News


కంపెనీల ఎబిటా వృద్ధిలో క్షీణత!

Friday 6th December 2019
Markets_main1575617058.png-30091

మూడు రంగాల్లో తీవ్ర ఒత్తిడి
క్రెడిట్‌ సూసీ
పవర్‌, టెలికం, ఫైనాన్షియల్‌ రంగాల్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని క్రెడిట్‌ సూసీ ఇండియా ఈక్విటీ రిసెర్చ్‌ హెడ్‌ ఆశిష​ గుప్తా చెప్పారు. ఇటీవల కాలంలో మొత్తం కార్పొరేట్‌ లాభాలే క్షీణతలో ఉన్నాయన్నారు. ఈ త్రైమాసికంలో కార్పొరేట్‌ ఇండియా సరాసరి ఎబిటా వృద్ధి 6 శాతానికి దిగివచ్చిందన్నారు. దీనికితోడు పలు త్రైమాసికాలుగా స్థిరంగా ఉన్న ఒత్తిడిస్థాయిలు ఈ త్రైమాసికంలో బాగా పెరిగాయన్నారు. ఇంట్రెస్ట్‌కవర్‌ నిష్పత్తి పైమూడు రంగాల్లో ఒకటి కన్నా తక్కువకు చేరిందన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ మార్కెట్‌ చాలా గడ్డుస్థితిలో ఉందని, ముఖ్యంగా బ్యాంకు క్రెడిట్‌ క్వాలిటీ కోణంలో పరిశీలిస్తే అనేక ఇబ్బందులున్నాయన్నారు. క్రెడిట్‌, రీఫైనాన్స్‌ పొందడం కార్పొరేట్లు కష్టంగా మారుతోందన్నారు. ఈ సవాళ్లన్నీ కార్పొరేట్‌ రంగంలో ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. 
వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
= ఆరునెలలుగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో లభించే లిక్విడిటీ మెరుగవడం ఆరంభమయింది. మూడేళ్లుగా ప్రైవేట్‌ బ్యాంకుల హవా ఎక్కువైంది. అయితే డిపాజిట్లపరంగా పీఎస్‌బీలతో ఇంకా పోటీ పడుతూనే ఉన్నాయి. పీఎస్‌బీల కన్నా ఎక్కువ ప్రీమియం ఇస్తున్నా ఇంకా డిపాజిట్ల సేకరణలో వెనుకబడేఉన్నాయి. ఇటీవల కాలంలో లోన్‌గ్రోత్‌ కూడా దిగివచ్చింది. దీంతో ఇప్పటివరకు సేకరించిన డిపాజిట్లు ఎన్‌ఐఎంపై ప్రభావం చూపుతాయి. లోన్‌గ్రోత్‌ క్షీణించడంతో బ్యాంకుల వద్ద పోగవుతున్న మిగులు నిధులు నెగిటివ్‌ సాధనాల్లోకి మరలే ప్రమాదం ఉంది. 
= దేశంలో పెద్ద బ్యాంకులు తమ సబ్సిడరీల ద్వారా పలు అనుబంధ రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు బ్యాంకులు తమ సబ్సిడరీలను లిస్టింగ్‌కు తెస్తున్నాయి. వీటిలో చాలా షేర్లు బాగా సక్సెసయ్యాయి. ఇదే దోవలో ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ లిస్టింగ్‌ కూడా విజయవంతం కావచ్చు. 
= ప్రస్తుతం స్థూల ఆర్థిక ముఖచిత్రం స్తబ్దుగా ఉంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లో ఇబ్బందులు కొత్త పెట్టుబడి ప్రణాళికలను ముఖ్యంగా మిడ్‌సైజ్‌ కంపెనీల ప్రణాళికలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడిప్పుడే లిక్విడిటీ పెరుగుతున్నందున మరికొంత కాలానికి బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలిచ్చేందుకు ముందుకువస్తాయి. అప్పటివరకు టర్నెరౌండ్‌ ఉండకపోవచ్చు. ఇందుకు ఇంకా సమయం పడుతుంది. 
= ఈమధ్య కాలంలో టెలికం రంగంలో కొన్ని పాజిటివ్‌ వార్తలు వినిపిస్తున్నాయి. టారిఫ్‌ల పెంపుదల ఎబిటా, లాభాలు మెరుగుపడేందుకు దోహదం చేయవచ్చు. ఏజీఆర్‌పై ప్రభుత్వం నుంచి కొంత కాలపరిమితి పొడిగింపులాంటి ఊరట లభిస్తే టెల్కోలు మరింత దూసుకుపోతాయి. You may be interested

నెలరోజుల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 6th December 2019

మూడింగ్‌ రేటింగ్‌ కోతతో 9శాతం పతనమైన షేరు యస్‌బ్యాంక్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయి నెలరోజుల కనిష్టానికి దిగివచ్చింది. ప్రముఖ బ్రోకరేజ్‌ మూడీస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.61.00 వద్ద ప్రారంభమైంది. నిర్థరక ఆస్తులు, తక్కువ లాస్‌-అబ్‌సోరింగ్‌ బఫర్‌లు బ్యాంక్‌ నిధుల సమీకరణ, ద్రవ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రేటింగ్‌ తెలిపింది. ఈ కారణంగా మూడీస్‌... బ్యాంకు

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు క్రాష్‌

Friday 6th December 2019

3.30శాతం నష్టపోయి పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అంచనాలకు అనుగుణంగా కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించకపోవడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంకింగ్‌ రంగ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 3.3శాతానికి పైగా నష్టపోయింది. మూడురోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమావేశం అనంతరం... ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండం‍తో ఈధపా కీలక వడ్డీరేట్లను

Most from this category