News


నిలిచిన ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, డిష్‌టీవీ విలీనం!

Tuesday 21st January 2020
Markets_main1579628700.png-31079

డిష్‌టీవీని విలీనం చేసుకోవడం ద్వారా దేశంలో అగ్రగామి డీటూహెచ్‌ కంపెనీగా అవతరించాలన్న ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ ప్రయత్నాలకు తాత్కాలిక విఘాతం ఏర్పడింది. డీల్‌ విషయమై ఈ రెండు సంస్థల మధ్య అంగీకారం కుదరకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్‌ సేవల మార్కెట్లో రిలయన్స్‌ జియో విప్లవం సృష్టించిన విషయం తెలిసిందే. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్లోనూ దూసుకుపోయేందుకు ఈ సంస్థ పెద్ద ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ కేబుల్‌ టీవీ ఆపరేటర్లు అయిన డెన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌ను గతేడాది కొనుగోలు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ డీటూహెచ్‌ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. జియోను దీటుగా ఎదుర్కొనేందుకు డిష్‌టీవీతో విలీన ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది. అంతకుముందే వీడియోకాన్‌ డీటూహెచ్‌ను కొనుగోలు చేసిన డిష్‌ టీవీ ఈ విభాగంలో అత్యధిక చందాదారులను కలిగి ఉంది. దీంతో డిష్‌ టీవీని విలీనం చేసుకుంటే మరింత బలపడొచ్చని, అత్యధిక చందాదారులతో అగ్రగామి సంస్థగా అవతరించడం ద్వారా జియోను గట్టిగా ఎదుర్కోవచ్చని ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ భావించింది. ఇందుకు అనుగుణంగానే గతేడాది డిష్‌టీవీతో చర్చలు మొదలు పెట్టింది. ఇప్పటికి పలు విడతలుగా చర్చలు కూడా జరిగాయి. డీల్‌ కుదరడమే మిగిలింది.

 

ఎస్సెల్‌గ్రూపులో భాగమైన డిష్‌టీవీ తన వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌ డిజిటల్‌కు పూర్తిగా విక్రయించడం ద్వారా నగదు పొందాలని భావిస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా కథనం వెలుగు చూసింది. కానీ, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీలో వాటాల కేటాయింపు డీల్‌కే సుముఖంగా ఉందని సమాచారం. ఇదే ఇరు వర్గాల మధ్య డీల్‌కు ఆటంకంగా మారినట్టు తెలుస్తోంది. సుభాష్‌ చంద్ర, ఆయనకు చెందిన ఎస్సెల్‌ గ్రూపు భారీ రుణ భారం తగ్గించుకునేందుకు వరుస వెంట వ్యాపార ఆస్తులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఎస్సెల్‌ గ్రూపులో ముఖ్యమైన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోనూ సుభాష్‌ చంద్ర తన వాటాలో అధిక భాగం 16 శాతాన్ని గతేడాది విక్రయించేశారు. పలు రోడ్డు ప్రాజెక్టులను విక్రయించేందుకు కూడా చర్చలు కొనసాగుతున్నాయి. తద్వారా పూర్తిగా రుణ భారం నుంచి బయటపడే ఆలోచనతో ఎస్సెల్‌గ్రూపు ఉంది. ఈ నేపథ్యంలో డిష్‌ టీవీని పూర్తిగా నగదు రూపంలో విక్రయించడం వల్ల నిధులు సమకూర్చుకోవచ్చన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, డిష్‌టీవీ, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ విలీనం విషయమై ఇరు వర్గాలు ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని, చర్చలు తిరిగి పునరుద్ధరించాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. You may be interested

బడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లు చూద్దామా..?

Tuesday 21st January 2020

రాకేశ్‌ జున్‌జున్‌వాలా, డాలీఖన్నా, రాధాకిషన్‌ దమానీ, ఆశిష్‌ కచోలియా, అనిల్‌ కుమార్‌ గోయల్‌ వీరంతా విజయవంతమైన బడా స్టాక్‌ ఇన్వెస్టర్లు. వందలు, వేల కోట్ల రూపాయల సంపదను వీరు స్టాక్‌ మార్కెట్లో సృష్టించుకున్న విజేతలు. వీరు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియో పరంగా మార్పులు, చేర్పులు చేస్తుంటారు. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లు వీరిని గుడ్డిగా అనుసరించడం సరికాదు. అలా అని అస్సలు పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీరంతా తాము

జొమాటో సొంతమైన ఉబెర్‌ ఈట్స్‌

Tuesday 21st January 2020

జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌! గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. ఉబెర్‌ ఈట్స్‌ను సొంతం చేసుకుంది. ఉబెర్‌ టెక్నాలజీస్‌కు చెందిన ఇండియన్‌ ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ను ఉబర్‌... జొమాటోకు  విక్రయించింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటో కంపెనీ10 శాతం వాటాను ఉబర్‌కి ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ 350 మిలియన్‌ డాలర్లు(రూ.దాదాపు 2,485 కోట్లు)గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉబెర్‌ ఈట్స్‌ తన

Most from this category