News


విలువల రీత్యా ఐటీ షేర్లు బాగున్నాయి: హేమంగ్‌ జాని

Wednesday 17th July 2019
news_main1563361034.png-27133

  • ఫార్మా రంగంపై పూర్తి పాజిటివ్‌గా ఉండొద్దు
  • ఎఫ్‌ఎంసీజీలో వచ్చే 2-3 నెలల్లో  ఎటువంటి అప్‌మూవ్‌ లేదు

ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని కార్పోరేట్‌ బ్యాంక్‌లు, సిమెంట్‌, కొన్ని దేశియ నిర్మాణ కంపెనీలు, కొన్ని ఫార్మా కంపెనీలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.......

ఐటీ బాగుం‍ది...
త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాక  ఇన్ఫోసిస్‌ షేర్లు సానుకూలంగా స్పందించాయి.  యాక్సెంచర్ వంటి కొన్ని గ్లోబల్ ఐటి కంపెనీలు స్థిరంగా ఉన్నాయి. ఐటి కంపెనీల చుట్టూ కొన్ని సానుకూల వార్తల ప్రవాహం ప్రస్తుతం కనిపిస్తోంది. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం.  వృద్ధి అంచనాల దృష్ట్యా హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు కొంత సానుకూలత ఉంటుంది. టిసిఎస్ ట్రేడవుతున్న ప్రస్తుత ప్రీమియం కారణంగా అద్భుత ప్రదర్శన చేయడం కష్టం. కాబట్టి హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.  అమెరికా వృద్ధి రేటు తగ్గనుంది. అయినప్పటికి అంతర్జాతీయంగా ఐటీ రంగ పనితీరును, టెక్నాలజీపై వ్యయాన్ని గమనిస్తే విలువల రీత్యా ఐటీ రంగం బాగానే ఉంది. 
ఆర్‌బీఎల్‌ చిన్నదైనా..
ఆర్‌బీఎల్‌ బ్యాంక్ చిన్నదయినప్పటకి గత రెండేళ్ల నుంచి చక్కటి పనితీరును కనబరుస్తోంది. రుణ పుస్తక సమస్యలను  ఎదుర్కొవడంతో తాజాగా ఈ షేరు దిద్దుబాటుకు గురయ్యింది. యస్‌ బ్యాంక్‌ వంటి  సంస్థలలో ఏర్పడిన పరిస్థితుల వలన ఆర్‌బీఎల్‌ వంటి చిన్న బ్యాం‍కులలో ఇన్వెస్ట్‌ చేయడానికి మదుపర్లు అధికంగా జాగ్రత్త వహిస్తారు. దీని ఆస్తి నాణ్యత, వృద్ధి సంఖ్యలు ఆశించిన స్థాయిలోనే త్రైమాసిక ఫలితాలలో వెలువడతాయని అంచనా వేస్తున్నాం. త్రైమాసిక ఫలితాలు వెలువడేంత వరకు ఈ స్టాకు రేటింగ్‌ ‘హోల్డ్‌’ గా కొనసాగించనున్నాం.
సమస్యల్లో ఎఫ్‌ఎంసీజీ.. 
గత త్రైమాసికం నుంచి ఎఫ్‌ఎంసీజీ స్టాకుల ప్రదర్శన అంచనాల కంటే తక్కువగా ఉంది. గ్రామీణ ఆర్థి వ్యవస్థలో మందగమనం వలన వినియోగం తగ్గడంతో వీటి వృద్ధి రేటు మందగిస్తోంది. హల్‌(హెచ్‌యూఎల్‌), మారికో లేదా గోద్రేజ్‌ వంటి ఎప్‌ఎంసీజీ రంగ కంపెనీల వాల్యుమ్‌ పెరుగుదల 2-4 శాతం కంటే ఎక్కువ లేకపోవడం గమనర్హం. ఈ నిరుత్సాహ వైఖరి గోద్రేజ్‌లో ఇంకా అధికంగా ఉంది. ఎఫ్‌ఎంసీజీ గత రెండు నెలలో 7-10 శాతం దిద్దుబాటుకు గురయ్యింది. ఈ స్టాకుల ధరలలో ఎంత మందగమనం ఉందో అంచనావేయడం కష్టమే! . మార్గదర్శకాలు, నిర్వహణ పొత్సాహకారంగా లేకపోతే ఈ షేర్లు నీరసంగా కదిలే అవకాశం ఉంది. కొంత మంది ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ స్టాకులను రక్షణాత్మక దృక్పథంతో చూడవచ్చు.కానీ ఈ షేర్లలో వచ్చే రెండు మూడు నెలల వరకు అప్‌మూవ్‌ కనిపించడం లేదు.
ఒత్తిడిలో టెలికాం..
 రిలయన్స్‌ జియో తన ప్రణాళికలను అమలు పరిచి మార్కెట్‌ వాటాను పెంచుకుంటే టెలికాం రంగంలో ధరలు పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో  ఈ రంగం ఒత్తిడిలో ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 5జీ కోసం ఈ రంగ కంపెనీలు పెట్టుబడులను సమీకరించుకోవాలసి ఉంది. ఇది ఈ కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లపై అదనపు ఒత్తడికి కారణంగా మారింది. రిలయన్స్‌ జియో, ఓవరాల్‌ పోటి తీవ్రత వలన భారతి ఎయిర్‌టెల్‌ వంటి టెలికాం రంగ కంపెనీలలో ఎటువంటి అప్‌టిక్‌ సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. టెలికాం రంగం నీరసంగా కదలాడే అవకాశం ఉంది.  
ఫార్మా ఓకే కానీ...
ఫార్మారంగంలో నవీకరణ చాలా కాలం తర్వాత కనిపిస్తోంది. ఫార్మా ప్యాక్‌లో ఆదాయల విజిబులిటి కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ రంగంలో అన్నిటి కన్నా ముఖ్యంగా గమనించవలసిన విషయం​ అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు. కొన్ని పెద్ద కంపెనీలు ఈ నిబంధనలను క్లియర్‌ చేసే అంశంలో నరకం చూస్తున్నాయి. వరుస పరిశీలనల తర్వాత తెలిసిందేంటంటే ఈ రంగ కంపెనీలు విడుదల చేసే సంఖ్యలలో ఎఫ్‌డీఏ సంబంధిత సమస్యలు ఎక్కడా కనిపించవు. ఫార్మా రంగం నవీకరణం వలన కొంత అప్‌టిక్‌ ఉన్నప్పటికి పార్మారంగం అం‍త పాజిటివ్‌గా అయితే లేదు. ఈ రంగం‍లో మిగిలిన కంపెనీలతో పోల్చుకుంటే అదబిందో, బయోకాన్‌ వంటి కంపెనీలు బాగానే కనిపిస్తున్నాయి. కానీ లూపిన్‌, సన్‌ వంటి పెద్ద కంపెనీలు  అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడడంతో ఈ కంపెనీలు  సానుకూలంగా లేవు.
అరబిందోను పరిశీలించవచ్చు...   
అరబిందో రుణాలు ఒకనోక సమయంలో అధికంగా ఉండేవి. కానీ గత మూడేళ్ల నుంచి కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ను క్రమంలో ఉంచడానికి మేనేజ్‌మెంట్‌ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ రుణాల విషయంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవడం లేదు.  కష్టతరమైన వాతావరణంలో మంచి వృద్ధి, విలువైన వాల్యుషన్లు కలిగిన స్టాకులను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యం ఇస్తారు. గత రెండెళ్లలో సన్‌ లేదా డా.రెడ్డీస్‌ లేదా లూపిన్‌ వంటి పెద్ద కంపెనీల వృద్ధి రేటు కంటే అరబిందో ప్రదర్శన బాగుంది. అంతేకాకుండా అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనల ప్రభావం మిగిలిన కంపెనీలతో పోల్చుకుంటే  ఈ కంపెనీపై తక్కువగా ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా ఆకర్షించే విషయం అరబిందో షేరు 25-30 శాతం రాయితీలో లభిస్తోంది. ఫార్మా రంగం‍లో దీనిని పరిశీలించవచ్చు.  
మధ్యస్థ, దీర్ఘకాలంలో ప్రదర్శన మారొచ్చు..
ఆటోరంగంపై పెరుగుతున్న వార్తలు ఈ రంగాన్ని నష్టపరుస్తున్నాయి. ఆటో రంగంలో ఈ గందరగోళం కొం‍త కాలం వరకే ఉంటుందని, తిరిగి వృద్ధి  గాడిలో పడుతుందని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ప్రస్తుత పరిస్థితులలో స్థిరత్వం, వాల్యుషన్లు బాగున్నట్టయితే మధ్యస్థ, దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడం మంచిది. అందుకు గాను ఆటోరంగంలో ఎం అండ్‌ ఎం, హీరో మోటర్‌ కార్ప్‌ను పరిశీలించవచ్చు. కానీ తిరిగి ఆటో రంగం వృద్ధి గాడిలో పడేంత వరకు ఈ స్టాకులు బాగా ప్రదర్శించడం కష్టం. ఆర్థిక మందగమనం వలన అశోక్‌ లేలాండ్‌, టాటా మోటర్స్‌, మారుతి వంటి కంపెనీలు సమీప భవిష్యత్తులో బాగా ప్రదర్శన చేయలేవు.  

 You may be interested

యస్‌ బ్యాంకుకు స్మార్ట్‌ ఇన్వెస్టర్లు నో!

Wednesday 17th July 2019

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకుపై స్మార్ట్‌ ఇన్వెస్టర్లకు (విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర) నమ్మకం సన్నగిల్లుతోంది. బ్యాంకు పనితీరు నూతన సీఈవో రవనీత్‌ గిల్‌ సారథ్యంలో కుదుపులకు గురి అవుతుండడంతో వీరు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గడచిన ఏడాది కాలంలో యస్‌ బ్యాంకు షేరు ఇన్వెస్టర్ల పెట్టుబడులను నాలుగింట మూడొంతులు తుడిచిపెట్టేసింది. రూ.404 స్థాయి నుంచి ఈ షేరు రూ.85.70 స్థాయి వరకు పడిపోగా, ప్రస్తుతం రూ.98.45 వద్ద

మూడోరోజూ కొనసాగిన ర్యాలీ

Wednesday 17th July 2019

సెన్సెక్స్‌ లాభం 85 పాయింట్లు 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ  మార్కెట్‌ ర్యాలీ మూడోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 39,216 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,688 వద్ద స్థిరపడ్డాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో పాటు పశ్చిమాసియా రాజకీయ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

Most from this category