News


ఆల్‌టైం హై వద్ద ఎంటర్‌ కావడం తప్పా?

Wednesday 13th November 2019
news_main1573623022.png-29552

ఇన్వెస్టర్లలో భయాలు... నిపుణుల సమాధానాలు, సూచనలు...
దేశీయ మార్కెట్‌, ఎకానమీ రెండూ భిన్న ప్రదర్శన చూపుతున్నాయి. ఒకపక్క మార్కెట్స్‌ ఆల్‌టైమ్‌ హైల వద్ద కదలాడుతుంటే, మరోపక్క ఎకానమీలో పరిస్థితి మందగమనం దిశగా కదులుతోందని గణాంకాలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ గరిష్ఠాల వద్ద ఉన్నప్పుడు ఎంటరైన ఇన్వెస్టర్లలో అనవసరంగా ఎంటరయ్యామన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయమై నిపుణుల సమాధానాలు, సూచనలు ఇలా ఉన్నాయి..
= ఎకానమీ ఎలా ఉన్నా, ఆల్‌టైమ్‌ హైల వద్ద ఎంటర్‌కావడం అంతమంచిది కాదని ఎక్కువమంది నిపుణుల అభిప్రాయం. ఈ స్థాయిల వద్ద కొనుగోళ్ల కన్నా కొంత పతనం కోసం వేచిచూసి ఎంటర్‌ కావడం మంచిదని వీరి సూచన. ఎందుకంటే ఇప్పటికీ పలు నాణ్యమైన స్టాకులు అల్పవాల్యూషన్ల వద్దనే ఉన్నందున మార్కెట్‌ కొంత వెనకడుగు వేసినా మిడ్‌టర్మ్‌లో ర్యాలీ కొనసాగుతుందని, అందువల్ల బలహీనత కనిపించినప్పుడు కొనుగోలు చేయాలని నిపుణుల సలహా.
= ఎకానమీ పునరుజ్జీవానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, ఇవి ఫలితాలిచ్చేందుకు కాస్త సమయం పడుతుందని బే క్యాపిటల్‌ సీఐఓ సిద్ధార్ధ చెప్పారు. ఇలాంటి మందగమన సమయాల్లో ఏఏ వ్యాపారాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉండబోతున్నాయో విశ్లేషించేందుకు మంచి ఆవకాశం వస్తుందన్నారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి చర్యలు చేపట్టే కంపెనీలు రికవరీలో బాగా రాణిస్తాయన్నారు. ‘‘ ప్రస్తుత మందగమనం కేవలం భారతకే పరిమితం కాదు. అందువల్ల ఇన్వెస్టర్లు కాస్త ఓపిక వహించాలి. నాణ్యమైన అల్ప వాల్యూషన్లున్న స్టాకులను 5ఏళ్ల కాలపరిమితితో ఎంచుకోవాలి.’’ అని చెప్పారు.
= మందగమన నిరోధానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో ముందుకు వస్తే మార్కెట్‌ ర్యాలీ ఊహించతరం కాదని కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి శ్రీకాంత్‌ చెప్పారు. ఇన్వెస్టర్లు ఎప్పుడైనా పెట్టుబడులు ఆరంభించవచ్చని, పెట్టుబడికి ఏది సరైన సమయం? ఏది కాదు? అనేది ఎవరూ చెప్పలేరని అన్నారు. లాభార్జనకు సింపుల్‌గా బలమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడమే మార్గమని, ఈ ఒక్క విషయం దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు ఆరంభించాలని సూచించారు. రిస్కు తీసుకోవాలనుకునే వాళ్లు నాణ్యమైన చిన్న స్టాకులను ఎంచుకోవచ్చన్నారు.
= స్వల్పకాలానికి మార్కెట్లు వెనుకంజ వేసినా మిడ్‌ టు లాంగ్‌ టర్మ్‌కు సూచీల్లో ర్యాలీనే కొనసాగుతుందని జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. విత్తలోటు భయాలు, బ్లూచిప్‌ వాల్యూషన్లు, మందగమనం తదితరాలతో కొంత ఆటుపోట్లుంటాయన్నారు. ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పరిశీలించవచ్చన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టినవాళ్లు చిన్నపాటి వెనకడుగులు పట్టించుకోకుండా దీర్ఘకాలానికి వేచిచూడాలని చెప్పారు.
= మార్కెట్లో ప్రతి పతనం కొనుగోలుకు అవకాశమేనని బొనాంజా పోర్టుఫోలియో ప్రతినిధి విశాల్‌ చెప్పారు. మార్కెట్లలో తగు విరామాలప్పుడు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయడం, దీర్ఘకాలానికి వేచిచూడడం, క్రమానుగత పెట్టుబడులు పెట్టడం, కచ్ఛితమైన స్టాప్‌లాస్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం మరిచిపోకూడదని సలహా ఇచ్చారు. 

మొత్తం మీద సూచీల్లో ఎప్పుడు పెట్టుబడులు పెట్టామన్నది ముఖ్యం కాదని, వేటిలో పెట్టాము? ఎంత కాలానికి వేచిచూడగలము? అన్నదే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వల్పకాలానికి మార్కెట్లు వెనకడుగు వేసినా లాంగ్‌టర్మ్‌ పాజిటివ్‌గా ఉంటుందంటున్నారు. You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌: బ్రిటానియా 5% అప్‌

Wednesday 13th November 2019

బ్రిటానియా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో బుధవారం సెషన్లో ఈ కంపెనీ షేరు ర్యాలీ చేస్తోంది. ఉదయం 10.55 సమయానికి బ్రిటానియా  5.21 శాతం లాభపడి రూ. 3,282.20 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 లో ఈ షేరు టాప్‌ గెయినర్‌గా ఉండడం గమనార్హం.  గత సెషన్‌లో రూ. 3,119.55 వద్ద ముగిసిన ఈ షేరు, ఫలితాల ప్రభావంతో బుధవారం సెషన్‌లో రూ. 3,271.00 వద్ద పాజిటివ్‌గా

మరొక విజిల్‌బ్లోయర్‌తో ఇన్ఫీ 1% డౌన్‌

Wednesday 13th November 2019

ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్‌కు వ్యతిరేకంగా మరొక విజిల్‌ బ్లోయర్‌ కంపెనీ చైర్మన్‌కు, స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాయడంతో బుధవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ షేరు విలువ 1 శాతం మేర నష్టపోయి ప్రారంభమైంది. ఉదయం 9.52 సమయానికి ఇన్ఫోసిస్‌ షేరు 1.24 శాతం నష్టపోయి రూ. 695.65 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 704.40 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం సెషన్లో రూ. 696.50 వద్ద

Most from this category