News


భయపడి పారిపోవద్దు.. బలంగా నిలబడాలి

Sunday 15th March 2020
Markets_main1584296819.png-32489

కష్టార్జితాన్ని తీసుకెళ్లి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి.. మార్కెట్లు పడిపోతున్నాయనే భయంతో వచ్చినంత చాల్లేననుకుని అమ్మేసుకుని బయటపడి పోదామనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత చీకటి వచ్చిందని భయపడిపోతే ఏమవుతుంది..? ఓపిక పడితే మళ్లీ సూర్యోదయం అవుతుంది. అలాగే, మార్కెట్‌ పతనాల్లో ధైర్యంగా నిలబడాలి. స్టాక్స్‌ను అమ్ముకోవడం కాకుండా.. పోర్ట్‌ఫోలియో పరంగా ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అందుకు ఇటువంటి సందర్భాలను అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి పతనాలను పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌ కోసం ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్లయ్యే వాటిని గుర్తించి ఇప్పుడు వాటిల్లోకి ప్రవేశించడం ద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు చెత్త స్టాక్స్‌ నుంచి బయటపడి లేదా పనితీరు విషయంలో బోర్లా పడిన ఫండ్స్‌ నుంచి మంచి భవిష్యత్తు ఉన్న వాటిల్లోకి అడుగుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఈ సమయంలో ఈక్విటీల నుంచి సురక్షిత సాధనాలైన బంగారం, బాండ్లు, రియల్‌ ఎస్టేట్‌ వైపు అడుగులు వేయడం సరికాదు. బదులుగా ఈక్విటీలకు కేటాయింపులను ప్రస్తుత సమయంలో 10 శాతం మేర అదనంగా పెంచుకోవాలి.  ‘‘ఈక్విటీల్లో భారీ పతనంతో ఇన్వెస్టర్లు వాటి నుంచి బయటకు వచ్చి సురక్షిత సాధనాలైన బంగారం, డెట్‌ వైపు వెళ్లాలనుకోవడం సహజం. కానీ, బంగారం ధరలు ఇప్పటికే గత మూడు నెలల్లో 19 శాతం పెరిగాయి. అలాగే, గత ఏడాది కాలంలో 38 శాతం పెరిగాయి. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌ 6.1 శాతానికి పడిపోయాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల గిల్ట్‌ ఫండ్స్‌ నుంచి సగటున 14 శాతం రాబడులు పొందారు. కనుక ఈ సాధనాల నుంచి మరింత రాబడులకు అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్‌వైపు దృష్టి సారించాలి. తమ పోర్ట్‌ఫోలియో ప్రక్షాళనకు ప్రస్తుత సందర్భాన్ని వినియోగించుకోవాలి’’ అని ప్రైమ్‌ఇన్వెస్టర్‌ డాట్‌ ఇన్‌ వ్యవస్థాపకురాలు విద్యాబాల సూచించారు. 

 

ఈక్విటీ మార్కెట్లు భిన్న సమూహాలుగా మారిపోవడంతో గడిచిన మూడేళ్ల కాలంలో చాలా ఫండ్స్‌ తమ బెంచ్‌మార్క్‌ సూచీల కంటే రాబడుల విషయంలో వెనకబడ్డాయి. కనుక ఈ ఫండ్స్‌ నుంచి బయటకు వచ్చి మంచి ఫండ్స్‌లోకి ప్రవేశించాలన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా సిప్‌ రూపంలో​ఇన్వెస్ట్‌ చేస్తు‍న్న వారు ఈ సమయంలో తప్పకుండా తమ సిప్‌ను కొనసాగించాలి. అప్పుడు కొనుగోలు ధర యావరేజ్‌ అవుతుంది. పీబీవీ, పీఈ తదితర వ్యాల్యూషన్‌ అంశాల ఆధారంగా స్టాక్స్‌ను కొనుగోలు చేసిన వారు, ఈ సమయంలో ఆయా స్టాక్స్‌కు మరింత పెట్టుబడులు పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను ఈ సమయంలో ఎంచుకోవడం మంచిదని క్రెడో క్యాపిటల్‌ సీఎఫ్‌పీ ఎస్‌ శంకర్‌ సూచించారు. You may be interested

ఒడిదుడుకుల వారం!

Monday 16th March 2020

కోవిడ్–19 వైరస్ పరిణామాలే కీలకం.. భారీ ఆటుపోట్లకు అవకాశం సోమవారం ఫిబ్రవరి డబ్ల్యూపీఐ ద్రవ్యొల్బణం వెల్లడి ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

‘యస్‌’ ఏటీ-1 బాండ్‌హోల్డర్లకు ‘నో’

Sunday 15th March 2020

యస్‌బ్యాంకు అడిషినల్‌ టైర్‌-1 (ఏటీ-1) బాండ్లలో రూ.8,415 కోట్ల పెట్టుబడులు పూర్తిగా రద్దు చేసినట్టేనని బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. ఇది మార్కెట్లకు రుచించని అంశమే. దీంతో ఏటీ-1 బాండ్లకు అమ్మకాల సెగ తప్పదని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.    ఏటీ1 సెక్యూరిటీలు అన్నవి అనిశ్చిత కన్వర్టబుల్‌ బాండ్స్‌. బ్యాంకు సంక్షోభంలో పడితే ఇన్వెస్టర్ల పెట్టుబడులు రిస్క్‌లో పడినట్టే. ‘‘ఇతర బ్యాంకుల నిధుల సమీరణ ప్రయత్నాలపై ఈ ప్రభావం పడుతుంది. ఈ

Most from this category