News


డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ ఫలితాలు: 45 శాతం పెరిగిన లాభం

Monday 29th July 2019
Markets_main1564399024.png-27388

డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్ సోమవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో ఏకీకృత లాభం (పన్నుల తర్వాత లాభం) 45 శాతం పెరిగి ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన రూ.662.80 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .456.10 కోట్ల ఏకీకృత లాభాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విశ్లేషకులు ఈ లాభం రూ.481 కోట్లుగా అంచనా వేయగా ఫలితాలు అంచనాలను మించి రావడం గమనర్హం. ఈ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం 3 శాతం పెరిగి రూ .3,844 కోట్లకు చేరుకుందని బీఎస్‌ఇ దాఖలులో కంపెనీ పేర్కొంది. అయితే మార్చి త్రైమాసికంలో 52.45 శాతం ఉన్న  స్థూల లాభాల మార్జిన్  ఈ క్యార్టర్‌లో 51.7 శాతానికి పడిపోయింది.  ‘ఈ త్రైమాసికంలో మా కీలక మార్కెట్లలో వృద్ధి సాధించాము. ఇదే పనితీరుతో  కొనసాగాలని ఆశిస్తున్నాం’ అని సీఈఓ, కో-చైర్మన్, జి.వి.ప్రసాద్ తెలిపారు. డా. రెడ్డీస్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో 2.11 శాతం నష్టపోయి రూ.2,648  వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడినందున, ఈ షేరుపై ఇన్వెస్టర్ల స్పందన మంగళవారంనాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో వెల్లడవుతుంది.



You may be interested

లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల వాటా 13.7 శాతం

Tuesday 30th July 2019

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), మన దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) మధ్య పెట్టుబడుల పరంగా అంతరం తగ్గిపోతోంది. ఎఫ్‌పీఐలు క్రమంగా అమ్మకాలు సాగిస్తుంటే, అదే సమయంలో డీఐఐలు కొనుగోళ్లు జరుపుతున్న విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల పెట్టుబడుల విలువ జూన్‌ 30 నాటికి రూ.20.42 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 0.89 శాతం అధికం. ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ జూన్‌ చివరికి రూ.29.36

11,200 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 29th July 2019

మార్కెట్‌ అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి. ఫలితంగా సూచీలు సోమవారం భారీ నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటో, మెటల్, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువత్తడంతో సెన్సెక్స్‌ 196 పాయింట్లు నష్టపోయి 37,686.37 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లను నష్టపోయి 11200ల దిగువున 11189.20 వద్ద స్థిరపడ్డాయి.  బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 29,295.90 వద్ద స్థిరపడింది. ఒక్క

Most from this category