News


డోజోన్స్‌- వండర్‌

Wednesday 25th March 2020
Markets_main1585107609.png-32661

1933 తదుపరి డోజోన్స్‌ దూకుడు
ఎస్‌అండ్‌పీ -12నాటి ఏళ్ల రికార్డ్‌
భారీ సహాయక ప్యాకేజీ అంచనాలు

 
ప్రజలకూ, ఆర్థిక వ్యవస్థలకూ పెనునష్టాన్ని కలిగిస్తోన్న కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించనున్న అంచనాలు మంగళవారం ఇన్వెస్టర్లకు ఎక్కడలేని ఉత్సాహాన్నీ ఇచ్చాయి. దీంతో మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో డోజోన్స్‌ ఇండెక్స్‌ ఏకంగా 2,113 పాయింట్లు (11.4 శాతం) దూసుకెళ్లింది. ఇంతక్రితం 1933లో మాత్రమే ఒకే రోజులో ఇంత అధికంగా లాభపడింది. వెరసి 20,705 వద్ద నిలిచింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి గరిష్టంగా 9.4 శాతం(210 పాయింట్లు) జంప్‌చేసి 2,447 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 557 పాయింట్లు(8.2 శాతం) ఎగసి 7,418 వద్ద స్థిరపడింది.

ర్యాలీ ఎందుకంటే?
2008 తదుపరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ, ప్రజలనూ కుదిపేస్తున్న కరోనాను ఎదుర్కొని వృద్ధి బాట పట్టేందుకు వీలుగా భారీ సహాయక ప్యాకేజీకి రూపకల్పన జరుగుతున్నట్లు యూఎస్‌ అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 2 లక్షల కోట్ల డాలర్లతో ప్యాకేజీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజురోజుకీ బలపడుతున్న డాలరు ఇండెక్స్‌ 101ను అధిగమించాక వెనకడుగు వేసింది.

దూకుడు ఇలా
చిప్‌ స్టాక్స్‌ ఎన్‌విడియా, ఏఎండీ 10 శాతం పుంజుకోవడంతో నాస్‌డాక్‌ లాభపడగా.. చెవ్రాన్‌ 23 శాతం, ఎక్సాన్‌ మొబిల్ 13 శాతం, నైకీ 15 శాతం చొప్పున ఎగశాయి. దీంతో డోజోన్స్‌కు హుషారొచ్చింది. 

ఇతర మార్కెట్లు సైతం
అమెరికా భారీ ప్యాకేజీపై ఆశలతో యూరోపియన్‌ మార్కెట్లు సైతం హైజంప్‌ చేశాయి. 2008 తదుపరి జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ 11-8 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియా మార్కట్లలో జపాన్‌ 6 శాతం జంప్‌చేయగా.. కొరియా, తైవాన్‌ 5 శాతం ఎగశాయి. ఇతర మార్కెట్లలో సింగపూర్, హాంకాంగ్‌, చైనా 2 శాతం స్థాయిలో బలపడ్డాయి.



You may be interested

లాభాల ఓపెనింగ్‌ ..!

Wednesday 25th March 2020

అంతర్జాతీయ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు 250 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌  7800 పైన నిఫ్టీ ప్రా‍రంభం రిలయన్స్‌ 8శాతం జంప్‌ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 258.41 పాయింట్ల లాభంతో 26932.44 వద్ద, నిఫ్టీ 72.05 పెరిగి 7873.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ప్యాకేజీని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

రియల్టీకి కరోనా కాటు

Wednesday 25th March 2020

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహ నిర్మాణాలు ఆలస్యం 8–10 శాతం తగ్గనున్న నిర్మాణ సంస్థల ఆదాయం హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ రియల్టీ రంగం మీద కరోనా వైరస్‌ ప్రభావం పడింది. కోవిడ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఉన్న కారణంగా గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యమవుతాయని హౌజింగ్‌ బ్రోకరేజ్‌ అనరాక్‌ కన్సల్టెన్సీ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి  2013–19

Most from this category