌కు మేలు చేస్తాయి. ఈ రంగాల స్టాక్స్‌ ఆర్థిక మందగమనం, లిక్విడిటీ సమస్యలతో పతనమయ్యాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా పేర్కొ‍న్నారు. వివిధ సంస్థల అనలిస్టుల సిఫారసులు ఇలా ఉన్నాయి..

 

అజిత్‌ మిశ్రా (రెలిగేర్‌ బ్రోకింగ్‌)
మారుతి, అశోక్‌లేలాండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీపై ఇన్వెస్టర్లు దృ‍ష్టి సారించొచ్చు. ఈ లార్జ్‌క్యాప్‌ కంపెనీలు ఫండమెంటల్స్‌ పరంగా బలమైనవి. ఆర్థిక రంగ రికవరీతో ఎక్కువగా లాభపడతాయి. ఆటో రంగంలో మారుతి సుజుకీ, అశోక్‌లేలాండ్‌ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్దనున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంకు బలమైనవి. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల సరళీకరణతో ఎక్కువగా ప్రయోజనం పొందుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యవయాలతో ఎల్‌అండ్‌టీ లాభపడుతుంది. ఇటీవల కరెక్షన్‌తో వీటి వ్యాల్యూషన్లు సహేతుక స్థాయికి వచ్చాయి. 

 

అతీష్‌ మత్లవాలా (ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌)
ఆర్థిక రంగ రికవరీతో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు ప్రయోజనం పొందుతాయి. ఈ రెండు బ్యాంకులు తమ ఎన్‌పీఏలను ప్రక్షాళించుకున్నాయి. బ్యాలన్స్‌ షీటు వేగంగా వృద్ధి చెందడంపై దృష్టి పెట్టాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. భారీగా అమ్ముడుపోని యూనిట్లతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నుంచి ఈ రంగానికి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నాం.

 

బీఎన్‌పీ పారిబాస్‌
ఫైనాన్షియల్స్‌: పీఎస్‌యూ బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీ పట్ల సానుకూలం. ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల పట్ల కూడా సానుకూలంగానే ఉన్నాం. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు టాప్‌పిక్స్‌. 
ఆటో: కమర్షియల్‌ వెహికల్స్‌, ప్యాసింజర్‌ వెహికల్స్‌కు సానుకూలం. మారుతి, ఐచర్‌ మోటార్స్‌.
కన్జ్యూమర్‌: ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా లిక్విడిటీ మెరుగుపడడం వల్ల లాభపడుతుంది. ఈ రంగంలో డాబర్‌, మారికో, ఐటీసీ, జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ టాప్‌ పిక్స్‌. 
ఎనర్జీ: ప్రభావం పరిమితంగా ఉంటుంది. ఆర్‌ఐఎల్‌, గెయిల్‌, బీపీసీఎల్‌.
ఐటీ సర్వీసెస్‌: సమీప కాలానికి ప్రతికూలం. టాప్‌ పిక్స్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌.

 

నోమురా
జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా భారత రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌కు పెంచింది. పెట్టుబడులు పెంచుకునేందుకు ఇది అనుకూల సమయంగా పేర్కొంది. సంస్కరణల చర్యలు, రంగాల వారీ ప్రోత్సాహకాలు ఆర్థిక రంగానికి తగినంత బలాన్నిస్తాయని అభిప్రాయపడింది. ఆర్థిక రంగ రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్ధ భాగంలో 6.6 శాతానికి రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. పోర్ట్‌ఫోలియో పరంగా ఫైనాన్షియల్స్‌, కన్జ్యూమర్‌ డిస్క్రీషనరీ, ఇండస్ట్రియల్స్‌ రంగాల పట్ల సానుకూలం. టాప్‌పిక్స్‌గా ఐసీఐసీఐ బ్యాంకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, కంటెయినర్‌ కార్పొరేషన్‌ను సూచించింది. You may be interested

నిఫ్టీ తిరిగి 10,800పైన నిలబడితేనే...?

Wednesday 4th September 2019

ఒక్క రోజే స్టాక్‌ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. గత శుక్రవారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు జూన్‌ త్రైమాసికంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం కావడం, ఆగస్ట్‌ నెలలో వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఇన్వె‍స్టర్ల మూడ్‌ను మార్చేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) పూనకం వచ్చి,నట్టు ఒక్క రోజే రూ.2,000 కోట్ల మేర మంగళవారం అమ్మకాలు సాగించారు. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ రూ.1,200 కోట్ల వరకు కొనుగోలు చేయడం

అమ్మకాల సునామీ....సెన్సెక్స్‌ 770 పాయింట్లు క్రాష్‌

Tuesday 3rd September 2019

మార్కెట్‌ను ముంచెత్తిన ఆర్థిక మాంద్య భయాలు ఆర్థిక మందగమన భయాలు మార్కెట్‌ను మరోసారి ముంచేశాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువలా సాగడంతో నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 10800 దిగువున 10,797.90 వద్ద, సెన్సెక్స్‌ 770 పాయింట్లను కోల్పోయి 36,563 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ మినహా అన్నిరంగాలకు చెందిన షేర్లల్లో విపరీతంగా అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌

Most from this category