News


డిష్‌మ్యాన్‌ పతనం- స్టెర్లింగ్‌ టూల్స్‌ జూమ్‌

Tuesday 24th December 2019
Markets_main1577180470.png-30410

కుప్పకూలిన డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌
స్టెర్లింగ్‌ టూల్స్‌ లాభాల హైజంప్‌

ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో ఫార్మా కంపెనీ డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ కౌంటర్లో వరుసగా మూడో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు చైనీస్‌ కంపెనీతో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలతో ఆటో విడిభాగాల కంపెనీ స్టెర్లింగ్‌ టూల్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం.. 

డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌
కంపెనీ కార్యాలయాలలో ఈ నెల 19న ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టినట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో మరోసారి డిష్‌మ్యాన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం సెషన్‌లో ఈ షేరు 20 శాతం కుప్పకూలింది. అమ్మేవాళ్లు అధికంకావడంతో లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 కోల్పోయి రూ. 72.1 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో 38 శాతం కోల్పోయింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరిగింది. 50 లక్షలకుపైగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.

స్టెర్లింగ్‌ టూల్స్‌
జేవీ ఏర్పాటుకు వీలుగా చైనా సంస్థ జియాంగ్సు టేక్‌ ఎలక్ట్రిక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో దేశీ ఆటోవిడిభాగాల కంపెనీ స్టెర్లింగ్‌ టూల్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో స్టెర్లింగ్‌ టూల్స్‌ షేరు చివరి సెషన్‌కల్లా రూ. 36 జంప్‌చేసి రూ. 215 వద్ద లాకయ్యింది. చైనా కంపెనీతో జేవీ ద్వారా దేశీ ఎలక్ట్రిక్‌ వాహనాలకు అత్యుత్తమ మోటార్‌ కంట్రోల్‌ యూనిట్లను(ఎంసీయూలు) సరఫరా చేయనున్నట్లు స్టెర్లింగ్‌ టూల్స్‌ తెలియజేసింది.



You may be interested

మహారాష్ట్ర రుణమాఫీతో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు దెబ్బ: కోటక్‌

Tuesday 24th December 2019

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రైతుల రుణమాఫీ పథకంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు దెబ్బపడుతుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు ప్రకటనతో మంగళవారం ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి వరకు రూ.2 లక్షల కలిగిన రైతు రుణాల్ని మాఫీ చేస్తున్నట్లు శనివారం ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం రుణాలు మాఫీ

త్వరలో పెట్రో, డీజిల్‌ బాదుడు..!?

Tuesday 24th December 2019

వాహన వినియోగదారులపై త్వరలో పెట్రో, డీజిల్‌ ధరల భారం పిడుగుపడుతుందా.!? అవుననే అంటున్నాను వార్తాసంస్థల కథనాలు. బీఎస్‌-VI నిబంధనలకు అనుగుణమైన ఇంధనం ఉత్పత్తికి అయ్యే వ్యయాలను భరించేందుకు ఆయిల్‌ కంపెనీలకు ఐదేళ్ల కాలానికి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నది.  ఒ‍కవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే.., లీటరు పెట్రోల్‌ ధర రూ.0.80పైసలు, లీటరు డీజిల్‌పై రూ.1.50పైసల భారాన్ని వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ

Most from this category