News


ఐదున్నరేళ్ల కనిష్టానికి డీఎల్‌ఎఫ్‌

Thursday 6th June 2019
Markets_main1559809231.png-26135

ద్రవ్యకొరతతో దివాళ తీసిన డీఎల్‌ఎఫ్ కంపెనీ షేర్లు గురువారం మరో 15శాతం నష్టపోయాయి. ఇటీవల కంపెనీ జారీ చేసిన కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ ఏజెన్సీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.100.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్లపై ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కంపెనీ గత కొంతకాలం వరుసగా డిబెంచర్లపై రుణాలను చెల్లించడంలో విఫలం అవుతుండం, ద్రవ్యత్వ నిల్వలు రోజురోజూకు అడుగంటిపోతుండం ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 16శాతం నష్టపోయి రూ. 93.75ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఈ ధర షేరుకు ఐదున్నరేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది రూ.690ల వద్ద ఏడాది గరిష్టం నుంచి షేరు మొత్తం 86శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.100.45)తో పోలిస్తే 15.50శాతం నష్టంతో రూ.94.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.93.75 రూ.690.00లుగా నమోదయ్యాయి. 
ఇక సమయానికి సెన్సెక్స్‌ 474 పాయింట్లు నష్టపోయి 39609.49 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు తగ్గి 11873.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నష్టాల్లో అనిల్‌ అంబానీ షేర్లు

Thursday 6th June 2019

అనిల్‌ అంబానీ కంపెనీ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 13శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ఫ్రా షేర్లు 12శాతం నష్టపోయాయి. ఇంట్రాడేలో రూ.85.50ల వద్ద ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. మిడ్‌సెషన్‌ సమయానికి 11శాతం నష్టంతో రూ.86.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు 8శాతం నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ సమయంలో 7.50శాతం నష్టంతో 112.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌తో పెరిగిన రిస్క్‌ భయాలు!

Thursday 6th June 2019

సీఎల్‌ఎస్‌ఏ హెచ్చరిక            దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు చెందిన కమర్షియల్‌ పేపర్ల రేటింగ్‌ను దేశీయ రేటింగ్‌ ఏజన్సీలు ఇక్రా, క్రిసిల్‌ సంస్థలు ఏ4 నుంచి డిఫాల్ట్‌కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. మంగళవారం కంపెనీ తన ఎన్‌సీడీలపై చెల్లించాల్సిన వడ్డీలను చెల్లించలేకపోయింది. అయితే ఈ ఇబ్బందిని ఎదుర్కొనేందుకు ఫైనాన్షియర్లతో చర్చలు జరుపుతున్నామని, డిఫాల్ట్‌ కాకుండా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. తమకున్న 7 రోజుల గ్రేస్‌ పిరియడ్‌లోపు

Most from this category