News


డాక్టర్‌ రెడ్డీస్‌ క్యూ3 నష్టం రూ. 570 కోట్లు

Monday 27th January 2020
Markets_main1580109767.png-31235

ఇంపెయిర్‌మెంట్‌ చార్జీల ఎఫెక్ట్‌
52 వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు

ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్లమేర నికర నష్టం నమోదు చేసింది. గతేడాది అంటే 2018-19 క్యూ3లో రూ. 485 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం పుంజుకుని రూ. 4,384 కోట్లకు చేరింది. తాజా సమీక్షా కాలంలో నువరింగ్‌ తదితర కొన్ని ప్రొడక్టులకు సంబంధించి ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలను నమోదు చేయవలసి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సహచైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. దీంతో లాభాలు ప్రభావితమైనట్లు ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేశారు. మంచి ఫలితాలు సాధించడంపై దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నట్లు వివరించారు. నాణ్యమైన విధానాలు, నిర్వహణ సామర్థ్యం వంటి అంశాలలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. 

అధికారిక జనరిక్‌
క్యూ3లో డాక్టర్‌ రెడ్డీస్‌ నువరింగ్‌ ఔషధానికి అధికారిక జనరిక్‌ ప్రొడక్ట్‌కు విడుదల చేసింది. అయితే ఈ ప్రొడక్ట్‌ విలువలో ప్రస్తావించదగ్గ స్థాయిలో కోతపడింది. దీంతో ఈ ఔషధానికి సంబంధించి ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలను కంపెనీ నమోదు చేసింది. దీనికితోడు కొన్ని ఇతర ప్రొడక్టుల విషయంలోనూ ధరల క్షీణత, నిలిచిపోయిన వసూళ్లు తదితర ఇన్‌టాంజిబుల్స్‌ కారణంగా నష్టాలు నమోదు చేయవలసి వచ్చినట్లు తెలుస్తోంది. వెరసి మొత్తం ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు రూ. 1320 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలియజేసింది. వీటిలో నువరింగ్‌ వాటా రూ. 1320 కోట్లుగా తెలియజేసింది. ఈ కాలంలో స్థూల నిర్వహణ మార్జిన్లు 54.1 శాతానికి చేరాయి. ఈ ఏడాది క్యూ2లో ఇవి 57.5 శాతంగా నమోదుకాగా.. గతేడాది క్యూ3లో 53.9 శాతంగా ఉన్నాయి. యూఎస్‌, యూరోప్‌ తదితర మార్కెట్లలో కొన్ని ప్రొడక్టుల ధరలు క్షీణించినప్పటికీ కొత్త ఔషధాల విడుదల, తయారీ సామర్థ్యం తదితరాల ద్వారా మార్జిన్లను మెరుగుపరచుకోగలిగినట్లు కంపెనీ వివరించింది.

షేరు ప్లస్‌లో
ఫలితాలు విడుదలయ్యాక మధ్యాహ్నం 12.50 ప్రాంతంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 3,156 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 3,167 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తొలుత రూ. 2,998 దిగువన ఇంట్రాడే కనిష్టాన్నీ చవిచూసింది.



You may be interested

బ్యాంకు నిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం!

Monday 27th January 2020

గతవారం బ్యాంకు నిఫ్టీలో గణనీయంగా షార్ట్స్‌ పెరిగాయి. దీంతో ఫ్యూచర్స్‌ ఓఐ సుమారు 20 శాతం పెరిగింది. దీంతో స్వల్పకాలానికి బ్యాంకు నిఫ్టీలో వెనుకంజకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని సూచిస్తున్నారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ప్రస్తుత మార్కెట్‌ధరకు సమీప పుట్‌ను కొనుగోలు చేయడం, అంతకన్నా దిగువ పుట్‌నువిక్రయించడం చేస్తారు. వ్యూహంలో లాభం

ఐసీఐసీఐ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 27th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధృక్పథం వెలిబుచ్చుతున్నాయి.  = బ్యాంకు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ తెలిపింది. టార్గెట్‌ ధరను రూ. 560 నుంచి రూ. 650కి పెంచింది. బ్యాంకు క్యు3 ఫలితాల్లో ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ బలంగా ఉన్నాయని, రికవరీలు మెరుగుపడ్డాయని తెలిపింది. స్లిపేజ్‌లు బీబీ బుక్‌ మాత్రం కొంత పెరిగాయని, ఇవి సమీప భవిష్యత్‌లో

Most from this category