News


మార్కెట్‌ బాటమ్‌ కోసం ఎదురుచూడకండి

Saturday 14th March 2020
Markets_main1584185054.png-32486

దలాల్‌స్ట్రీట్‌ను బేర్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ వారంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లుతో పాటు మనదేశ మార్కెట్లు  భారీ నష్టాన్ని చవిచూశాయి. మార్కెట్లో ఇది బ్లాక్‌ స్వాన్‌ కేటగిరి విధ్వంసం అని,  ఇలాంటి పతనాలు చాలా అరుదైనవని, మానవజాతి మనుగడకు ప్రమాదమని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ఒక కాలమ్‌లో వ్యక్తంచేసిన అభిప్రాయాలివి....

సూచీలు చాలా అరుదుగా లోయర్‌ సర్కూ‍్యట్‌ పరిమితిని తాకడం, ట్రేడింగ్‌ ఫ్రీజ్‌నును ప్రారంభించడం చాలా అరుదు. సెంటిమెంట్‌ బలహీనపడినపుడు ఇది సంభవిస్తుంది. ఏదిఏమైనప్పటికీ, చరిత్రను ఒకసారి పరిశీలించినట్లైతే...  స్పానిష్ ఫ్లూ, వరల్డ్ వార్స్, 1987 యొక్క గ్రేట్ అక్టోబర్ క్రాష్ సమయంలో మాత్రమే డౌజోన్స్‌  22.32 శాతం పడిపోయింది. మార్కెట్లలో ఈ తీవ్ర ప్రతిచర్యకు కారణం ‘‘ భయం ’’ తప్ప మరొకటి కాదు.
ఈ రకమైన పతనాన్ని మనం కేవలం ఫైనాన్షియల్‌ మార్కెట్లో మాత్రమే చూడవచ్చు. ఎందుకుంటే ఇక్కడ ద్రవ్య రూపంలో మనకు స్పష్టంగా కన్పిస్తుంది. నిజమైన ఆర్థిక వ్యవస్థలో పతనం మనకు కంటికి కనిపించదు. పంటపండిచ్చే రైతుకు ఒక ఏడాది నష్టం వచ్చినంత మాత్రానా తన భూమిని అమ్ముకోడు. అదే విధంగా, ఒక ఏడాది ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోతే ఇన్వెస్టర్లు కూడా తమ ప్రధాన ఈక్విటీ హోల్డింగ్స్‌ను అమ్మకూడదు. ఇన్వెస్ట్‌మెంట్‌లో తెలివైన నియమం: ఇతరులు అమ్ముతున్నప్పుడు కొనడం.
ప్రస్తుత పరిస్థితుల్లో బాటమ్‌లను గుర్తించడం లేదా భయం సారాంశాన్ని గుర్తించడం ఇన్వెస్టర్‌కు చాలా కష్టతరంగా మారింది. కొనుగోలు చేయాలనుకునే వారికి ‘‘లోయర్‌ సర్క్యూట్‌ ’’ చాలా మంచి అవకాశం. మార్కెట్ అంతటా ప్రతికూలత ఉంది. దాదాపు 12ఏళ్ల తరువాత నిఫ్టీ -50 ఇండెక్స్‌ 8,624 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. ఇన్వెస్టర్లు బాటమ్‌ కోసం ఎదురుచూడకుండా కొనుగోలు చేయడం ఉత్తమం. You may be interested

ఈ ఫండ్స్‌లో రాబడుల పరిమళాలు

Sunday 15th March 2020

ప్రతికూల అంశాలతో మార్కెట్లు కుదేలవుతున్నాయి. చాలా రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులను గమనిస్తే గత మూడేళ్ల కాలంలో ఇచ్చిందేమీ లేదు. కానీ, ఐదు మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీలను పరిశీలించినట్టయితే వాటిల్లో రాబడులు ఇన్వెస్టర్లు ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో కొన్ని ఫండ్స్‌ రెండంకెల రాబడులను గడిచిన ఏడాది కాలంలో ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   బంగారం ఫండ్స్‌ విభాగం ఏడాది కాలంలో రాబడుల పరంగా అగ్ర స్థానంలో ఉంది. ఈ విభాగం

1,400 డాలర్లు దిశగా పసిడి!

Saturday 14th March 2020

ఈ వారం మొదట్లో ఏడేళ్ల గరిష్టాని(1,703.90 డాలర్లు)కి చేరిన బంగారం ధర శుక్రవారం ఇంట్రాడేలో 1,504.35 డాలర్లకు పడిపోయింది. వచ్చేవారంలో మొదట్లోనే గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 1,400 డాలర్లకు చేరవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, స్వీడన్‌, నార్వే వంటి దేశాలు  ఫైనాన్సియల్‌ మార్కెట్లను బలపరిచేందుకు ఉద్దీపనలు ప్రకటించాయి. దీంతో వచ్చేవారం బంగారం ధర 1,400 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా

Most from this category