News


దీన్ని బోటమ్‌ అని చెప్పడం కష్టం: క్యాపిటల్‌ ఎయిమ్‌

Sunday 11th August 2019
Markets_main1565548033.png-27694

మార్కెట్‌లో ఇది కనిష్టం, ఇది గరిష్టం అని చెప్పడం కష్టమని, ఇన్వెస్టర్లు ఈ దశలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ విభాగంలో పెట్టుబడుల పరంగా దూకుడుగా వ్యవహరించకుండా ఉండాలని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారి సూచించారు. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను దీర్ఘకాలానికి ఎంచుకోవాలని సూచించారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. 

 

‘‘ఇటీవలి 11,000లోపు కనిష్టాల నుంచి నిఫ్టీ-50 తిరిగి వెనక్కి పుంజుకోవడం చూశాం. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సర్‌చార్జీ నుంచి ఉపశమనం, ఆటోమొబైల్‌ రంగానికి ఉపశమనం కల్పించే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్న వార్తలు ఇందుకు తోడ్పడ్డాయి. ఆర్‌బీఐ రేట్ల కోత, వర్షాలు పుంజుకోవడం కూడా ఇందుకు సానుకూలించాయి. ఈ వారంలో నిఫ్టీకి 200 ఈఎంఏ అయిన 11,250 వద్ద నిరోధం ఉంది. ఇది దాటితేనే ఎగువ వైపు మూమెంటమ్‌ కొనసాగుతుంది. దిగువ వైపు 10,855 కీలకం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎటువంటి పరిణామాలు లేకపోతే, ఈ వారంలో నిఫ్టీకి 10,850-11,200 ట్రేగింగ్‌ శ్రేణి పరిధిలో స్థిరీకరణ కొనసాగొచ్చు. ఆటో, రిలయ్‌ ఎస్టేట్‌, ఎన్‌బీఎఫ్‌సీ మంచి పనితీరు చూపించొచ్చు’’ అని రొమేష్‌ తివారీ తెలిపారు.   

 

నిఫ్టీ ఇటీవలి కనిష్టాల నుంచి రికవరీ అయినప్పటికీ, వచ్చే కొన్ని సెషన్ల అనంతరం ఇది నిలదొక్కుకుంటుందా అన్నది సందేహమేనన్నారు రొమేష్‌ తివారి. ప్రభుత్వరంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌, ఆటో రంగానికి ఉద్దీపనలు అన్నవి ఆయా రంగాల స్టాక్స్‌కు పరిమిత కాలం పాటు సానుకూలమన్నారు. అంతేకానీ, మార్కెట్‌ మొత్తాన్ని నిర్ణయాత్మకంగా ఈ చర్యలు మార్చలేవని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆర్థిక రంగంలో డిమాండ్‌ తిరిగి పుంజుకోవడంపైనే మార్కెట్లలో అప్‌మూవ్‌ కొనసాగడం ఆధారపడి ఉందన్నారు. మార్కెట్లకు ఇది కనిష్ట స్థాయి అని నిర్ణయించడం అప్పడే తొందరపాటు అవుతుందని, ఎందుకంటే నాణ్యమైన స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఇప్పటికీ అధిక స్థాయిల్లోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. గరిష్టం, కనిష్టం అని నిర్ణయించడం కష్టమని, దీనికి బదులు తాను అయితే మూలాలు బలంగా ఉన్న రంగాల్లోని నాణ్యమైన స్టాక్స్‌ను కొద్ది కొద్దిగా కొనుగోలు చేస్తూ వెళతానని పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయిలో ఆటో, ఫార్మా రంగాలు దీర్ఘకాలానికి ఆకర్షణీయంగా ఉన్నట్టు తెలిపారు. పడిన స్టాక్స్‌ను కొద్ది మొత్తంలో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. 



You may be interested

మందగమనంలోనూ జోరు మీదున్న వైట్‌గూడ్స్‌

Monday 12th August 2019

మందగమనం... నేడు కార్పొరేట్‌ సమూహంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇటువంటి పరిస్థితుల్లోనూ వైట్‌ గూడ్స్‌ (కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌) పరిశ్రమ జూన్‌ త్రైమాసికంలో ఏకంగా 30 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఆటోమొబైల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు వృద్ధి మందగమనం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కానీ, అటువంటి పరిస్థితులేమీ వైట్‌ గూడ్స్‌ పరిశ్రమలో కనిపించకపోవడం సానుకూలం.    బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ను పరిశీలిస్తే... కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ విభాగం వార్షికంగా అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 31.7

9 నెలల్లో రుణ రహితంగా ఇమామీ!

Sunday 11th August 2019

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ ఇమామీ వచ్చే 9 నెలల్లో రుణ భారాన్ని పూర్తిగా తొలగించుకోనుంది. ప్రస్తుతానికి కంపెనీ రుణ భారం రూ.2,600 కోట్లుగా ఉంది. గ్రూపు కంపెనీల రుణాలను తిరిగి చెల్లించేందుకు తగిన మార్గాలు ఉన్నాయని ఇమామీ డైరెక్టర్‌ ప్రశాంత్‌ గోయంకా తెలిపారు. పర్సనల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులు, పేపర్‌, హాస్పిటల్స్‌, వంట నూనెలు, బయో డీజిల్‌, సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, రిటైల్‌ చైన్లు, విద్యుత్‌

Most from this category