News


ఈ షేర్లపై ఎంఎస్‌సీఐ ప్రభావం

Friday 8th November 2019
Markets_main1573192524.png-29445

మోర్గాన్‌స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) తాజాగా తన సూచీలను సమీక్షించింది. ఇందులో భాగంగా పలు భారతీయ కంపెనీల షేర్లను తన సూచీల్లో కలపడం, తీసివేయడం జరిపింది. ఈ ప్రభావం శుక్రవారం ట్రేడింగ్‌లో ఆయా కంపెనీల షేర్లపై కనిపిస్తోంది. 
- కొత్తగా ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో స్థానం సంపాదించిన డీఎల్‌ఎఫ్‌ షేరు ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 6 శాతం లాభపడింది. 
- అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు దాదాపు 4 శాతం పైన, ఇంద్రప్రస్థగ్యాస్‌ దాదాపు 7 శాతం, ఇన్ఫోఎడ్జ్‌ ఒక్కశాతం లాభంతో ట్రేడవుతున్నాయి.
- మరోవైపు సూచీలో కొత్తగా చేరినప్పటికీ బెర్గర్‌పెయింట్స్‌, ఐసీఐసీఐ ప్రు, ఎస్‌బీఐలైఫ్‌ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
- సూచీల్లోంచి తొలగించిన వాటిలో భెల్‌, గ్లెన్‌మార్క్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టాల్లో, ఐబీ హౌసింగ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- సూచీల్లో వెయిటేజ్‌ పెంపుతో ఐసీఐసీఐ బ్యాంకు షేరు లాభపడి మరో ఆల్‌టైమ్‌ హైని తాకింది.
- వెయిటేజ్‌ తగ్గింపుతో ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు ఒక్క శాతం నష్టపోయింది. 


DLF

You may be interested

మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ ప్రభావం వుండదు..ఆర్థిక శాఖ

Friday 8th November 2019

దేశ ఆర్థిక వృద్ధి గతంలో కంటే బలహీనంగా ఉందని ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌టుక్‌ను, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’ కు తగ్గించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రతిస్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రాధమిక అంశాలు బలంగా ఉన్నాయని, ప్రభుత్వం తాజాగా తీసుకున్న వరుస ఆర్థిక సంస్కరణలు పెట్టుబడులను పెంచుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ: లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 8th November 2019

ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తున్న కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆల్‌టైం స్థాయికి అందుకోవడం, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌

Most from this category