News


డైనమిక్‌ ప్రొడక్ట్స్‌, టాటా కాఫీ జూమ్‌

Thursday 5th March 2020
Markets_main1583390841.png-32300

కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌ మార్కెట్ల బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​జోరు చూపుతున్నాయి. డెమక్రటిక్‌ ప్రెసిడెన్షియల్‌ అభ్యర్థి జో బిడెన్‌ 15 రాష్ట్రాల ప్రైమరీస్‌కుగాను 10 చోట్ల ముందంజ వేయడంతో బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 4 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇది దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వడంతో మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో సెన్సెక్స్‌ 386 పాయింట్లు జంప్‌చేసి 38,796కు చేరగా..  నిఫ్టీ 110 పాయింట్లు ఎగసి 11,361 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైనమిక్‌ ప్రొడక్ట్స్‌, టాటా కాఫీ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

డైనిమక్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌
గుజరాత్‌లోని దహేజ్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ఈ ఏడాది(2020) ఆగస్ట్‌కల్లా పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ తాజాగా పేర్కొంది. నిర్మాణ పనులు సవ్యంగా సాగుతున్నట్లు తెలియజేసింది.  డై ఇంటర్మీడియట్స్‌ తయారు చేసే ఈ కంపెనీలో డిసెంబర్‌కల్లా ప్రమోటర్ల వాటా 40.50%గా నమోదైంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డైనమిక్‌ ప్రొడక్ట్స్‌ షేరు 6.2 శాతం జంప్‌చేసి రూ. 144 వద్ద ట్రేడవుతోంది. 

టాటా కాఫీ లిమిటెడ్‌
కాఫీసోనెట్స్‌.కామ్‌ పేరుతో ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు తాజాగా టాటా కాఫీ లిమిటెడ్‌ పేర్కొంది. తద్వారా ఖరీదైన సింగిల్‌ ఒరిజిన్‌ కాఫీని వినియోగదారులకు అందించనున్నట్లు తెలియజేసింది. డిసెంబర్‌కల్లా టాటా కాఫీ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 57.48 శాతంగా నమోదైంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా కాఫీ షేరు 3 శాతం లాభపడి రూ. 83 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

స్వల్పకాలానికి 4 స్టాక్‌ సిఫార్సులు

Thursday 5th March 2020

అధిక వెయిటేజీ కలిగిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీ లాభాల్ని ఆర్జించాయి. ఈ తరుణంలో ప్రముఖ మార్కెట్‌ విశ్లేషకుడు కునాల్‌ బోత్రా స్వల్పకాలానికి 4 షేర్లను సిఫార్సు చేస్తున్నారు. ఇవేంటో ఇప్పుడు చూద్దాం..! షేరు పేరు: దివీస్‌ ల్యాబ్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.2300 స్టాప్‌లాస్‌: రూ.2180 షేరు పేరు: రామ్‌కో సిమెంట్స్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.700 స్టాప్‌ లాస్‌: రూ.740 షేరు పేరు: గోద్రేజ్‌ కన్జూమర్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.666 స్టాప్‌లాస్‌: రూ.636 షేరు

ఏడాది కనిష్టానికి 239 షేర్లు

Thursday 5th March 2020

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 239 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అగ్రీటెక్‌ఇండియా, అజ్మీర్‌ రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఇండియా, అశోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా పేపర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్కోటెక్‌, ఆరో గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌, అసోసియేటెడ్‌ ఆల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, అట్లాంటా, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలైట్‌ ఇండియా, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌,

Most from this category