News


షార్ట్‌టర్మ్‌లో ర్యాలీ?.. నో ఛాన్స్‌!

Thursday 22nd August 2019
Markets_main1566463380.png-27949

గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ అంచనా
ఎర్నింగ్స్‌ సీజన్‌లో చాలా కంపెనీలు అంచనాలను అందుకోలేని నేపథ్యంలో స్వల్పకాలంలో మార్కెట్లో ర్యాలీని ఆశించవద్దని గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హిమాంశు గుప్తా చెప్పారు. నిఫ్టీ ఇటీవలి కనిష్టాలను కాపాడుకోలేకపోతే క్రమంగా 10100- 10300 పాయింట్ల వరకు పతనం కావచ్చన్నారు. నిఫ్టీకి 10750- 10800 పాయింట్ల వద్ద మంచి మద్దతు ఉందని అంచనా వేశారు. ప్రపంచమార్కెట్లు సహకరించి, ప్రభుత్వం పాజిటివ్‌ ప్రకటన ఏమైనా చేస్తే సూచీలో 11500 పాయింట్ల వరకు రికవరీ ఉండొచ్చని అంతకు మించి ర్యాలీకి ఛాన్స్‌ లేదని తెలిపారు.  గతేడాదిన్నరలో ప్రధాన సూచీల పీఈ పెరుగుతుంటే, మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ తగ్గిందని, దీన్ని బట్టి చిన్న స్టాకులు బాగా క్షీణించాయని, వాటి వాల్యూషన్లు బాగా ఆకర్షణీయంగా మారాయని తెలుస్తోందన్నారు. ప్రస్తుతం మార్కెట్లు మంచి వాల్యూషన్ల వద్దే ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో మూడు నుంచి ఐదేళ్ల టార్గెట్‌తో నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని సూచించారు. అంతేతప్ప మార్కెట్‌కు బాటమ్‌ను వెతుక్కుంటూ కూర్చోవద్దన్నారు. మార్కెట్లలో ప్రస్తుతం వస్తున్న పతనాలు దీర్ఘకాలిక పోర్టుఫోలియో నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు. ఈ సమయంలో వడ్డీరేట్ల ప్రభావిత రంగాలు, ప్రైవేట్‌ బ్యాంకులు, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌ యుటిలిటీస్‌, సిమెంట్‌ రంగాల స్టాకులను ఎంచుకోవచ్చని సూచించారు. 
అంతర్జాతీయం.. ఆందోళనకరం..
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయని, మందగమనం సంకేతాలు కనిపిస్తున్నాయని హిమాంశు చెప్పారు. ట్రేడ్‌వార్‌ పుణ్యమాని ప్రపంచంలోని పెద్ద దేశాల ఎకానమీల్లో మాంద్య సూచనలు మొదలయ్యాయని తెలిపారు. ట్రేడ్‌వార్‌ను ట్రంప్‌ ఆరంభించింది చైనాకు వ్యతిరేకంగానైనా, దాని ప్రభావం అన్ని ఎకానమీలపై ఉంటోందన్నారు. దీంతో పలు కేంద్ర బ్యాంకులు రంగంలోకి వచ్చి వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయని చెప్పారు. ఈ చర్యలు కొంతమేర మాంద్యాన్ని నివారించవచ్చన్నారు. బాండ్‌ ఈల్డ్‌ ఇన్వర్షన్‌ అనంతరం మాంద్యం రావడానికి చాలా సమయం పడుతుందని గతంలో అనుభవమేనని, అందువల్ల వెంటనే ఆర్థిక మందగమనం వస్తుందని భావించడం లేదని తెలిపారు. యూఎస్‌లో రిటైల్‌ అమ్మకాలు బాగున్న సమయంలో మాంద్యం వెంటనే రాకపోవచ్చన్నారు. దీనికితోడు ఆయాదేశాల ప్రభుత్వాల చర్యలతో మాంద్యం మరో ఒకటిరెండేళ్లు ఆలస్యం కావచ్చన్నారు. యూఎస్‌మార్కెట్లు బుల్‌ రన్‌ రెండోదశలో ఉన్నాయని, ఎప్పుడైనా వీటిలో కరెక‌్షన్‌ రావచ్చని తెలిపారు. అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ యూఎస్‌, చైనా మధ్య ఏదైనా ఒప్పందం వచ్చే అవకాశం ఉందని, ఇదే జరిగితే మార్కెట్లో సెంటిమెంట్‌ మారుతుందని ఆయన చెప్పారు. You may be interested

వేదాంత 10 శాతం పతనం ..!

Thursday 22nd August 2019

వరుసగా ఐదోరోజూ కూడా వేదాంత షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ కంపెనీ షేర్లు గురువారం బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో మరో 10శాతం క్రాష్‌ అయ్యాయి. దేశీయంగా ఆర్థికవృద్ధి మందగమనంతో పాటు ట్రేడ్‌వార్‌తో చైనాలో స్టీల్‌ నిల్వలు పెరగడటంతో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు క్షీణిస్తున్నాయి. ఫలితంగా కంపెనీల ఆదాయాలను, నికర లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుండటంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగా వేదాంత షేర్లు సైతం భారీగా

ఎన్‌ఎండీసీ 5శాతం డౌన్‌..!

Thursday 22nd August 2019

ఎన్‌ఎండీసీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.89.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దొనమలై మైనింగ్‌ లీజ్‌ పొడిగింపును రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జాతీయ మైన్స్‌ ట్రిబ్యూనల్‌ స్టే విదించిప్పటి షేర్లు పతనం కొనసాగుతోంది. నేడు మిడ్‌సెషన్‌ సమయానికి ఈ కంపెనీ షేర్లు 5శాతానికి పైగా క్షీణించి రూ.81.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది షేరు

Most from this category