STOCKS

News


బడా ఎంఎన్‌సీల డివిడెండ్ల జాతర!

Friday 7th February 2020
Markets_main1581050573.png-31588

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఎంఎన్‌సీల్లో డివిడెండ్ల చెల్లింపుపరంగా టాప్‌ 25లో నిలిచే ఎంఎన్‌సీలకు తాజాగా బడ్జెట్లో డీడీటీ ఎత్తివేయడంతో సుమారు రూ. 2800 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, నెస్లె, కాల్‌గేట్‌ పామోలివ్‌ తదితర బడా ఎంఎన్‌సీలకు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ టాక్స్‌ మినహాయింపుతో భారీ ప్రయోజనం చేకూరుతుందని, ఇలా మొత్తాన్ని వాటాదారులకు డివిడెండ్ల రూపంలో చెల్లించడం లేదా తమ విదేశీ మాతృసంస్థలకు బదిలీ చేయడం జరగవచ్చని నిపుణుల అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ టాప్‌25 కంపెనీలు డివిడెండ్ల రూపంలో దాదాపు రూ. 17765 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఈ మొత్తంపై డీడీటీ కింద సుమారు రూ. 3008 కోట్లు ప్రభుత్వానికి కట్టాయి. దీంతో పన్ను కట్టిన తర్వాత చెల్లించిన డివిడెండ్‌ మొత్తం రూ. 14756.6 కోట్లయింది. ఇందులో విదేశీ ప్రమోటర్లు రూ. 9154.8 కోట్లు పొందారు. ఆయా కంపెనీల్లో వీరి వాటాలు 51- 75 శాతం వరకు ఉన్నాయి. ఈ వాటా ఆధారంగా ఈ విదేశీ ప్రమోటర్లు డివిడెండ్లు పొందారు. ఇకపై వీరికి మరింత ప్రయోజనం చేకూరుతుందని కేపీఎంజీ ప్రతినిధి సునీల్‌ బదలా చెప్పారు. ఇక్కడ పొందే ప్రయోజనంతో పాటు సొంత దేశాల్లో టాక్స్‌క్లెయిమ్‌ క్రెడిట్‌ ప్రయోజనం కూడా వీరు పొందుతారన్నారు. ఎంఎన్‌సీల్లో కన్జూమర్‌ రంగ కంపెనీలకు మొదటి నుంచి డివిడెండ్ల లాభం ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు హెచ్‌యూఎల్‌ రూ. 5719 కోట్ల భారీ డివిడెండ్‌ ఇచ్చింది. తర్వాత స్థానంలో మారుతీ సుజుకీ(రూ. 2913.4 కోట్లు), నెస్లె ఇండియా(రూ. 1313.4 కోట్లు) ఉన్నాయి.

విదేశీ వాటా ప్రముఖంగా ఉన్న దేశీయ కంపెనీలు డీడీటీ ఎత్తివేయడంతో భారీ లాభం పొందుతాయని న్యాయనిపుణుడు వినోద్‌ కొఠారి చెప్పారు. ప్రస్తుతం దేశాల వారీగా చూస్తే యూఎస్‌ బేస్‌గా 7 ఎంఎన్‌సీలు, యూకే బేస్‌గా 6 ఎంఎన్‌సీలు ఉన్నాయి. యూఎస్‌కు చెందిన ఎంఎన్‌సీలు రూ. 2337 కోట్లు, యూకేకు చెందిన ఎంఎన్‌సీలు రూ. 8605 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించాయి.



You may be interested

ఎల్‌టీఆర్‌ఓతో ఏంటి ప్రయోజనం??

Friday 7th February 2020

ద్రవ్యపరపతి విధానాలు మరింత మెరుగ్గా దిగువ రంగాలకు బదిలీ అయ్యేందుకు ఆర్‌బీఐ గురువారం ఎల్‌టీఆర్‌ఓ(లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్‌)ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌టీఆర్‌ఓఎలా ప్రభావం చూపుతుంది? చూద్దాం... = ఆర్‌బీఐ ఒకేడాది, మూడేళ్ల కాలపరిమితితో రూ. లక్ష కోట్ల వరకు ఉండే టర్మ్‌ రెపోలను పాలసీ రెపో రేట్‌ వద్ద నిర్వహిస్తామని ప్రకటించింది. దీన్నే ఎల్‌టీఆర్‌ఓ అంటారు. = బ్యాంకులకు సరైన లిక్విడిటీ, సరైన రేట్ల వద్ద అందించేందుకు, బ్యాంకులు వడ్డీరేట్ల

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Friday 7th February 2020

 శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ. రూ.100పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.40,426.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 4డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,570 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category