News


పావెల్‌ వ్యాఖ్యలతో యూఎస్‌ సూచీల పతనానికి బ్రేక్‌!

Saturday 29th February 2020
Markets_main1582956612.png-32183

  • వరుసగా ఏడోరోజూ నష్టాల్లో ముగిసిన ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 
  • 2008 తర్వాత ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నాస్‌డాక్‌, డౌజోన్స్‌

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చనే భయాలతో ఈ దేశ స్టాక్‌ సూచీలు శుక్రవారం నష్టంతో ముగిశాయి. సూచీలకు ఇది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇలాగే కొనసాగితే ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ వ్యాఖలు సూచీల భారీ పతనాన్ని అడ్డుకున్నాయి. 

 కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి పట్ల అప్రమత్తత వహించాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలతో ఈ వారం ప్రారంభం నుంచి నష్టాలను చవిచూస్తున్న సూచీలు శుక్రవారం సైతం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో డౌజోన్స్‌ ఇండెక్స్‌ 813.67 పాయింట్లను నష్టపోయి 25వేల దిగువన 24,680.57 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 123 పాయింట్లు నష్టపోయి 2,855.84 వద్ద, నాస్‌డాక్‌ 302 పాయింట్ల పతనమైన 8,264.16 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. 

సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్న తరుణంలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జోరోమ్‌ పావెల్‌ వాఖ్యలు పతనాన్ని అడ్డుకున్నాయి. అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ అంటువ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లైతే రానున్న రోజుల్లో సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని తెలిపారు. ఫలితంగా సూచీలు కనిష్టస్థాయి నుంచి రివకరీ అయ్యాయి. ముఖ్యంగా ఇంధన, సాంకేతిక, కమ్యూనికేషన్‌ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు అధికంగా జరిగాయి. 

ఫలితంగా మార్కెట్‌ ముగిసేసరికి ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 24.54 పాయింట్ల నష్టంతో 2,954.22 వద్ద,  డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 357 పాయింట్లు క్షీణించి 25,409.36 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ మాత్రం ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా స్థిరపడింది. కరోనా వైరస్ వ్యాధి భయాలతో ఈ వారంలో డౌజోన్స్‌ 12.4శాతం, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు 10.5శాతం నష్టపోయి అక్టోబర్‌ 2008 తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ సైతం 11.50శాతం క్షీణించింది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పాజిటివ్‌!

Saturday 29th February 2020

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం నిఫ్టీ ఫ్యూచర్స్‌ ముగింపు( 11149.15)తో పోలిస్తే 75.85 పాయింట్లు పెరిగి 11149.15 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈసారి వడ్డీరేట్ల తగ్గింపు యోచనలో ఉన్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలపరించింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా సూచీలు 3శాతం కనిష్టస్థాయి నుంచి రివకరీ అయ్యాయి.  ఇక దేశీయ మార్కెట్ల విషయానికొస్తే... ప్రస్తుతమున్న ఆర్థిక మందగమనం

ఇండియా సైతం తప్పించుకోలేదు!

Saturday 29th February 2020

కరోనా కరెక‌్షన్‌ ప్రభావం తప్పదు పెట్టుబడిసాధనాలన్నీ దుర్బలంగా ఉన్నాయి మార్క్‌ ఫెబర్‌ హెచ్చరికలు భారత్‌ సహా అన్ని మార్కెట్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయని ప్రముఖ అనలిస్టు మార్క్‌ ఫెబర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా పతనం వస్తోందని, ఈ వరుసలో ఇండియా సైతం కరెక‌్షన్‌ తప్పించుకోలేదని తెలిపారు. కరోనా వైరస్‌ అనేది ఈ పతనానికి ఒక ఉత్ప్రేరకమేనన్నారు. ప్రస్తుతం ప్రపంచ బుల్‌మార్కెట్‌ 11వ సంవత్సరంలో ఉందన్నారు. 2009 మార్చి6న అంతర్జాతీయ బుల్‌మార్కెట్‌ ఆరంభమైందన్నారు. అన్ని మార్కెట్లలో

Most from this category