News


ఇండియా సిమెంట్స్‌లో 12 శాతానికి పెరిగిన దమానీల వాటా

Thursday 27th February 2020
Markets_main1582783075.png-32134

పెరిగిన రాధాకిషన్‌, గోపీకిషన్‌ దమానీ వాటా
 

దక్షిణాది కంపెనీ ఇండియా సిమెం‍ట్స్‌లో తాజాగా డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ కుటుంబ సభ్యులు​వాటాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా ఈ నెల 25, 26లలో రాధాకిషన్‌​దమానీ  కుటుంబ సభ్యులు మొత్తం 2.25 కోట్ల షేర్లను సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరుకి రూ. 104.16 ధరలో కొనుగోలు చేసిన ఈ వాటా ఇండియా సిమెం‍ట్స్‌ ఈక్విటీలో 7.27 శాతానికి సమానం. దీంతో ఇప్పటికే 4.71 శాతం వాటాను కలిగి ఉన్న దమానీ కుటుంబం తద్వారా ఇండియా సిమెంట్స్‌లో 11.98 శాతం వాటాను సొంతం చేసుకోగలిగినట్లు తెలుస్తోంది. 

కొనుగోలు తీరిలా
స్టాక్‌ ఎక్స్ఛేంజీల బల్క్‌ డీల్‌ గణాంకాల ప్రకారం ఎన్‌ఎస్‌ఈలో బుధవారం దమానీ సోదరులు రాధాకిషన్‌, గోపీకిషన్‌ 1.1 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. వీరిరువురితోపాటు.. శ్రీకాంతదేవి దమానీ, డిరైవ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సైతం వాటాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెరసి గత రెండు రోజుల్లో రాధాకిషన్‌ కుటుంబ సభ్యులు 2.25 కోట్లకుపైగా షేర్లను కొనుగోలు చేశారు. ఇది ఇండియా సిమెంట్స్‌లో 7.27 శాతం వాటాకు సమానం. డీమార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ తొలుత 2019 సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్‌లో 1.3 శాతం వాటాను కొనుగోలు చేశారు. తదుపరి డిసెంబర్‌ క్వార్టర్‌లో ఈ వాటాను 4.43 శాతానికి పెంచుకున్నారు. తిరిగి ఈ నెల 25న సోదరుడు గోపీకిషన్‌తో కలసిమరో 2.75 శాతం వాటాను చేజిక్కించుకున్నారు. 

షేరు జూమ్‌
డీమార్ట్‌ అధినేత, ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాధాకిషన్‌ దమానీ.. కుటుంబ సభ్యులతోకలసి తాజాగా ఇండియా సిమెంట్స్‌లో వాటాలను కొనుగోలు చేసినట్లు స్టాక్‌   ఎక్స్ఛేంజీల గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇండియా సిమెం‍ట్స్‌ కౌంటర్‌వైపు దృష్టి సారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి బుధవారం ఎన్‌ఎస్‌ఈలో ఇండియా సిమెంట్స్‌ షేరు 18 శాతంపైగా దూసుకెళ్లి రూ. 104.4 వద్ద ముగిసింది. తిరిగి దమానీ వాటాల కొనుగోలు వార్తలతో తొలుత 8 శాతం జంప్‌చేసి రూ. 112 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. తదుపరి అమ్మకాలు పెరిగి నష్టాల బాట పట్టింది. ఉదయం 11.15 ప్రాంతంలో 4.5 శాతం పతనమై రూ. 100 వద్ద ట్రేడవుతోంది. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ షేరు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. ఇండియా సిమెంట్స్‌లో డీమార్ట్‌ అధినేత వాటా పెంచుకుంటూ రావడంపై మార్కెట్లో ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.



You may be interested

ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను 14 శాతం పెంచిన మోర్గాన్‌

Thursday 27th February 2020

ఎస్‌బీఐ అనుబంధ సంస్థలైన మ్యూచువల్‌ ఫండ్‌, లైఫ్‌ ఇన్సురెన్స్‌, కార్డ్స్‌ బిజినెస్‌ మంచి పనితీరు కనబరుస్తుండడంతో ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ బ్రోకరేజ్‌ సంస్థ 14 శాతం పెంచి రూ.375గా  నిర్ణయించింది. ఆస్తి నాణ్యత, అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రేటింగ్‌ని నిలిపి ఉంచినట్లు తెలిపింది. ఎస్‌బీఐకు చెందిన ఏఎంసీ, కార్డ్స్‌, లైఫ్‌ఇన్సురెన్స్‌లు విలువ పెంచుకుని లాభాన్ని ఆర్జిస్తాయని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకులు సుమీత్‌ కరివాల వెల్లడించారు.  అంతేగాక అనుబంధ సంస్థలన్నీ

11100 పాయింట్ల వరకు నిఫ్టీ పతనం!

Thursday 27th February 2020

గౌతమ్‌ షా అంచనా ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇదే ధోరణి కొనసాగితే నిఫ్టీ 11300 పాయింట్లకు అక్కడ నుంచి 11100 పాయింట్లకు దిగజారవచ్చని మార్కెట్‌ అనలిస్టు గౌతమ్‌ షా చెప్పారు. ప్రస్తుత బలహీనతకు ఆరునెలల కిందటే బీజాలు పడ్డాయన్నారు. ప్రస్తుతం చార్టులు, ఇండికేటర్లు అన్నీ నెగిటివ్‌ సంకేతాలనే ఇస్తున్నాయన్నారు. నిజానికి నిఫ్టీలో బలం లేకున్నా కొన్ని స్టాకుల మద్దతుతో 12400 పాయింట్లను తాకిందన్నారు. గతవారం ఆరంభమైన పతనం

Most from this category