News


నాణ్యమైన షేర్లను విడిచిపెట్టకండి

Monday 5th August 2019
Markets_main1564989362.png-27539

‘ప్రస్తుత మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలలో కూడా మా సలహా ఎంటంటే ‘నాణ్యమైన స్టాకు’లను విడిచి పెట్టకండి. ప్రస్థుత పరిస్థితులలో ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులను ఓపికగా కూడబెట్టుకోవాలి. వీటిపై  రివార్డులు ఈ ఏడాది  రెండవ భాగంలో కనిపిస్తాయి’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.  కార్పోరేట్‌ కంపెనీల ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయని, ఫలితాలు వెలువడిన తర్వాత  ఈ కంపెనీల వ్యాఖ్యానాలే ముఖ్యంగా మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏసియన్‌ పెయింట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, డాబర్ ఇండియా, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని హిట్‌యిన స్టాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో స్టాక్స్ వంటి కొన్ని మిస్‌ అయిన స్టాకులు కూడా ఉన్నాయని, బజాజ్ ట్విన్స్‌ మరింత పడిపోయే అవకాశం కూడా ఉందని వివరించారు. ‘ప్రస్తుత పరిస్థితులలో హిట్‌ల కంటే మిస్‌లు ఎక్కువగా ఉండడం గమనర్హం. మార్కెట్ల మూడ్‌ను మార్చే పెద్ద ట్రిగ్గర్‌లు ఇప్పటిలో కనిపించడం లేదు. కాబట్టి మార్కెట్ల రికవరీ ఎప్పుడుంటుందో చెప్పడం కష్టం’ అని తెలిపారు.



You may be interested

సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా...

Monday 5th August 2019

పన్నులూ...మినహాయింపులూ స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలకు 80సీ కింద మినహాయింపు రూ.50 లక్షలు మించితే టీడీఎస్‌ 1 శాతం కోత ఎన్‌ఆర్‌ఐ నుంచి కొనుగోలు చేస్తే టీడీఎస్‌ తప్పనిసరి బహుమతి రూపంలో పొందినా పన్ను కాకపోతే రక్త సంబంధీకులకు మినహాయింపు రుణం తీసుకుని ఇంటిని కొంటే ప్రయోజనాలు అసలు, వడ్డీ చెల్లింపులకు మినహాయింపులు రెండు ఇళ్లకు మించి ఉంటే అద్దెపై పన్ను సొంతిల్లున్నా, హెచ్‌ఆర్‌ఏపైనా పన్ను ప్రయోజనం ఇలా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో... సొంతిల్లు చాలా మంది స్పప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఙాపకాలను మధురంగా పరిగణించే

2 ట్రిలియన్‌ డాలర్‌ క్లబ్‌ నుంచి భారత్‌ మార్కెట్‌ బయటకు!

Monday 5th August 2019

దేశియ స్టాక్‌ మార్కెట్‌ (బీఎస్‌ఈ) రేండేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నా 2 ట్రిలియన్‌ మార్కె‍ట్‌ క్యాప్‌(ఎం-క్యాప్‌) క్లబ్‌ నుంచి నిష్క్రమించింది.   ఆగస్టు 2 నాటికి అన్ని లిస్టెడ్ ఇండియన్ స్టాక్స్ విలువ 1.97 ట్రిలియన్ డాలర్లకు పడిపోవడం గమనర్హం. ఫలితంగా అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ క్లబ్‌లో భారత ర్యాంక్‌ జర్మనీకి దిగువన 9 వ స్థానానికి దిగజారింది.      బడ్జెట్‌ తర్వాత ఎఫ్‌ఐఐలు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి

Most from this category