రాణిస్తున్న డాక్టర్ రెడ్డీస్..ఫార్మా ఇండెక్స్ డౌన్
By Sakshi

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని సెషన్ల నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ బుధవారం సెషన్లో మధ్యాహ్నాం 12.06 సమయానికి 1.98 శాతం నష్టపోయి 7,818.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్ షేర్లయిన దివిస్ ల్యాబ్ 1.83 శాతం, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లి. 1.26 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, డా. రెడ్డీస్ మాత్రం 1.40 శాతం లాభపడి ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో సిప్లా 0.73 శాతం, బయోకాన్ లి. 0.29 శాతం లాభపడి ట్రేడవుతుండగా, సన్ ఫార్మా 6.89 శాతం, గ్లెన్‌మార్క్ 3.02 శాతం, అరబిందో ఫార్మా 1.76 శాతం, కాడిలా హెల్త్ కేర్ 1.57 శాతం, లుపిన్ 0.33 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
You may be interested
నష్టాల్లోంచి లాభాల్లోకి బ్యాంక్ నిఫ్టీ
Wednesday 4th September 2019మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం లాభనష్టాల మధ్య కదలాడుతుంది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 26,785.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభంలో భాగంగా మొదటి 183 పాయింట్లు(0.68శాతం) క్షీణించి 26641.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం కనిష్టస్థాయి వద్ద బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ కనిష్టస్థాయి (26641.35) 482 పాయింట్లు(దాదాపు 2శాతం) పెరిగి 27,123.00 వద్ద
జెట్‌కు కొత్త బిడ్డర్లు దూరం
Wednesday 4th September 2019బిడ్ల దాఖలుకు మూడోసారి ముగిసిన డెడ్‌లైన్ ఇక రేసులో మూడే సంస్థలు ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. "మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే