News


ఎఫ్‌పీఐలకే బడ్జెట్‌ బాగుందా?

Thursday 6th February 2020
Markets_main1580966258.png-31555

తక్కువ అంచనాలున్నందున నిరాశపడని విదేశీ ఇన్వెస్టర్లు
సాధారణంగా విదేశీ ఫండ్‌ మేనేజర్లతో పోలిస్తే దేశీయ ఫండ్‌ మేనేజర్లు స్థానిక ఎకనమిక్‌ పరిస్థితులపై ఎక్కువ అవగాహన కలిగిఉంటారు. కానీ బడ్జెట్‌ తర్వాత మార్కెట్‌ గమనం చూస్తే విదేశీ ఫండ్స్‌కే బడ్జెట్‌ బాగా అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే విదేశీ మేనేజర్లు గత మూడునాలుగు సెషన్లుగా భారీ కొనుగోళ్లు జరుపుతున్నారు. బడ్జెట్‌ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో శనివారం రోజు దేశీయ ఇన్వెస్టర్లు, ఫండ్‌ మేనేజర్లు భారీగా అమ్మకాలు జరిపారు. కానీ విదేశీ ఫండ్‌ మేనేజర్లు ముందునుంచి ఒక మోస్తరు అంచనాలతోనే ఉన్నారు. ఉదాహరణకు బడ్జెట్లో భారీ సంస్కరణలుండవని, ఉంటేగింటే ఐటీలో చిన్నపాటి మార్పులుండొచ్చని, ప్రస్తుతం ప్రభుత్వం పన్నువసూళ్లు తక్కువగా వస్తున్నందున భారీ మార్పులకు వెళ్లకపోవచ్చని వోంటోబెల్‌ ఏఎంసీ మేనేజర్‌ రమీజ్‌ చెలాట్‌ బడ్జెట్‌కు ముందే అంచనా వేశారు. పైగా సావరిన్‌ రేటింగ్‌ను దెబ్బతీసే భారీ మార్పులను ప్రభుత్వం ఈ దశలో తీసుకురాదని చాలామంది విదేశీ మేనేజర్లు భావించారు. అందుకే లోకల్‌ మేనేజర్లు, ఇన్వెస్టర్లలాగా చౌక షేర్లు, వాల్యూషన్లు తగ్గిన షేర్లు అని వెంపర్లాడకుండా ఎప్పటిలాగానే అవే 15-20 క్వాలిటీ స్టాకులపైనే విదేశీ మేనేజర్లు పెట్టుబడులు కొనసాగించారు. అందువల్ల బడ్జెట్‌ అనంతరం తిరిగి అవే క్వాలిటీ స్టాక్స్‌ దూసుకుపోవడం ఆరంభమైంది. మరోవైపు ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగ స్టాకులపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న దేశీయ ఫండ్‌మేనేజర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ సమయంలో వీరంతా తిరిగి తమ పోర్టుఫోలియోల పునర్‌వ్యవస్థీకరణ పనిలో పడ్డారు. ఈ దశలో మరికొన్నాళ్లు లార్జ్‌ క్యాప్స్‌, క్వాలిటీ క్యాప్స్‌ హవానే కొనసాగుతుందని, చిన్న మిడ్‌క్యాప్‌ స్టాకులు పుంజుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. You may be interested

కేడిలా హెల్త్‌, డీమార్ట్‌ అధరహో..!

Thursday 6th February 2020

5 శాతం జంప్‌చేసిన కేడిలా హెల్త్‌ చరిత్రాత్మక గరిష్టానికి చేరిన డీమార్ట్‌  ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఓవైపు ఫార్మా రంగ కంపెనీ కేడిలా హెల్త్‌కేర్‌, మరోపక్క డిమార్ట్‌ బ్రాండ్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. వెరసి రెండు

ఏజీఆర్‌ చెల్లింపులకు పదేళ్ల గడువు: వొడాఫోన్‌

Thursday 6th February 2020

5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకి నో: ఎయిర్‌టెల్‌  52 వారాల గరిష్టానికి ఎయిర్‌టెల్‌ షేరు 1 శాతం లాభంతో వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు పదేళ్ల గడువును ఇవ్వవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ తాజాగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఏజీఆర్‌ బకాయిలలో కలిసి ఉన్న వడ్డీలు, పెనాల్టీలను రద్దు చేయవలసిందిగా వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌ కోరారు. వీటిని మినహాయించిన ఏజీఆర్‌ అసలు(ప్రిన్సిపల్‌) బకాయిలను చెల్లించేందుకు పదేళ్ల గడువును అభ్యర్థించారు. అంతేకాకుండా ఏజీఆర్‌

Most from this category