News


డీఎల్‌ఎఫ్‌ 7శాతం డౌన్‌..!

Friday 6th September 2019
Markets_main1567758369.png-28239

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో సంబంధాలున్నాయనే ఆరోపణలను ఖండించినప్పటికీ.., రియల్లీ దిగ్గజం కంపెనీ డీఎల్‌ఎఫ్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.159.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పిల్‌లో ఇండియన్‌బుల్స్‌ గ్రూప్‌తో  డీఎల్‌ఎఫ్‌కు వున్న సంబంధాలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలు గత కొన్ని నెలల క్రితం కూడా వ్యాపించాయి. డీఎల్‌ఎఫ్ గ్రూప్ 2011 నుండి ఇండియాబుల్స్ గ్రూపుతో  ఆర్థిక లావాదేవీలను కలిగి ఉంది అలాంటి లావాదేవీలన్నీ చట్టపరమైనవి. నిబంధనలకు పూర్తిగా లోబడి జరిగినవని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. క్యూఐపీ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ అనంతరం ఇండియాబుల్స్ నుండి తీసుకున్న అన్ని రుణాలను షెడ్యూల్ కంటే ముందే జూన్ 30, 2019 లోపు తిరిగి చెల్లించాము. ఈ విషయాన్ని మా లోన్‌బుక్స్‌లో నమోదు చేశాము. నాటికి నుంచి నేటి వరకు డీఎల్ఎఫ్ గ్రూప్ కంపెనీ ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌, మరే ఇతర ఇండియాబుల్స్ కంపెనీకి ఎలాంటి బాకీలు లేవని డీఎల్‌ఎఫ్‌ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ.., ఈ కంపెనీ షేరు నేడు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 7శాతం క్షీణించి రూ.148.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.159.3)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.151.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.136.70 రూ.214.05లుగా నమోదయ్యాయి. 



You may be interested

మారుతి 4శాతం ర్యాలీ

Friday 6th September 2019

రెండు రోజుల వరుస పతనం అనంతరం మారుతి సుజుకీ ఇండియా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.6000.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టయోటా సుషో ఇండియా కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌పై మాతృ సంస్థ టయోటా సుషో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌లకు ఉమ్మడి నియంత్రణకు యూరోపియన్ కమిషన్ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ సానుకూల వార్తలతో

ఈ షేర్లను అమ్మకోలేక బ్రోకరేజ్‌ల ఇక్కట్లు

Friday 6th September 2019

పూల్‌ అకౌంట్ల నుంచి క్లయింట్ల అకౌంట్లు వేరు చేయాలన్న సెబి నిర్ణయం బ్రోకరేజ్‌లకు కొత్త తలనొప్పులు తెచ్చింది. ఇప్పటికే కొని పెట్టుకున్న ఎక్చేంజ్‌ల్లో కదలికలులేని షేర్లు(ఇల్లిక్విడేట్‌ షేర్లు- గ్రూప్‌ ఏలో లేని చిన్నా చితకా కంపెనీల షేర్లు), ఇటీవల కాలంలో బాగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లను అమ్మాలంటే కొనే నాధుడు లేక పలు బ్రోకరేజ్‌లు ఇక్కట్లు పడుతున్నాయి. ఈ రెండు రకాల షేర్లు ప్రస్తుతం బ్రోకరేజ్‌ల వద్ద దాదాపు రూ.

Most from this category