News


లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల వాటా 13.7 శాతం

Tuesday 30th July 2019
Markets_main1564426175.png-27389

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), మన దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) మధ్య పెట్టుబడుల పరంగా అంతరం తగ్గిపోతోంది. ఎఫ్‌పీఐలు క్రమంగా అమ్మకాలు సాగిస్తుంటే, అదే సమయంలో డీఐఐలు కొనుగోళ్లు జరుపుతున్న విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో డీఐఐల పెట్టుబడుల విలువ జూన్‌ 30 నాటికి రూ.20.42 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 0.89 శాతం అధికం. ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ జూన్‌ చివరికి రూ.29.36 లక్షల కోట్లుగా ఉంది. ఎఫ్‌పీఐల వాటాల పరంగా ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి విలువ. డీఐఐ అంటే... మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, పెన్షన్‌ ఫండ్స్‌. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో మన డీఐఐల వాటా మార్చి నాటికి 13.69 శాతం కాగా, జూన్‌ చివరికి 13.78 శాతానికి చేరుకుంది. 

 

ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో మ్యూచువల్‌ పండ్స్‌ సంస్థల మొత్తం పెట్టుబడులు మార్చి చివరికి ఉన్న 7.19 శాతం నుంచి జూన్‌ చివరికి 7.73 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే మ్యూచువల్‌ పండ్స్‌ సంస్థల పెట్టుబడుల విలువ జూన్‌ చివరికి రూ.10.89 లక్షల కోట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరిందని, మార్చి 31 నుంచి చూస్తే 2.40 శాతం అధికమని ఎన్‌ఎస్‌ఈ డేటా అండ్‌ అనలటిక్స్‌ సీఈవో ముకేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక బీమా సంస్థల పెట్టుబడుల పూర్తి విలువ మార్చి త్రైమాసికం నుంచి చూస్తే 0.53 శాతం తగ్గి జూన్‌ చివరికి రూ.7.81 లక్షల కోట్లుగా ఉంది. ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.6.11 లక్షల కోట్లుగా ఉంది. అంతక్రితం ‍త్రైమాసికంతో పోలిస్తే 1.79 శాతం తక్కువ. బీమా కంపెనీల ఈక్విటీల పెట్టుబడుల్లో ఎల్‌ఐసీదే ఆధిపత్యంగా ఉంది. మొత్తం బీమా కంపెనీల ఈక్విటీ పెట్టుబడుల్లో ఎల్‌ఐసీ వాటాయే 78 శాతం కావడం గమనార్హం. 

 

ఇటీవలి కాలంలో ఈ అంతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య పెట్టుబడుల విలువ  పరంగా ఎక్కువ వ్యత్యాసం 2015 మార్చి త్రైమాసికంలో ఉంది. అప్పుడు డీఐఐల హోల్డింగ్స్‌ ఎఫ్‌పీఐల హోల్డింగ్స్‌ కంటే 50 శాతం తక్కువ. పదేళ్ల కాలంలో చూసుకుంటే (2009 జూన్‌ నుంచి) ఎఫ్‌పీఐల వాటా 13.60 శాతం నుంచి 19.80 శాతానికి చేరింది. డీఐఐల వాటా 11.66 శాతం నుంచి 13.78 శాతానికి చేరుకుంది’’ అని ప్రైమ్‌ డేటా బేస్‌ ఎండీ ప్రణవ్‌ హాల్దియా తెలిపారు. ఇక ప్రమోటర్ల వాటా 2009 జూన్‌ నాటికి 61.34 శాతం సగటున ఉంటే, అది క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది జూన్‌ నాటికి 54.46 శాతానికి దిగొచ్చింది. ప్రజల కనీస వాటా 25 శాతంగా ఉండాలన్న నిబంధనల ప్రభావం కూడా దీనిపై ఉంది.



You may be interested

ప్రమోటర్లు ‘చాన్స్‌’ తీసుకున్నారు...!

Tuesday 30th July 2019

స్టాక్‌ మార్కెట్లో జూన్‌ త్రైమాసికం ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు పొడించిందనే చెప్పుకోవాలి. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈ500 కంపెనీల్లో (పీఎస్‌యూ బ్యాంకులు మినహా) 43 కంపెనీల ప్రమోటర్లు మాత్రం అవకాశం తీసుకుని, పడిపోయిన తమ కంపెనీల షేర్లలో వాటాలు కొనుగోలు చేసినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రమోటర్లు వాటా పెంచుకోవడం అన్నది కొంత సౌకర్యవంతమైన విషయమేనని మార్కెట్‌ పరిశీలకులు భావిస్తుంటారు. అయితే, స్టాక్స్‌ కొనుగోలు విషయంలో దీన్ని కేవలం ఒక

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ ఫలితాలు: 45 శాతం పెరిగిన లాభం

Monday 29th July 2019

డా.రెడ్డీస్‌ లాబొరేటరీస్ సోమవారం ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాలలో ఏకీకృత లాభం (పన్నుల తర్వాత లాభం) 45 శాతం పెరిగి ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన రూ.662.80 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .456.10 కోట్ల ఏకీకృత లాభాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విశ్లేషకులు ఈ లాభం రూ.481 కోట్లుగా అంచనా వేయగా ఫలితాలు అంచనాలను మించి రావడం గమనర్హం. ఈ త్రైమాసికంలో

Most from this category