News


డివిడెండ్‌ ఈల్డ్‌తో మంచి షేర్లు గుర్తించగలమా?

Wednesday 22nd January 2020
Markets_main1579683861.png-31102

ఈక్విటీపై రిటర్న్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. ప్రైస్‌ రిటర్న్‌ మరియు ఆర్జించిన డివిడెండ్‌ రూపాల్లో ఆర్‌ఓఈ ఉంటుంది. షేర్‌హోల్డర్లకు ఇచ్చే నగదు చెల్లింపులను డివిడెండ్స్‌ అంటారు. బలమైన నగదు ప్రవాహం ఉన్న కంపెనీలు క్రమానుగతంగా డివిడెండ్స్‌ను ప్రకటిస్తుంటాయి. వార్షిక డివిడెండ్‌ చెల్లింపులను షేరు ధరతో భాగించి వందతో గుణిస్తే డివిడెండ్‌ ఈల్డ్‌(శాతం) వస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు ధర రూ.100 అనుకుని, దాని డివిడెండ్‌ రూ.3 అనుకుంటే, ఆ కంపెనీ డివిడెండ్‌ ఈల్డ్‌ 3 శాతంగా లెక్కిస్తారు. ఒక షేరు ఆకర్షణీయతను లెక్కించేందుకు ఇన్వెస్టర్లు డివిడెండ్‌ ఈల్డ్‌ను పరిశీలిస్తారు. ఇండెక్స్‌లకు కూడా డివిడెండ్‌ ఈల్డ్‌ ఉంటుంది. జనవరి 20న నిఫ్టీ డివిడెండ్‌ ఈల్డ్‌ 1.25 శాతం ఉంది. సాధారణంగా డివిడెండ్‌ ఈల్డ్‌ బాగున్న కంపెనీల షేర్లు మంచి రాబడులే అందిస్తుంటాయి. 
కరెక్ట్‌ పారామీటరేనా?
క్రమం తప్పకుండా డివిడెండ్స్‌ ఇచ్చే కంపెనీల షేర్లలో పెట్టుబడికి ఈ ఈల్డ్‌ను పరిగణించవచ్చు. ఈల్డ్‌ను లెక్కించేటప్పుడు వన్‌టైమ్‌ డివిడెండ్‌ పేఅవుట్స్‌ను మినహాయించాలి. ఇలాంటి వాటిని స్పెషల్‌ డివిడెండ్స్‌ అంటారు. ఒక్కోమారు షేరు ధర పడిపోతున్న కంపెనీల ఈల్డ్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. షేరు ధర పడిపోయేందుకు సైక్లిక్స్‌, మార్కెట్‌ పరిస్థితులు, పరిశ్రమలో ప్రతికూలతలు, ఆర్థిక ఇబ్బందులు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలు.. ఇలా అనేక కారణాలుంటాయి. అందువల్ల ఈల్డ్‌ ఆరోగ్యకరంగా ఉన్నా, సదరు షేర్లలో పెట్టుబడులు క్షీణించడం గమనించవచ్చు. అందువల్ల కేవలం డివిడెండ్‌ ఈల్డ్‌ను ఆధారంగా చేసుకొని షేర్లను ఎంపిక చేసుకోవద్దని నిపుణులు చెబుతుంటారు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ డివిడెండ్‌ ఈల్డ్స్‌ ఆధారంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గత పదేళ్లలో ఇవి దాదాపు 9.8 శాతం వార్షిక రాబడులు ఇచ్చాయి. రిటైలర్లు నేరుగా డివిడెండ్‌ ఈల్డ్‌ ఆధారంగా పెట్టుబడుల ఎంపిక చేసుకునే బదులు ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ నేరుగా ఈల్డ్‌ ఆధారంగా పెట్టుబడులు పెట్టదలిస్తే, దీనితో పాటు ఇతర పారామీటర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణుల సూచన. You may be interested

మయూర్‌, హాట్సన్‌ అప్‌- హావెల్స్‌, తేజాస్‌ డౌన్‌

Wednesday 22nd January 2020

బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారం‍భమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మధ్యాహ్నం 2.45కల్లా సెన్సెక్స్‌ 228 పాయింట్లు పతనమై 41,096కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 12,201 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా మయూర్‌ యూనికోటర్స్‌, హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తుంటే.. మరోపక్క హావెల్స్‌ ఇండియా, తేజాస్‌ నెట్‌వర్క్స్‌

బడ్జెట్‌ రోజున బీఎస్‌ఈ ఓపెన్‌

Wednesday 22nd January 2020

ఈసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం కావడంతో ఈ రోజు స్టాక్‌ ఎ‍క్చ్సేంజీలు పనిచేస్తాయా... లేదా..?! అనే అనుమానాలకు బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ తెరదించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టేరోజు శనివారం అయినప్పటికీ స్టాక్‌ ఎక్చ్సేంజీ పని చేస్తుందని బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ జారీచేసింది. ‘‘కేంద్రం ప్రభుత్వం ఫిబ్రవరి 1 శనివారం నాడు 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారం

Most from this category