News


నిఫ్టీ ముందుకా.. మళ్లీ వెనక్కా..?

Sunday 15th September 2019
Markets_main1568570205.png-28381

నిఫ్టీ మరోసారి 11,000 మార్క్‌ పైకి చేరింది. 11,000 మార్క్‌పైన క్లోజవుతున్న సూచీ, ఆ తర్వాత ముందుకు ర్యాలీ చేయలేకపోతోంది. ఇలా మూడు సార్లు జరిగింది. దీంతో ఈ సారి కూడా సూచీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందా..? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, గుడ్డిగా నిఫ్టీ ర్యాలీ వెంట పడొద్దని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయాలు చూద్దాం..

 

‘‘షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టీ 11,000 మార్క్‌పైకి వచ్చి చేరింది. అయితే, పౌదీ అరేబియాలోని సౌదీ ఆరామ్‌కో కేంద్రాలపై దాడుల ప్రభావం చమురు ధరలపై ఉంటుంది. దీనికి సోమవారం మార్కెట్లు స్పందించే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ ఇప్పటికీ కీలకమైన నిరోధ స్థాయిలకు దిగువనే ట్రేడ్‌ అవుతోంది. కనుక గత నిరోధ స్థాయిలు అయిన 11,120-11,200 లోపు అప్‌మూవ్‌లను గుడ్డిగా అనుసరించకూడదు. చమురు ధరలపై ప్రభావాన్ని మార్కెట్లు సర్దుబాటు చేసుకుంటే, మార్కెట్లు గరిష్టాల దిశగా వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అయితే, అధిక స్థాయిల్లో మార్కెట్లు చాలా సున్నితంగా ఉంటాయి. 11,110-11,175 తక్షణ నిరోధ స్థాయిలుగా వ్యవహరిస్తాయి. 11,000-10,950 మద్దతు స్థాయిలు. 

 

రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ డైలీ చార్జ్‌లో 52..0383 వద్ద ఉంది. 14 పీరియడ్‌ గరిష్ట స్థాయి ఇది. ఇది బుల్లిష్‌ సంకేతం. ఆర్‌ఐఎల్‌ కూడా బుల్లిష్‌ డైవర్జెన్స్‌ సూచిస్తోంది. సిగ్నల్‌ లైన్‌ పైనే ట్రేడవుతున్నందున ఎంఏసీడీ బై మోడ్‌లోనే ఉంది. కనుక స్టాక్‌ వారీగా వ్యూహాన్ని అనుసరించడం మంచిది. అలాగే అప్రమత్తంగానూ వ్యవహరించాలి’’ అని మిలాన్‌ వైష్ణవ్‌ సూచించారు.  
 You may be interested

నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలుకు ఇదే సమయం

Sunday 15th September 2019

గత ఏడాదిన్నర కాలంలో దేశ ఈక్విటీలు ఎన్నో ఉత్థాన పతనాలను చూశాయి. దీంతో ఎంతో మంది రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి నష్టాలే కనిపిస్తున్నాయంటే స్టాక్స్‌లో ఎంత దిద్దుబాటు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నెల రోజుల వ్యవధిలో మూడు విడతల్లో ఎన్నో రంగాలకు చర్యలను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లా..!? గోల్డ్‌ ఈటీఎఫ్‌ లా..?

Saturday 14th September 2019

మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు పసిడి పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా భౌతిక పసిడి ప్రత్యామ్నాయంగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఫండ్లలో పెట్టవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులకు కొన్ని ప్రయోజనాలతో పాటు మరికొన్ని పరిమితులున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఇండెక్స్‌ ఫండ్ల కంటే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు ఉత్తమమని  ఫైనాన్షియల్‌ అడ్వైజరీస్‌ ఫౌండర్‌ సురేష్‌ సదాగోపన్‌ అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రసుత్త కాలంలో

Most from this category