News


క్యూ4లో కార్పొరేట్‌ లాభాలు కొత్త గరిష్టానికి !

Friday 27th September 2019
Markets_main1569575949.png-28589

‘ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో వ్యవస్థలో మూలధన వ్యయ చక్రం తిరిగి పుంజుకుంటుంది. దీంతో కంపెనీల లాభాల వృద్ధి పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి సహాయపడుతుంది’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

అతి పెద్ద సంస్కరణ..
కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యను  1991 తర్వాత అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకోవచ్చు. ముందు కార్పొరేట్ ట్యాక్స్‌ రేటు అధికంగా ఉండడంతో భారతీయ కంపెనీలు అంతర్జాతీయం‍గా పోటీపడలేకపోయేవి. కానీ ప్రస్తుత చర్య వలన ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందని అంచనావేస్తున్నా. అంతేకాకుండా తగ్గిన ట్యాక్స్‌ వలన దేశంలోకి ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లు పెరుగుతాయి. ఈ చర్య, వ్యవస్థలో మూలధనవ్యయ చక్రం తిరిగి పుంజుకోడానికి సహాయపడుతుంది. వ్యవస్థలో డిమాండ్‌ పెంచే విధంగా కంపెనీలు ధరలను తగ్గించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి సహాయపడుతుంది.  
   గత రెండు త్రైమాసికాల నుంచి పడిపోయిన సెంటిమెంట్‌ను తిరిగి పునరుద్ధరించడానికి ట్యాక్స్‌ తగ్గింపు చర్య ఉపయోగపడుతుంది. ట్యాక్స్‌ తగ్గడం వలన కంపెనీలకు ప్రస్తుతం రెండు అవకాశాలుంటాయి. మొదటిది కంపెనీలు ట్యాక్స్‌ ప్రయోజనాలను నిలుపుకోవడం కాగా, రెండవది వస్తువులు, సేవాలపై పై ధరలను తగ్గించి, వాల్యుమ్‌లను పెంచడానికి వీలుంటుంది. ఇది క్యాపిటల్‌ మార్కెట్లో ఉన్న నెగిటివ్‌ సెంటిమెంట్‌ను మార్చడానికి సహాయపడుతుంది.

అడ్డంకులున్నా మార్కెట్‌ ముందుకే..
   ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన వ్యవస్థలో మూలధన వ్యయ చక్రం తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఫలితంగా కంపెనీల లాభాలు పెరుగుతాయి. దీంతో ఆర్థిక సంవత్సరం 2019-20 క్యూ4లో కంపెనీల లాభాలు కొత్త గరిష్ఠాలను చేరుకునే అవకాశం కూడా ఉంది. కానీ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలు వంటి అంశాలు చమురు ధరలను, కరెన్సీ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం అవకాశం ఉంది. అందువలన వచ్చే కొన్ని నెలల వరకు వీటిని గమనిస్తు ఉండడం మంచిది. ఏది ఏమైనప్పటికి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు బలమైన ర్యాలీని చేస్తాయని నమ్ముతున్నా.
   ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో పాటు జులై 5 కు ముందు కంపెనీలు ప్రకటించిన బై బ్యాక్‌లపై బై బ్యాక్‌ ట్యాక్స్‌ను తొలగించింది (కానీ జులై 6 తర్వాత ప్రకటించిన బై బ్యాక్‌లపై ఈ ట్యాక్స్‌ వర్తిస్తుంది). అదే విధంగా మూలధన లాభాలపై విధించే ట్యాక్స్‌ పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది ఇన్వెస్టర్ల రిటర్న్‌లు పెరగడానికి సహాయపడుతుంది.

ట్యాక్స్‌కట్‌తో లాభపడే కంపెనీలు...
పండుగ సీజన్‌ ప్రారంభమవ్వడంతో పాటు ప్రభుత్వం పన్ను రేటు తగ్గించడం వలన ఏసియన్‌ పెయింట్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, బాటా ఇండియా, హావెల్స్, వోల్టాస్, ఎల్ అండ్ టీ, ఎసీసీ, బజాజ్ ఫైనాన్స్, కమ్మిన్స్ ఇండియా వంటి సంస్థలు మధ్యస్థ కాలానికిగాను బాగా రాణించే అవకాశం ఉంది. వీటితో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి కౌంటర్ల వాల్యుషన్‌లు ఆకర్షిణియంగా ఉండడంతో బాగా రాణించే అవకాశం ఉంది.

5 ట్రిలియన్‌ డాలర్లే ప్రభుత్వ లక్ష్యం...
ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించింది. అదేవిధంగా రుణ మేళాలను ఏర్పాటు చేయమని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచిస్తోంది. ఎంఎస్‌ఎంఈ(మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) రంగంలో ఎన్‌పీఏల ప్రకటనలో మార్పులు తీసుకువచ్చింది. సమీపకాలంలో సెంటిమెంట్‌ను పెంచడం, దీర్ఘకాలంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై ‍ప్రభుత్వం దృష్ఠిసారించిందని తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను) నిబంధనలను సరళీకరించడం, ప్రభుత్వరంగ యూనిట్లను ప్రైవేటికరించడం, కార్మిక, భూమికి సంబంధించి సంస్కరణలు వంటి అంశాలను ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉం‍ది. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

సెప్టెంబర్‌ ర్యాలీ మిస్‌యితే..
ఇన్వెస్టింగ్‌ ఒక నిరంతరమైన పక్రియ. అస్థిరత, ఇన్వెస్టింగ్‌ పక్రియలో ఒక భాగం మాత్రమే. కేం‍ద్ర ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యను ప్రకటించిన తర్వాత నిఫ్టీ తన 10 ఏళ్లలో అతి పెద్ద ర్యాలీ చేసింది. ఒకే రోజులో 5 శాతం పైనే లాభపడింది. ఈ ర్యాలీని ఇన్వెస్టర్లు మిస్‌ చేసుకున్నప్పటికి మధ్యస్థ, దీర్ఘకాలానికి గాను పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌ కలిగిన, వృద్ధికి అవకాశం ఉన్న, ఆయా రంగాలలో లీడర్ల్‌గా ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. స్వల్పకాలానికి సంబంధించి మార్కెట్‌ కదలికలను అంచనా వేయడం కష్టంతోకూడుకున్నది. ఇప్పటికి కూడా మార్కెట్‌లో స్వల్పకాలం, మధ్యస్థ కాలానికి గాను అండర్‌ టోన్‌ కొనసాగుతునే ఉంది.

ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వుంటుంది.. 
   ఆర్థిక వ్యవస్థ రికవరి అవుతుందనే అంచనాల నేపథ్యంలో ఇప్పటి నుంచి మార్కెట్‌లు ముందుకు కదులుతాయని నమ్ముతున్నా. ఆర్‌బీఐ అక్టోబర్‌ సమావేశంలో రేట్ల కోత ఉంటుందని అంచనావేస్తున్నాం. అంతేకాకుండా యుఎస్‌ ఫెడ్‌, ఈసీబీ, బీఓజే సమావేశాలను, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ సంప్రదింపులను ఇన్వెస్టర్లు గమనించాలి.

 You may be interested

ఫార్మా షేర్ల పతనం

Friday 27th September 2019

ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో పతనాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. నేడు ఫార్మా ఇండెక్స్‌ 7,837.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(7857.30)తో పోలిస్తే 2శాతం నష్టపోయి 7,700.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో పిరమిల్‌

కళతప్పిన మెటల్‌ షేర్లు

Friday 27th September 2019

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. అమెరికాతో వాణిజ్య వివాదాలు కార్పొరేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో ఆగస్ట్‌లో చైనా దేశపు ఇండస్ట్రీయల్‌ ప్రాఫిట్స్‌ 2శాతం తగ్గినట్లు నేడు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకటించింది. మరోవైపు ఇరుదేశాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు మధ్య ఈ అక్టోబర్‌ ప్రారంభంలో వాణిజ్య చర్చలు ప్రారంభంకానున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర

Most from this category