News


ఆర్థిక వ్యవస్థలు వీక్‌- గోల్డ్‌ భేష్‌!

Thursday 5th March 2020
Markets_main1583394866.png-32302

మార్క్‌ ఫేబర్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్‌
గ్లూమ్‌, బూమ్‌, డూమ్‌ న్యూస్‌లెటర్‌ ఎడిటర్‌

గత తొమ్మిది నెలలుగా ఆసియా దేశాల నుంచి వెలువడిన గణాంకాలు ఆర్థిక వ్యవస్థలు మందగిస్తున్న అంశాన్ని తెలియజేస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్‌కంటే ఇతర అంశాలేవో ఆర్థిక మందగమనానికి కారణమవుతున్నాయంటున్నారు గ్లూమ్‌, బూమ్‌, డూమ్‌ న్యూస్‌లెటర్‌ ఎడిటర్‌ మార్క్‌ ఫేబర్‌. ఒక ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

మార్కెట్లు ప్లస్‌లో..
ఇటీవల మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అవుతున్నాయి. అయితే గత రెండు వారాల్లో ఏమేర పతనమయ్యాయో చూడవలసి ఉంది. ఉదాహరణకు అమెరికన్‌ ఆటో కంపెనీ టెస్లా షేరు 33 శాతం పతనమయ్యాక 10 శాతం జంప్‌చేసింది. నిజానికి మార్కెట్ల పతనానికి కరోనా వైరస్‌ కారణంకాదు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. గత తొమ్మిది నెలల కాలాన్ని పరిగణిస్తే చాలా రంగాలు, పరిశ్రమలు భారీగా నీరసించాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ తలెత్తడంతో మార్కెట్లలో ఆందోళనలు మరింత పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలన్నదే ప్రశ్న. కరెక్షన్‌లలో కొనుగోలు చేయడమా లేక ర్యాలీ వచ్చినప్పుడు విక్రయించి బయటపడటమా అన్నది ఆలోచించాలి. నా అభిప్రాయంలో మార్కెట్లు ప్రపంచంలో ఎక్కడా చౌకగా లేవు. కొంతమంది నిపుణులు గతంలో తలెత్తిన సార్స్‌ తదితర సందర్భాలలో మార్కెట్లు రికవరీ సాధించడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక్కోసారి మార్కెట్లలో అనూహ్యంగా పతనం సంభవించవచ్చు. 2003లో అమెరికన్‌ టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 2000లో నమోదైన గరిష్టాల నుంచి 80 శాతం దిగజారింది. ప్రస్తుతం ప్రత్యేకతరహా పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మార్కెట్లు ఖరీదుగా ఉన్న విషయం గమనించాలి.

బంగారం మేలు
ఇండస్ట్రియల్‌ కమోడిటీస్‌ లేదా బాల్టిక్‌ రవాణా ఇండెక్స్‌ను పరిగణిస్తే ఆర్థిక వ్యవస్థలు అంత సవ్యంగా లేనట్లు సంకేతాలిస్తున్నాయి. వీటితో సంబంధం కలిగిన మార్కెట్లు సైతం ఆర్థిక రికవరీపట్ల నిరాశగా స్పందిస్తున్నాయి. కొన్ని కమోడిటీలు పెరుగుతున్నప్పటికీ మరికొన్ని సైకిల్‌కు అనుగుణంగా స్పందించడంలేదు. వ్యవసాయ కమోడిటీలు సైతం​అటూఇటుగా ఉన్నాయి. అయితే ఇవి చౌకగా లభిస్తున్నాయి. మరోపక్క బంగారం వంటి విలువైన లోహాలు పటిష్టంగా కదులుతున్నాయి. గత వారాంతాన బంగారం ధరలలో కరెక్షన్‌ వచ్చింది. ధరలు దిగివస్తే కొంతమేర పెట్టుబడులను బంగారంలోకి మళ్లించవచ్చు.

ఐదేళ్ల కాలానికి
రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించవలసివస్తే.. ఈక్విటీలకు 25 శాతం, రియల్‌ ఎస్టేట్‌కు 50 శాతం, బంగారానికి 25 శాతం, బాండ్ల కొనుగోలుకి 25 శాతం చొప్పున కేటాయిస్తాను. ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉదాహరణకు కొంతకాలం క్రితం స్విట్జర్లాండ్‌ 10 ఏళ్ల కాలానికి జీరో వడ్డీతో బాండ్లను ప్రవేశపెట్టింది. వీటిని కొనుగోలు చేస్తే పదేళ్లలో ఎలాంటి వడ్డీ లభించదు. ఇలాంటి సందర్భంలో వడ్డీ రేట్లు నెగిటివ్‌కు చేరడం లేదా స్విస్‌ ఫ్రాంక్స్‌ బలపడతాయని ఆశించాలి. దీంతో ఈ బాండ్లు ఇటీవల 115ను తాకాయి. వీటిని ఇప్పుడు కొంటే పదేళ్ల తరువాత 15 శాతం తక్కువగా పెట్టుబడి తిరిగి వస్తుంది. అంటే ఇతర సాధనాలలో ఇంతకంటే అధిక నష్టం అంచనా వేస్తుండాలి. ఇలా మార్కెట్లలో సరికొత్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతేడాది కాలాన్ని చూస్తే దీర్ఘకాలిక యూఎస్‌ ట్రెజరీలు స్టాక్స్‌కంటే అధిక రిటర్నులు ఇచ్చాయి. దీంతో బాండ్లకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. You may be interested

భారత ఉక్కు ఎగుమతులకు కరోనా బూస్ట్‌!

Thursday 5th March 2020

కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావంతో భారత ఉక్కు పరిశ్రమలు పుంజుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎగుమతులు చేయడానికి ఇది చాలా మంచి సమయమని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోవిడ్‌-19 వ్యాప్తితో చైనాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిలో ఉక్కు పరిశ్రమలు కూడా ఉన్నాయి. దీంతో ఉక్కుకోసం చైనా మీద ఆధారపడ్డ ప్రపంచ దేశాలు ప్రత్యమ్నా మార్గాలను వెదుకుతున్నాయి.ఇందులో భాగంగానే స్టీల్‌ను కొనుగోలుదారులంతా ఇండియా వైపు చూస్తున్నారని ఉక్కు పరిశ్రమల మార్కెట్‌ నిపుణులు

స్వల్పకాలానికి 4 స్టాక్‌ సిఫార్సులు

Thursday 5th March 2020

అధిక వెయిటేజీ కలిగిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీ లాభాల్ని ఆర్జించాయి. ఈ తరుణంలో ప్రముఖ మార్కెట్‌ విశ్లేషకుడు కునాల్‌ బోత్రా స్వల్పకాలానికి 4 షేర్లను సిఫార్సు చేస్తున్నారు. ఇవేంటో ఇప్పుడు చూద్దాం..! షేరు పేరు: దివీస్‌ ల్యాబ్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.2300 స్టాప్‌లాస్‌: రూ.2180 షేరు పేరు: రామ్‌కో సిమెంట్స్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.700 స్టాప్‌ లాస్‌: రూ.740 షేరు పేరు: గోద్రేజ్‌ కన్జూమర్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.666 స్టాప్‌లాస్‌: రూ.636 షేరు

Most from this category