News


14 శాతం తగ్గనున్న కేబుల్‌, డీటీహెచ్‌ బిల్లు

Tuesday 7th January 2020
Markets_main1578420853.png-30741

కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలకు సంబంధించి ట్రాయ్‌ నూతన మార్గదర్శకాలతో డీటీహెచ్‌/ కేబుల్‌ టీవీ నెలవారీ బిల్లుల భారం 14 శాతం వరకు ప్రస్తుత స్థాయి నుంచి తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. టారిఫ్‌లకు సంబంధించి నూతన నియంత్రపరమైన కార్యాచరణను ట్రాయ్‌ గత వారమే ప్రకటించింది. దీంతో తక్కువ సబ్‌స్క్రిప్షన్‌కే టీవీ యూజర్లు మరిన్ని చానళ్లను వీక్షించే అవకాశం రానుంది. వచ్చే మార్చి 1 నుంచి ట్రాయ్‌ నూతన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. 

 

‘‘అన్ని రకాల ఉచిత చానళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన చార్జీని గరిష్టంగా రూ.160కు ట్రాయ్‌ పరిమితం చేసింది. అలాగే, నెట్‌వర్క్‌ కెపాసిటీ గరిష్ట ఫీజును 200 చానళ్లకు రూ.130గా ట్రాయ్‌ నిర్ణయించింది. ఈ మార్పులు డీటీహెచ్‌, కేబుల్‌ బిల్లులను 14 శాతం మేర తగ్గించేస్తాయి. అలాగే, యూజర్లను తమ ఇష్టానికి అనుగుణంగా ఏ ఎల్‌ఏ కార్టే చానళ్లను ఎంచుకునే దిశగా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. అయితే, సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లు (జీఈసీ), స్పోర్ట్స్‌ చానళ్లకు అధిక ధర కేటాయించడం (గత టారిఫ్‌ సవరణ ఆదేశాల్లో), ట్రాయ్‌ టారిఫ్‌ ఆదేశాల ఉద్దేశ్యాన్ని నీరుగార్చింది. ఫలితంగా వినియోగారులకు బిల్లులు 23 శాతం పెరిగేందుకు దారితీసింది’’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 

 

టారిఫ్‌ల్లో ఇటీవల చేసిన మార్పులతో జీఈసీలు, స్పోర్ట్స్‌ చానళ్ల ధరలు రూ.19 నుంచి రూ.12కు తగ్గనున్నాయని ఇక్రా అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాక్షి సునేజా తెలిపారు. ఏ లా కార్టె చానళ్ల ఆకర్షణీయతను పెంచే దిశగా ట్రాయ్‌ ఆదేశాలున్నాయని చెప్పారు. ‘‘ధరలు పెరుగుతాయని ఇక్రా అంచనా వేయడంలేదు. అయితే ఒక సమూహంగా ఇస్తున్న చానళ్లు తగ్గొచ్చు. గతంలో 81 పేచానళ్లతో కూడిన ప్యాకేజీ రూ.349 ధర ఉండేది. అదే ఇప్పుడు 51 పేచానళ్లకు పరిమితం కావచ్చు. అయితే, ఇది వీక్షకులపై పెద్దగా ప్రభావం చూపదు. ఎందుకంటే వారు కొన్ని ప్రజాదరణ చానళ్లను చూడ్డానికే పరిమితం అవుతారు’’ అని సునేజా వివరించారు. ట్రాయ్‌ ఇటీవలి ఆదేశాలు బ్రాడ్‌కాస్టర్ల ఆదాయాలపై గట్టిగానే ప్రభావం చూపిస్తాయని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ కింజాల్‌ షా అన్నారు. చందాదారుల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుందన్నారు. You may be interested

పతనంతో ప్రారంభం?

Wednesday 8th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 114 పాయింట్లు డౌన్‌ యూఎస్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్‌ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు తెరతీశాయి. దీంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.20 ప్రాంతం‍లో 114 పాయింట్లు పడిపోయి 11,942 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,106 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌

వినియోగం తగ్గలే..! రూటు మార్చుకున్నదంతే..!

Tuesday 7th January 2020

దేశంలో వినియోగం రూటు మార్చుకున్నందటున్నారు టెక్నోపార్క్‌ సీఎండీ అరవింద్‌ సింఘాల్‌. దీనికి నిదర్శంగా విద్య, శిక్షణ, ఆరోగ్య సంరక్షణ, వినోదం, విహారంపై గత మూడు త్రైమాసికాల్లో వినియోదారులు చేస్తున్న ఖర్చు బలంగా ఉందన్నారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా సింఘాల్‌ దేశంలో వినియోగంపై తన విశ్లేషణాత్మక అభిప్రాయాలను తెలియజేశారు.   వినియోగం తగ్గలేదు.. ‘‘వినియోగదారుల వ్యయాలు సేవల వైపు మళ్లుతున్నట్టు దీర్ఘకాలిక ధోరణి తెలియజేస్తోంది. దీంతో సరుకులపై చేసే వ్యయాలపై ఈ

Most from this category