News


షేర్లు వద్దు... డబ్బులిచ్చేయండి!

Thursday 12th March 2020
Markets_main1584010621.png-32440

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓలో ధరఖాస్తు చేసుకున్న వారంతా తమకు షేర్లు కేటాయించకుండా ఉంటే బాగుండు దేవుడా అని అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పడిపోతుండడంతో ఇన్వెస్టర్లు ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లు తమకు కేటాయించకుండా తమ డబ్బులను వెనక్కి ఇస్తే చాలు అనుకుంటున్నారు.  మార్కెట్లు పతనమవుతుండడంతో వివిధ కంపెనీల షేర్లు తక్కువ ధరలలో లభ్యమవుతున్నందున ఎస్‌బీఐ కార్డ్స్‌ షేర్లు కాకుండా ఇతర షేర్లుకొనేందుకు ఇన్వెస్టర్లు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా గత వారంలో ఈ ఐపీఓ 26 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయిన  సంగతి తెలిసిందే. ఇటీవల ఈ షేర్లు అనధికార మార్కెట్‌లో 50 శాతం ప్రీమియం ధరలు పలికాయి. అయితే ఈ ప్రీమియం గురువారం నాటికి పూర్తిగా పడిపోయింది. కాగా గురువారం సెన్సెక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద ఇంట్రాడే పతనం నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు బయపడుతున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తిని అమెరికాలో అరికట్టేందుకు అమెరికా యూకే మినహాయించి యూరప్‌ దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులపై నెలరోజుల పాటు నిషేధం విధించింది. దీంతో గురువారం ప్రపంచ మార్కెట్లన్ని కుప్పకూలాయి. దీంతో ఎప్పటి నుంచో తమకిష్టమైన షేర్లను కొనుక్కోవాలని ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు ప్రస్తుతం ఇది మంచి అవకాశమని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.



You may be interested

తాజా షార్ట్స్‌ వద్దు..!

Thursday 12th March 2020

మార్కెట్లు తీవ్ర అమ్మకాల ధోరణిలో ఉన్నాయని, తాజా షార్ట్స్‌కు మాత్రం దూరంగా ఉండాలని జెమ్‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ ఇన్వెస్టర్లకు సూచించారు. నిఫ్టీ గురువారం రూ.868 పాయింట్ల నష్టంతో చరిత్రలో అత్యధిక ఒకే రోజు పతనం నమోదు చేసి రూ.9590 వద్ద క్లోజయింది. దీనిపై వైష్ణవ్‌ విశ్లేషణ ఇలా ఉంది..   హెడ్‌లైన్‌ ఇండెక్స్‌ డైలీ, వీక్లీ చార్ట్‌లపై తీవ్ర అమ్మకాల దశలో ఉంది.

బేర్‌ గుప్పిట్లో బిగ్‌ బుల్‌..!

Thursday 12th March 2020

మార్కెట్లో పతనంలో కొట్టుకుపోయిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్లు దలాల్‌ స్ట్రీట్‌ భారీ పతనం సాదరణ ఇన్వెస్టర్లకే కాదు బడా ఇన్వెస్టర్లకు సైతం పీడ కలలు మిగులుస్తోంది. దేశీయ ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సైతం కోట్లలో నష్టాలను చవిచూశారు. ఝున్‌ఝున్‌వాలాకు పెట్‌ స్టాక్‌గా పిలవబడే టైటాన్‌ షేరు ఏడాది గరిష్టం నుంచి 20శాతం పతనమైంది. ఆయన దగ్గర టైటాన్‌ సంబంధించిన రూ.6500 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్‌

Most from this category