News


సమీప కాలంలో నిఫ్టీ 12,000 కష్టమే!

Friday 7th September 2018
Markets_main1536260482.png-20024

నిఫ్టీ ఇప్పటికిప్పుడు 11,800-12,000 మార్క్‌ను చేరుకోవడం కష్టమని, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో సూచీలు వేడెక్కాయని అజ్కాన్‌ గ్లోబల్‌ ఈక్విటీ రీసెర్చ్‌ ఆకాష్‌ జైన్‌ పేర్కొన్నారు. రూపాయి పతనం, ద్రవ్యలోటు ప్రభావాలు మార్కెట్లపై పడే అవకాశం ఉందన్నారు. కనుక ఈ దశలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని సూచించారు. ‘‘నిఫ్టీ 11,800-12,000 ఇప్పటికిప్పుడు చేరుతుందని మేం భావించడం లేదు. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సూచీలను మరీ వేడెక్కించాయని నమ్ముతున్నాం. కేంద్ర బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) వేయడంతో వచ్చిన కరెక్షన్‌ కారణంగా ఎన్నో మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ దిద్దుబాటుకు గురై సరసమైన విలువల వద్ద లభిస్తున్నాయి. ఎఫ్‌పీఐలకు సంబంధించి సెబీ ఇటీవలి ఉత్తర్వులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు విఘాతం కలిగించాయి’’ అని ఆకాష్‌ జైన్‌ పేర్కొన్నారు.

 

రిస్క్‌ ఉంది
మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా దేశీయంగా పెట్టబడుల రాకతోపాటు, విదేశీ నిధుల కూడా వస్తున్నాయని ఆకాష్‌ జైన్‌ తెలిపారు. కానీ, ఈ స్థాయిల్లో మార్కెట్లలో స్వల్పకాలానికి కచ్చితంగా రిస్క్‌ ఉందన్నారు. జీడీపీ మంచి వృద్ధి నమోదు చేసినప్పటికీ, రూపాయి రికార్డు స్థాయి కనిష్టాలకు చేరడం, అధిక చమరు ధరలు, ద్రవ్యలోటుపై గణనీయ ప్రభావం చూపుతాయని, ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందన్నారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌, రూపాయి కదలికలు, చమురు ధరల్లో ఆటుపోట్లు, వాణిజ్య ‍యుద్ధ భయాలు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలుగా పేర్కొన్నారు. 

 

జీడీపీ గణాంకాలు ఆశ్చర్యమేమీ కాదు
జూన్‌ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2 శాతం మార్కును చేరుకోవడంపై ఆకాష్‌ జైన్‌ ‍స్పందిస్తూ... ఇది తమను ఆశ్చర్యపరచలేదన్నారు. ప్రస్తుత జీడీపీ లెక్కలన్నీ సవరించిన బేస్‌ ఇయర్‌ ఆధారంగా వచ్చినవేనని, దీనివల్ల 2011-12 నాటి జీడీపీ గణాంకాలతో పోలిస్తే 1.5-2 శాతం ఎక్కువని చెప్పారు. సమీప కాలంలో రూపాయి డాలర్‌తో 73 స్థాయికి దిగకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

స్టాక్స్‌ వారీగా యాక్షన్‌
ఇన్వెస్టర్లు స్టాక్‌ వారీగా అడుగులు వేయాలని ఆకాష్‌ జైన్‌ సూచించారు. డాలర్‌తో రూపాయి కనిష్టాలకు చేరినందున ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అమెరికన్‌ ఫార్మా కంపెనీల లాబీయింగ్‌, ట్రంప్‌ విధానాల కారణంగా యూఎస్‌ఎఫ్‌డీఏ భారత ఫార్మా కంపెనీల పట్ల తొలుత కఠినంగా వ్యవహరించగా, తర్వాత కాస్త సడలించినట్టు చెప్పారు. రూపాయి పతనం ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు లాభదాయకంగా పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ కంపెనీల మార్జిన్లపై చమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభావం పడుతుందన్నారు. మెటల్స్‌, పవర్‌, సిమెంట్‌ కంపెనీల్లో కొన్ని దిగుమతి బొగ్గుపై ఆధారపడి ఉన్నందున ఈ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. అలాగే, టెలికం సహా విదేశీ రుణాలను పొందిన కంపెనీలకూ విఘాతమేనన్నారు. రానున్న ఏడాది కాలానికి సన్‌ఫార్మా,  ఎండ్‌అండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్టాక్స్‌ను సూచించారు.You may be interested

పోర్ట్‌ఫోలియో వృద్ధికి ‘దమానీ’ సక్సెస్‌ టిప్స్‌

Friday 7th September 2018

వ్యాల్యూ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకున్న రమేష్‌ దమానీ, డీమార్ట్‌ పేరుతో రిటైల్‌ దుకాణాల చైన్‌ను ప్రారంభించి, ప్రముఖ రిటైల్‌ కంపెనీల్లో ఒకటిగా, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ కంపెనీగా దాన్ని తీర్చిదిద్ది... టాప్‌ వ్యాపార వ్యూహకర్తల్లో ఒకరిగా నిలిచారు. మరి సాధారణ ఇన్వెస్టర్‌, ఓ ప్రముఖ ఇన్వెస్టర్‌గా అవతరించేందుకు, తమ సంపద సృష్టికి అనుసరించాల్సిన చిట్కాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.   బేర్‌ మార్కెట్లో కొనుగోళ్ల పట్ల

పీఎస్‌బీలకు బీమా కంపెనీల్లో వాటాల జోష్‌

Thursday 6th September 2018

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు, పూర్వ వైభవం సొంతం చేసుకునేందుకు నిధుల మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రధాన వ్యాపారమైన బ్యాంకింగ్‌ సేవల కోసం, ప్రధానేతర ఆస్తులను సొమ్ము చేసుకోవాలనే యోచనతో ఉన్నాయి. ముఖ్యంగా బీమా సంస్థల్లో తమకున్న వాటాలను కొంత మేర విక్రయించాలనుకుంటున్నాయి. అంతేకాదు మంచి డీల్‌ దొరికితే పూర్తిగా బీమా వ్యాపారం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగానే ఉండడం తాజా పరిణామం.    నిధులు, నాణ్యమైన రుణాలు ఇప్పుడు బ్యాంకులకు కీలకంగా మారింది.

Most from this category