News


లాభాల్లో ముగిసిన సూచీలు!

Friday 11th October 2019
Markets_main1570789721.png-28829

 వాషింగ్టన్‌లో గురువారం నుంచి ప్రారంభమైనా యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగడంతో, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఒక కొలిక్కి వస్తుందని ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉన్నారు. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా ముగిశాయి. గత 15 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక మందగమనం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య చర్చలు బాగానే జరిగాయని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో శుక్రవారం సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభల్లో ట్రేడయ్యాయి. మెటల్‌, రియల్టీ, ఐటీ షేర్ల ర్యాలీ చేయడంతో నిఫ్టీ 50 సూచి 66.70 పాయింట్లు లాభపడి 11,301.25 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 246.68 పాయింట్లు లాభపడి 38,127.08 వద్ద ముగిశాయి. బ్యాంక్‌ షేర్లు దిద్దుబాటుకు గురవ్వడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 29.05 పాయింట్లు లాభపడి 28,042.50 వద్ద ప్లాట్‌గా ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ50 11,192.85 వద్ద, సెన్సెక్స్‌ 37,737.85 వద్ద కనిష్ఠాలను తాకగా, మెటల్‌, రియల్టీ, ఐటీ షేర్లలో కొనుగోలు జరగడంతో తిరిగి పుంజుకోగలిగాయి. 
  నిఫ్టీ50 లో లాభపడిన షేర్లలో సిప్లా (4.71 శాతం), ఇన్ఫోసిస్‌ (4.08 శాతం), వేదాంత (3.93 శాతం), టాటా మోటార్స్‌ (3.72 శాతం), ఓఎన్‌జీసీ (3.15 శాతం) షేర్లు  ముందున్నాయి. అదేవిధంగా ఐఓసీ 3.31 శాతం, యస్‌ బ్యాంక్‌ 2.93 శాతం, గెయిల్‌ 1.77 శాతం, ఎం అండ్‌ ఎం 1.11 శాతం, రిలయన్స్‌ 0.93 శాతం పతనమయ్యి, నష్టపోయిన షేర్లలో ముందున్నాయి. 



You may be interested

సామాన్యుడి సేవింగ్స్‌కు సంరక్షణేది?!

Friday 11th October 2019

ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ సూటి ప్రశ్న బ్యాంకింగ్‌ రంగంలో బయటపడుతున్న వరుస కుంభకోణాలపై ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రుణమాఫీలు, కార్పొరేట్‌ రుణ రైటాఫ్‌లు చేయడం అనైతికమని దుయ్యబట్టారు. సగటు జీవి దాచుకునే అల్పమొత్తాలకు సరైన రక్షణ కల్పించే విత్త వ్యవస్థ లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ఇటీవల బయటపడిన పీఎంసీ కుంభకోణ నేపథ్యంలో సదరు బ్యాంకు ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ పరిమితి విధించిన

ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌ జోరుగా కొన్న షేర్లివే!

Friday 11th October 2019

దేశీయంగా రెండవ అతి పెద్ద ఆస్తి నిర్వహణ సంస్థయిన ఐసీఐసీఐ ప్రూడన్సియల్‌ ఏఎంసీ, సెప్టెంబర్‌ నెలలో ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ, ఫైనాన్సియల్స్‌, ఇన్సురెన్స్‌, పవర్‌, ఫార్మా స్టాకులను భారీగా కొనుగోళ్లు చేసింది. ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) దిగ్గజ కంపెనీ అయిన ఐటీసీ, ప్రభుత్వ రంగ హైడ్రోపవర్‌ ఉత్పత్తి సంస్థయిన ఎన్‌హెచ్‌పీసీ కంపెనీ షేర్లను కోటీ చొప్పున కొనుగోలు చేసింది. కాగా ఈ కంపెనీల షేరు విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి

Most from this category