News


డాక్టర్‌ రెడ్డీస్‌ 8శాతం డౌన్‌

Monday 11th February 2019
Markets_main1549864933.png-24120

దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు సోమవారం 8శాతం నష్టపోయాయి. ఇటీవల హైదరాబాద్‌ బూచపల్లి ఫార్యూలేషన్‌ యూనిట్‌-3లో తనిఖీలు నిర్వహించిన అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీ) యూనిట్‌లో 11లోపాలను గుర్తిస్తూ 483-ఫామ్‌ను జారీ చేసినట్లు శుక్రవారం డాక్టర్‌ రెడ్డీస్‌ స్టాక్‌ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రతికూల అంశంతో నేడు బీఎస్‌ఈలో షేరు 4శాతం నష్టంతో రూ.2670.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ఇంట్రాడేలో షేరు అమ్మకాలకు పూనుకోవడంతో ఒకానొక దశలో 8శాతం నష్టపోయి రూ. 2555.55లు కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:00లకు షేరు గత ముగింపు ధర(రూ.2772.3)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.2605.60వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1888.00 రూ.2875.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఆర్థిక ఒత్తిడిని ఎలా జయించాలి

Monday 11th February 2019

ఆర్థిక ఒత్తిడిని జయించాలంటే..! ఆర్థిక సమస్యలు ఎక్కువైతే ఆరోగ్యానికీ ముప్పు ఖర్చుల విషయంలో పక్కాగా వ్యవహరించాలి కనీస అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం తర్వాత లక్ష్యాల కోసం పెట్టుబడులు మిగిలితేనే విచక్షణారహిత వినియోగం ఇందుకోసం ప్రతీ ఒక్కరికీ బడ్జెట్‌ అవసరం ఇప్పుడు ఎవరినోటవిన్నా వినిపిస్తున్న మాట.. ఒత్తిడి. జీవనశైలిలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఇక మన దేశానికొస్తే... ప్రతీ పది మందిలో ఒక్కరు మినహా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లకు ఆర్థిక అంశాలే మూలమని సిగ్నా 360

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 11th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు భారతీ ఎయిర్‌టెల్‌:- కెన్యా ఎయిర్‌టెల్‌ విభాగం ఆఫ్రికాలోని టెలికామ్‌ కెన్యా కంపెనీ విలీనం చేసుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జీనియస్‌ కలర్స్‌ కంపెనీలో 9.50శాతం వాటాను రూ.45 కోట్లకు తన అనుబంధ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ హైదరాబాద్‌లోని బూచుపల్లి ఫార్మేషన్‌ యూనిట్‌-3లో తనిఖీలను పూర్తి చేసింది. లుపిన్‌:- గోవా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 2రెండు అబ్జర్వేషన్లలతో కూడిన 483-ఫామ్‌ను

Most from this category