STOCKS

News


ప్రభుత్వ బ్యాంకుల విలీనం.. పైవేట్‌ బ్యాంకులకు మంచిదా?

Tuesday 3rd September 2019
Markets_main1567495947.png-28162

ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన పక్రియ, వీటి ప్రత్యర్థి బ్యాంకులకు లాభాన్ని చేకూరుస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అన్నారు. విలీన పక్రియ వలన విలీన బ్యాంకుల రుణ వృద్ధి తగ్గుతుందని, ఈ బ్యాంకులలో ఉద్యోగులు, బ్రాంచులను కలిపే విలీన పక్రియ వలన స్వల్ప కాలంలో ఏర్పడే అనిశ్చితి వలన ప్రైవేట్‌ బ్యాంకులు లాభపడతాయని తెలిపారు. కాగా శుక్రవారం ఆర్థిక మంత్రి 27 ప్రభుత్వరంగ బ్యాంకులను 12కి తగ్గించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  
  నరేంద్రమోదీ ప్రభుత్వం శుక్రవారం కొన్ని ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి నాలుగు అతి పెద్ద బ్యాంకులను ప్రకటించింది. కాగా ఇది జీడీపీ డేటా వెలువడిన కొద్ది సమయంలోనే వెలువడడం గమనార్హం. కొత్తగా ఏర్పడే ఈ నాలుగు బ్యాంకులు, భారతీయ బ్యాంకింగ్‌ ఇండస్ట్రీలో 56 శాతం వాటాను కలిగి ఉండనున్నాయి. 

బ్యాంకుల విలీనంపై వివిధ బ్రోకరేజిలకు చెందిన విశ్లేషకుల అభిప్రాయాలు:
విలీన బ్యాంకులతో జాగ్రత్త..
దీర్ఘకాల విలీన పక్రియ వలన  విలీన బ్యాం‍కులు బీజీగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రవేటు రంగ బ్యాంకులకు లాభాన్ని చేకూర్చేదని ఎమ్కే గ్లోబల్‌ ఎనలిస్ట్‌ ఆనంద్‌ దమా, రాహుల్‌ మలానీ మంగళవారం విడుదల చేసిన ఒక  నివేదికలో తెలిపారు. అంతేకాకుండా ఎమ్కే సెక్యూరిటీస్‌.. ఇండియన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘హోల్డ్‌’ తగ్గించగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌బ్యాంక్‌లపై ‘సెల్‌’ కాల్‌ కొనసాగిస్తోంది. ఎస్‌బీఐ పై ‘బై’ కాల్‌ను కొనసాగిస్తున్న ఈ బ్రోకరేజీ, లార్జ్‌ క్యాప్‌ స్టాకులలో ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
   హెచ్ఆర్(హూమన్‌ రిసోర్స్‌), బ్రాంచ్ల హేతుబద్ధీకరణ వంటి సవాళ్లు విలీన పక్రియ వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటాయని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ లిమిటెడ్, కునాల్ షా నేతృత్వంలోని విశ్లేషకులు శుక్రవారం ఇన్వెస్టర్ల నోట్‌లో పేర్కొన్నారు. ‘వృద్ధి చెందడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి స్థితిలో ఉండడంతో బ్యాంకింగ్‌ విభాగంలో ఎస్‌బీఐని పరిశీలించవచ్చు’ అని అన్నారు.

రుణ వృద్ధి మందగిస్తుంది..
‘ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసినప్పుడు చిన్న బ్యాంకుల మేనేజ్‌మెంట్‌ బ్యాంక్‌ విలీన పక్రియలో మునిగి ఉండడంతో ఈ బ్యాంకుల రుణ వృద్ధి మందగిస్తుందనే విషయం గత అనుభవాలను బట్టి తెలుస్తోంది’ అని యూబీఎస్‌ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశ్లేషకులు విశాల్ గోయల్, ఇశాంక్ కుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాకులను యూబీఎస్‌ ఎంచుకునే స్టాకులలో ముందున్నాయి. 
  విలీన పక్రియ వలన చిన్న బ్యాంకులు నష్టపోతాయని నోమురా ఫైనాన్సియల​అడ్వజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు ఆదర్శ్‌ పరస్రామ్‌పురియా అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి ప్రైవేట్‌ బ్యాంక్‌లను ఎంచుకోవడం మంచిదని, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎస్‌బీఐ బాగుందని తెలిపారు.

రుణాల కొరతను సృష్ఠిస్తుంది..
‘ప్రభుత్వ బ్యాంకుల విలీన పక్రియ దీర్ఘకాలానికి మంచి చర్య. కానీ సమీప కాలంలో ఈ చర్య వలన బ్యాంకుల రుణ వృద్ధి తగ్గుతుంది’ అని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకుడు సుమీత్‌ కరివాలా సోమవారం ఓ నోట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ స్టాకులపై ఈ బ్రోకరేజి అండర్‌ వెయిట్‌ను కొనసాగిస్తోంది. 
   ‘బ్యాంకుల విలీనం మధ్యస్థ, దీర్ఘకాలంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తోంది’ అని సీటీ గ్రూప్‌ విశ్లేషకుడు మనిష్‌ శుక్లా ఓ నోట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే మూలధనం కొన్ని బ్యాంకులకే అందుతుందని తెలిపారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్టాకును ‘న్రూట్రల్‌’ నుంచి ‘బై’ కి ఈ బ్రోకరేజీ నవీకరించింది.
  ‘విలీనం వలన సమీప భవిష్యత్‌లో బ్యాంకుల వృద్ధి తగ్గవచ్చు కానీ మొండిబకాయిల రిజల్యూషన్‌ వేగంగా జరుగుతుంది. రుణ వృద్ధి తగ్గడం వంటి సమస్యలను కూడా విలీన బ్యాం‍కులు ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని గోల్డ్‌మాన్‌ శాచ్‌ గ్రూప్‌ విశ్లేషకుడు రాహుల్‌ జైన్‌ ఓ నోట్‌లో తెలిపారు.You may be interested

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Tuesday 3rd September 2019

జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా మార్కెట్‌ భారీ నష్టాలను చవిచూసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 37000, నిఫ్టీ 11000 స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 484 పాయింట్లు పతనమై 36,823.12 వద్ద  నిఫ్టీ 245 పాయింట్ల 10,878.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విలీన ప్రక్రియ ప్రతిపాదన నేపథ్యంలో మొండిబకాయిలు పెరగవచ్చనే భయాలతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అగస్ట్‌లో వాహన

నష్టాల్లో ప్రతిపాదిత విలీన బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 3rd September 2019

బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దే ప్రక్రియలో భాగంగా కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనానికి తెరతీసింది. మొత్తం 10బ్యాంకుల విలీనం చేసి 4బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించింది. తాజా విలీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కు పరిమితం కానుంది. విలీనం అవుతున్న బ్యాంకుల్లో కొన్నింటికి తగినంత మూలధనం లేకపోవడం, విలీనం అనంతరం మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌లో పీఎన్‌బీ రంగ షేర్లు భారీగా క్షీణించాయి.

Most from this category