News


ఓలా, ఓయో, పేటీఎం వాటాలకు భారీ ధరలు!

Monday 1st July 2019
Markets_main1562004871.png-26723

ఇవన్నీ అన్‌లిస్టెడ్‌ కంపెనీలు. కానీ, కోరకుంటే వీటి వాటాలను సొంతం చేసుకోవచ్చు. ఆఫ్‌ మార్కెట్‌ ఇందుకు వీలు కల్పిస్తుంది. కానీ, కొనాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌, ఓయో రూమ్స్‌ మాతృ సంస్థ ఓరావెల్‌ స్టేస్‌, పేటీఎం మాతృ సంస్థ వన్‌97కమ్యూనికేషన్స్‌ షేర్లకు రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్‌ ఉన్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలకు మంచి పేరుంది. అన్‌లిస్టెడ్‌ విభాగంలో ఉన్న సవాళ్లను కూడా పట్టించుకోకుండా చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి షేర్ల ధరలు తరచూ మారిపోతుండడం, పైగా పరిమిత ట్రేడ్‌ వంటి అంశాలను ఇన్వెస్టర్లు విస్మరించరానివి. 

 

కోల్‌కతా కేంద్రంగా అన్‌లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ వ్యవహారాలు చూసే అభిషేక్‌ సెక్యూరిటీస్‌ తెలిపిన వివరాల మేరకు... ప్రస్తుతం ఓలా షేరు ధర రూ.27,500, ఓయో రూమ్స్‌ రూ.75,000, పేటీఎం 17,000 చొప్పున పలుకుతున్నాయి. నిజానికి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూస్తున్నాయి. అయినా షేర్ల ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. వన్‌97 కమ్యూనికేషన్స్‌ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 2017-18లో రూ.3,314 కోట్లుగా ఉంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. కానీ, నష్టాలు మాత్రం రూ.93 కోట్ల నుంచి రూ.1,606 కోట్లకు పెరిగాయి. 

 

పేటీఎం మాల్‌ రూ.774 కోట్ల ఆదాయంపై రూ.1,787 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. వన్‌97 కమ్యూనికేషన్స్‌, పేటీఎం మాల్‌ నష్టాలు కూడా కలిపి చూస్తే 3,393 కోట్లుగా 2018 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాయి. ఇక 2018 మార్చితో ముగిసిన సంవత్సరంలో ఓయో ఇండియా నష్టాలు రూ.360 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం మాత్రం రూ.416 కోట్లుగా ఉంది. ఇక, ఓలా సైతం వేలాది కోట్ల రూపాయిలను ఇప్పటి వరకు ఇన్వెస్ట్‌ చేయగా, భారీగా నష్టాలను నమోదు చేసుకుంటోంది. లిస్ట్‌ అయ్యే వరకు కంపెనీల సరైన వ్యాల్యూషన్‌ అన్నది ప్రతిఫలించదని అభిషేక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సందీప్‌ గినోడియా పేర్కొన్నారు. భిన్న వ్యక్తులు ఒకే షేరును భిన్న వ్యాల్యూషన్‌కు రావచ్చని, ఒకరు విలువ ఉందని భావిస్తే మరొకరు లేదనుకోవచ్చన్నారు. ‘‘టాప్‌లైన్‌లో వృద్ధి ఆధారంగానే ఈ కంపెనీలు విలువ సంతరించుకుంటున్నాయి. వీటి విషయంలో పారదర్శక విలువకు రావడం కష్టమే’’ అని అన్నారు. 


 You may be interested

లాభాల ప్రారంభం

Tuesday 2nd July 2019

క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ మంగళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల పెరుగుదలతో 39,812 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్లు జంప్‌చేసి 39,812 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. పలు దేశాల తయారీ రంగం నెమ్మదించిందన్న వార్తలతో ప్రపంచవృద్ధి మందగిస్తుందన్న భయాలు నెలకొనడంతో ఆసియా మార్కెట్లు స్వల్ప క్షీణతతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ మినహా మిగిలిన ఆసియా సూచీలన్నీ తగ్గాయి.  క్రితం రోజు

11850 పైన నిఫ్టీ ముగింపు

Monday 1st July 2019

కలిసొచ్చిన ప్రపంచసానుకూలతలు  రాణించిన ఫార్మా, అటో రంగ షేర్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 292 పాయింట్లు పెరిగి 39,686.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 76.70 పాయింట్లు పెరిగి 11850 పైన 11,865.60 వద్ద ముగిసింది. గతవారంలో అమెరికా- చైనా అధినేతల మధ్య జరిగిన సమావేశంతో వాణిజ్య యుద్ధ ఆందోళనలు తగ్గుముఖం పట్టే దిశగా అడుగులు పడటంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల

Most from this category