News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 18శాతం డౌన్‌..!

Wednesday 22nd May 2019
Markets_main1558506786.png-25876

ద్రవ్య కొరతతో రుణ సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న ఫైనాన్సియల్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌హెచ్‌ షేర్లు బుధవారం 18శాతం నష్టపోయాయి. ద్రవ్య నిల్వల సంరక్షణలో భాగంగా కంపెనీ కొత్త డిపాజిట్లు స్వీకరించడాన్ని, పాత డిపాజిట్ల పునురద్ధణలు నిలిపివేస్తున్నట్లు మంగళవారం కస్టమర్లకు ఈ - మెయిల్‌ ద్వారా సందేశాన్ని పంపింది. వైద్య, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కాలపరిమితి పూర్తి కాని విత్‌డ్రాయిల్‌లు అనుమతించబడాయని కంపెనీ తెలిపింది. ఇటీవల రేటింగ్‌ సంస్థలు పలుమార్లు కంపెనీ రుణ సౌకర్యాలను డౌన్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో డీఎఫ్‌ఎఫ్‌హెచ్‌ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెప్పుకొచ్చాయి.  తాజాగా రూ. 20,000 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ ప్రోగ్రామ్‌పై రేటింగ్‌ను కేర్‌ ఎ నుంచి బిబిబి(-)కు సవరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 10శాతం నష్టంతో రూ.116.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఒకానొక దశలో రూ. 17.50శాతం నష్టపోయి రూ.107.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.11:30ని.లకు కల్లా దాదాపు సగానికి పైగా రికవరీ అయ్యి షేరు గత ముగింపు ధర(129.9)తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.118.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.97.00  రూ.690.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

నిరాశపరిచిన టెక్‌ మహీంద్రా

Wednesday 22nd May 2019

నికర లాభం 8 శాతానికి పైగా క్షీణత రూ.1,126 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్‌ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని,

మెగా బ్యాంకుల సందడి!!

Wednesday 22nd May 2019

కనుమరుగు కానున్న ఆంధ్రా బ్యాంక్‌  పీఎన్‌బీలో విలీనం; మరో రెండు కూడా!! మూడు నెలల్లో ప్రక్రియ పూర్తికి ప్రయత్నాలు కెనరాలోనూ ఇతర బ్యాంకులను కలిపే యోచన న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎస్‌బీఐ, బీవోబీ తర్వా మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్‌బీలో రెండు లేదా మూడు

Most from this category