News


ఏడు రోజుల్లో చెల్లింపులు: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Saturday 8th June 2019
Markets_main1559978555.png-26174

  • అన్ని చర్యలు తీసుకుంటామన్న కంపెనీ 
  • నిధుల సమస్యకు నిదర్శనం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌: ఫిచ్‌
  • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై మరింత ఒత్తిడి: యూటీఐ ఎమ్‌ఎఫ్‌


న్యూఢిల్లీ: నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)పై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ, ఏడు రోజుల గ్రేస్‌ పీరియడ్‌లో అన్ని చెల్లింపులు సకాలంలో పూర్తి చేస్తామని, భవిష్యత్తుల్లో చెల్లింపుల్లో విఫలం కాబోమని పేర్కొంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసిన నాన్‌ కన్వర్టబుల్‌  డిబెంచర్లు(ఎన్‌సీడీ)కు వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ అంగీకరించింది. అయితే ఏడు రోజుల్లో వీటిని చెల్లించడానికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి రూ.40,000 కోట్ల మేర చెల్లింపులు జరిపామని గుర్తు చేసింది. 

మరో 11 శాతం పతనమైన షేర్‌...
జూన్‌ 4న చెల్లించాల్సిన బాండ్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  విఫలం కావడంతో ఈ కంపెనీకి చెందిన రూ.850 కోట్ల కమర్షియల్‌ పేపర్స్‌(సీపీ) రేటింగ్‌ను రేటింగ్‌ సంస్థలు క్రిసిల్‌, ఇక్రాలు డౌన్‌గ్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ డౌన్‌గ్రేడ్‌ కారణంగా గురువారం 16 శాతం పతనమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ శుక్రవారం మరో 11 శాతం నష్టపోయింది. బీఎస్‌ఈలో రూ.83 వద్ద ముగిసింది. 

పావు శాతం కోత ఉన్నా, రుణ వృద్ధి అంతంతమాత్రమే....
కాగా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ లిక్విడిటీ సమస్యలు, చెల్లింపుల్లో విఫలం కావడం... నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఎదుర్కొంటున్న నిధుల సమస్యకు అద్దం పడుతున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ వ్యాఖ్యానించింది. నిధుల లభ్యత సమస్యను అధిగమించడానికి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు అమెరికా డాలర్‌ బాండ్‌ మార్కెట్‌ ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తున్నాయని పేర్కొంది. ఆర్‌బీఐ పావు శాతం మేర రెపోరేటును తగ్గించినప్పటికీ, భారత్‌లో రుణ వృద్ధి మందగమనంగానే ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై మరింత ఒత్తిడి..! 
బాండ్లకు సంబంధించి వడ్డీ, అసలు చెల్లింపుల్లో  విఫలం కావడంతో, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాఖ్యానించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రుణాలిచ్చిన సంస్థలు చట్ట ప్రకారం మరిన్ని చర్యలకు సిద్ధపడతాయని, ఫలితంగా కంపెనీ రికవరీ ప్రయత్నాల్లో మరింతగా జాప్యం జరుగుతుందని పేర్కొంది. కంపెనీ రికవరీపై అనిశ్చితి అధిక స్థాయిలో ఉన్నందున  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గిస్తున్నామని తెలిపింది. You may be interested

పావుగంటలో పాకెట్‌ మనీ!!

Saturday 8th June 2019

ఆధార్, స్టూడెంట్‌ ఐడీ సమర్పిస్తే చాలు విద్యార్థులకు రుణాలివ్వటమే ఎంపాకెట్‌ ప్రత్యేకత 5 లక్షల మంది యూజర్లు; ఏటా రూ.500 కోట్ల పంపిణీ త్వరలోనే కొత్త ఉద్యోగులకు పర్సనల్‌ లోన్స్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో ఎంపాకెట్‌ ఫౌండర్‌ గౌరవ్‌ జలాన్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగస్తులో లేదా వ్యాపారస్తులో... అది కూడా సిబిల్‌ స్కోర్‌ సరిగా ఉన్నవాళ్లకు మాత్రమే బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు అందిస్తుంటాయి. మరి, చదువుకునే విద్యార్థులు లేదా అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత పరిస్థితేంటి?

చందా కొచర్‌కు ఈడీ సమన్లు

Saturday 8th June 2019

జూన్ 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్‌ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో కొచ్చర్‌ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది.

Most from this category