STOCKS

News


వీ షేప్‌ రికవరీకి అవకాశం లేదు..:!

Tuesday 1st October 2019
Markets_main1569953046.png-28662

నిఫ్టీ-50కి సమీప కాలంలో 11,100 - 11,300 బలమైన మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. మార్కెట్లో వీ షేప్‌ రికవరీకి (పడిన విధంగా తిరిగి రికవరీ అవడం) అవకాశం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో దారుణ పరిస్థితులు రెండో త్రైమాసికం లేదా మూడో త్రైమాసికం (డిసెంబర్‌ నాటికి) నాటికి ముగిసిపోవచ్చన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలే మార్కెట్‌ నష్టాలకు కారణమా? అన్న ప్రశ్నకు.. కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు ఊతం లభిస్తుందన్నారు వినోద్‌ నాయర్‌. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వం కోల్పోయే రూ.1.45 లక్షల కోట్లతో ద్రవ్యలోటు 3.3 శాతం లక్ష్యిత స్థాయి నుంచి 4 శాతానికి పెరుగుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఎక్కువ రుణ సమీకరణ చేస్తుందన్న అంచనాతో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ గత రెండున్నర నెలల్లో 50 బేసిస్‌ పాయింట్లు పెరిగినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ విషయమై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోందన్నారు. దాంతో ఈక్విటీపై మార్కెట్లపైనా ప్రభావం ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ నిర్ణయంతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు అదనంగా ఒరిగేదేమీ ఉండదన్నారు వినోద్‌ నాయర్‌. అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్నవి ప్రయోజనం పొందొచ్చన్నారు. లార్జ్‌క్యాప్‌ కంపెనీలే ఎక్కువగా లబ్ధి పొందుతాయని, అవి కొత్త పెట్టుబడి ప్రణాళికలతో రాగలవని, కనుక తక్షణ ప్రయోజనం వాటికే ఎక్కువగా ఉంటుందని వివరించారు. ‘‘దేశీయ, అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి నిదానించడం, లిక్విడిటీ తగ్గిపోవడం, ప్రభుత్వ విధానాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ మిడ్‌క్యాప్‌-100 సూచీ 27 శాతం, ఎన్‌ఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌-100 సూచీ 41 శాతం చొప్పున క్షీణించాయి. మిడ్‌క్యాప్‌ సూచీ ఏడాది కాల ఫార్వార్డ్‌ పీఈ 14.5గా ఉంది. ఇది ఐదేళ్ల సగటు పీఈ 20 కంటే తక్కువగా ఉంది. ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి పీఈ 26. ఉన్నట్టుండి షేర్ల ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల ఈక్విటీ మార్కెట్లు స్వల్ప కాలంలో ప్రతికూలంగా కదలొచ్చు. దీర్ఘకాలానికి మాత్రం సానుకూల ధోరణితోనే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌లో రికవరీ అన్నది వీ షేప్‌లో ఉండకపోవచ్చు’’ అని నాయర్‌ వివరించారు. నిఫ్టీ టార్గెట్‌ 12,500గా పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తగ్గుదల, లిక్విడిటీ మెరుగుదల, పన్ను రాయితీల వంటి పరిస్థితులతో పీవీఆర్‌, మనప్పురం ఫైనాన్స్‌, మోల్డ్‌ టెక్‌ ప్యాకేజింగ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఎక్కువగా ప్రయోజనం పొందుతాయన్నారు. You may be interested

సెప్టెంబర్‌లో స్మాల్‌క్యాప్‌ అదరహో!

Tuesday 1st October 2019

గత నెలలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయనే చెప్పుకోవాలి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా దిద్దుబాటుకు గురై ఉండడంతో వీటిల్లో వ్యాల్యూ బయింగ్‌కు ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషన్స్‌ మొగ్గు చూపడం వాటిల్లో కొంత రికవరీకి తోడ్పడింది. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా వాటి ర్యాలీకి దోహదం చేసింది. అయితే, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, స్టాక్‌ వారీగా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు

మూడో రోజూ నష్టాలే ..11, 400 దిగువకు నిఫ్టీ!

Tuesday 1st October 2019

బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనం 362 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 11400 దిగువన ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సెన్సెక్స్‌ 362 పాయింట్లు పతనమై 38,305 వద్ద, నిఫ్టీ 114.55 పాయింట్లు నష్టపోయి 11,360 వద్ద ముగిశాయి. బలహీన ఆర్థిక గణాంకాలతో పాటు, నేడు పలు కంపెనీలు వెల్లడించిన అటోరంగ షేర్ల విక్రయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడం, పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభ

Most from this category