News


ఎర్నింగ్స్‌, బడ్జెట్‌ కీలకం!

Saturday 11th January 2020
Markets_main1578739107.png-30865

జిమిత్‌ మోదీ
ఈ వారమంతా మార్కెట్లు ఆశకు, భయానికి మధ్య తీవ్ర ఊగిసలాట చూశాయి. ఒకపక్క ఇరాన్‌ సంక్షోభంతో భయాలు, మరోపక్క ఎర్నింగ్స్‌పై అంచనాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీంతో నిఫ్టీ 11970 స్థాయిని, 12300 పాయింట్ల స్థాయిని ఈ వారంలో చవిచూసింది. రిటైలర్లు, ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు తగ్గించినా, సిప్‌ల్లోకి మాత్రం నిధుల ప్రవాహం కొనసాగింది. బడ్జెట్‌ ముందు స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో అధిక యాక‌్షన్‌ ఉండొచ్చని అంచనాలున్నాయి. లార్జ్‌ క్యాప్స్‌ ఇకపై కొంత వెనుకంజ వేయవచ్చు. బడ్జెట్‌తరుణలంలో అగ్రి, హౌసింగ్‌ రంగాలు చురుగ్గా ఉంటుంటాయి. టెక్నికల్స్‌ చూస్తే నిఫ్టీ వచ్చే వారం 12000- 12400 పాయింట్ల రేంజ్‌లో కదిలే అవకాశం ఉంది. 


బడ్జెట్‌ వరకు కూడా ఇదే రేంజ్‌ కొనసాగినా ఆశ్చర్యం లేదు. మార్కెట్‌ ఓవర్‌బాట్‌లో లేనందున, నిఫ్టీ మరో ఆల్‌టైమ్‌ హైని తాకినందున కొంత వరకు ముందుకు సాగేందుకే ఛాన్సులున్నాయి. ఇకపై మార్కెట్లో విస్తృత స్థాయి ప్రదర్శన ఆశించవచ్చు. తీవ్ర కదలికలు కొనసాగుతాయి, ట్రేడర్లు భారీ నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. బడ్జెట్‌ వరకు వారం కనిష్ఠాలను స్టాప్‌లాస్‌గా పెట్టుకొని తగ్గినప్పుడు కొను స్ట్రాటజీ అవలంబించవచ్చు. ఎర్నింగ్స్‌ సీజన్‌ కారణంగా ఎంపిక చేసిన స్టాకుల్లో కదలికలుంటాయి. ఫెర్టిలైజర్స్‌, గృహ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌ రంగాల షేర్లు మంచి ప్రదర్శన చూపవచ్చు. మార్కెట్లు ముందుకు పోయేలా కనిపిస్తున్నందున నాణ్యమైన స్టాకులపై కన్నేయడం మంచిది. మిడ్‌క్యాప్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టవచ్చు. 



You may be interested

ఈ కంపెనీల క్యూ3 ఫలితాలపై కన్నేయండి..!

Saturday 11th January 2020

ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటన అనంతరం దేశీయ కార్పోరేట్‌ కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాల విడుదలకు సన్నద్దమయ్యాయి. ఇప్పటికే విశ్లేషకులు వివిధ కంపెనీల మూడో కార్వర్ట్‌ పనితీరుపై తమ అంచనాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ ఈక్విటీస్ బ్రోకరేజ్‌ సంస్థలు 10 కంపెనీల క్యూ3 పనితీరుపై తన అంచనాలను వెల్లడించింది.  1.బ్లూస్టార్‌ కంపెనీ:-  వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 600శాతం వృద్ధి సాధించి

ఈ మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Saturday 11th January 2020

కోల్టెపాటిల్‌ డెవలపర్స్‌ ఇండియన్‌ హోటల్స్‌ ర్యాలీస్‌ ఇండియా దేశ, విదేశీ అంశాల ప్రభావంతో ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సరికొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. దేశీయంగా జీడీపీ మందగమనం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుసహా ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ వంటి అంశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ తగ్గింపు బాట వంటి అంశాలు

Most from this category